17/3*గేయారాధన* తిరుప్పావై పాశురాలు*

తిరుప్పావై పాశురాలు 🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻 తిరుప్పావై పాశురాలు పూర్వభాగం (1-15) తిరుప్పావై పాశురం 1 గోవిందు సేవకు వేళయిదే గోపికలారా రారమ్మా! లోకం మురియగ,తరింపగా శ్రీ కృష్ణ నామం జపింతుమా! మార్గ శీర్షమున శుక్ల పక్షమిది పూర్ణ చంద్రుడుదయించు రోజులివి సిరులు పొంగు వ్రేపల్లె వాడలో సింగారించిన బాలికలారా! తెలవారకనే నిద్దురలేచి నదికి పోయి సుస్నానము జేసి మార్గ శీర్షపు వ్రతమాచరింపగ తరుణుల్లారా!తరలండీ నందగోపుడే వేలాయుధుడై కృష్ణ స్వామిని కాచుచుండును విశాలనయన ఆ యశోద చెంత బాల సింహమై గోపాలుడాడును నల్ల మేఘమే తన మేనిఛాయ ఎర్ర తామరలు స్వామి కన్నులు సూర్యుని తేజం,చంద్రుని చలువ తొణికిసలాడే వదనము గనుమా! నంద నందనుడు నారాయణుడే వేరొకరిని మరి వేడగనేలా! పర అను వాద్యం వరముగనిమ్మని అడిగిన మాధవు డనుగ్రహించులే. సింహాద్రి 16.12.2016. 🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻 తిరుప్పావై పాశురం 2 శ్రీరంగని మంది భావించి గోదాదేవి రచించిన రెండవ పాశురమీవేళ నిండు మనసుతో పాడుదమా! దుఃఖమయమ్మగు ఈ లోకాన శ్రీ కృష్ణుని సమకాలికులైన మీరే మీరే అదృష్టవంతులు మీదే మీదే ఆనందం నెమ్మదితో అల పాలకడలిలో శయనించిన ఆ పరమపురుషుని...