Posts

Showing posts with the label శ్రీ విష్ణు కందం

1/2.శ్రీ విష్ణు కందం (బ్రహ్మోత్సవాలు)

Image
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు  ఓం నమో వేంకటేశాయ  1.శ్రీయుతుడౌ తిరునాథుని శ్రేయము లొనగూర్పుమనుచు చేరి కొలువగన్ చేయుచు బ్రహ్మోత్సవములు మోయుదమిదె రండు భువిని మోసెడు స్వామిన్. 2.కం. బ్రహ్మోత్సవముల వేళల బహ్మాండమ్ముల విభుడిటు భక్తుల మదికిన్ బ్రహ్మానందము గూర్చుచు బ్రహ్మాండమ్ముగ తిరుమల వాడల వెడలున్. 3.కం. శారద‌ నవరాత్రులలో నారాయణి కొలువుదీరు నవదుర్గలుగా ఊరెరిగింపగ వెడలును నారాయణమూర్తియు తిరునగరము నందున్ అంకురార్పణం. 4.కం. నవరాత్రుల నాశ్వయుజపు శ్రవణానక్షత్రమందు శాస్త్రోక్తముగా నవపాలికలందు తొలుత నవధాన్యపు యంకురముల నాంది జరిగెడున్. విష్వక్సేన ఆరాధన  5.అదిగో విష్వక్సేనుడు కదిలెను బ్రహ్మోత్సవముల కనుపండువగా మొదలిడి జరిపించి భువికి ముదమును కలిగించు వేడ్క ముందు నడచుచున్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు  తొలి రోజు  బంగారు తిరుచ్చి ఉత్సవం  6.శృంగారము లొలికి విభుడు బంగారు తిరుచ్చి యుత్సవమ్మును గొనగాన్  సింగారపు దేవేరులు  చెంగట నిలువంగ వచ్చె చెలువము గనరే! ధ్వజారోహణం    7.కం. తిరుమల శ్రీవారికిదే  పర...