Posts

Showing posts from January, 2022

20/4*సుప్రభాత కాంతులు* కందంలో *మంగళా శాసనమ్* (14 శ్లోకాలు)

Image
******************************************************** *సుప్రభాత కందం* *స్వేచ్ఛానువాదం* *శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనమ్* (14 శ్లోకాలు) *శ్లోకం..57* శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే‌ర్థినామ్ | శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్||  *కందం..57* మంగళమో లక్ష్మీశా! మంగళమో భక్తసులభ! మహనీయగుణా! మంగళమో శ్రీ నిలయా! మంగళమో తిరుమలేశ!మంగళమయ్యా!  తాత్పర్యం..  ఓ లక్ష్మీపతీ!ఓ భక్తసులభా!ఓ మహనీయగుణాకరా!ఓ శ్రీ నిలయా!ఓ తిరుమలేశా!నీకు మంగళమగుగాక! ***************************** *శ్లోకం..58* లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే | చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ || *కందం..58* అచ్చెరువున శ్రీదేవిని విచ్చిన కనుదోయి మెరయ వింటిబొమలతో ముచ్చట మీరగ గాంచెడు పచ్చవిలుతుతండ్రి!నీకు భద్రమగు నయా! 2. తాత్పర్యం.. ఓ మన్మధజనకా!చక్కనైన కనుబొమలతో అలరారి మెరుస్తూ  విచ్చిన కన్నులతో ముచ్చటమీరగా నీ సతియైన లక్ష్మీదేవిని చూసే ఓ స్వామీ!నీకు మంగళమగుగాక.  **************************** *శ్లోకం..59* శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే| మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్|| *కందం..59* వేంకట...

11/12.రోజుకో చరిత్ర (డిసెంబర్)

Image
డిసెంబర్ 01 World AIDS day నేను నర్సరావుపేటలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉద్యోగం చేసే రోజుల్లో కాలేజ్ లో నేను ఎన్.ఎస్.ఎస్.బాలికా విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ని‌ కూడా. అప్పట్లో కళాశాల విద్యార్థులలో కూడా హెచ్.ఐ.వి.పాజిటివ్ కేసులు వెలుగు చూసి ఆందోళనకు గురిచేస్తున్న కాలమది.పందొమ్మిది నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు వాళ్ళల్లో కూడా నలభై శాతం ఈ వైరస్ విస్తరిస్తోందని గుర్తించిన  ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని ‌కళాశాల విద్యార్థులను అప్రమత్తం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి,ఆ భారాన్ని లెక్చరర్ ల భుజాలపై ఉంచింది. ముందుగా వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి వారిద్వారా విద్యార్థులను మేల్కొలపాలని నిర్ణయించింది. అందుకోసం ప్రతి కాలేజ్ నుండి ఒక లేడీ మరియు జంట్ లెక్చరర్ ను పంపమని కళాశాలలను ఆదేశించింది.కానీ ఈ వ్యాధి పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే ఆ రోజుల్లో ఆ ట్రైనింగ్ కి వెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఎన్.ఎస్.ఎస్.ఆఫీసర్లు గా మా సామాజిక బాధ్యతను గుర్తించిన నేను,నా తోటి లెక్చెరర్ శ్రీ గురుకిషన్ ఆ ట్రైనింగ్ కి వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాము. ఆ...

11/9.రోజుకో చరిత్ర (సెప్టెంబర్)

Image
*మమ (అ) కారం* మనవల సాన్నిహిత్యం  ఒకప్పుడు  వృద్ధాప్యానికి  *నిత్యమై*  ఆనందాన్నిచ్చింది  ఆ తర్వాతి కాలంలో  కొంతమందికి అందిన అదృష్టమై  మరికొందరికి దొరకని భాగ్యమై అది *వైకల్పికం* గా మారింది . బిడ్డలకు తల్లిదండ్రులు బరువై  వారి ఆదరణ కరువైన సందర్భాలలో ఆ బంధం *నిషేధ* మయ్యింది  ఇక పిల్లలు దూరదేశాలలో స్థిరపడిపోయిన ఈ రోజులలో  అది స్కైపులో ముద్దుముద్దు పలకరింపై *అన్యవిధ* మయ్యింది మొత్తానికి  ఇంతకాలానికి  ఈవేళ  తెలుగు ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ కూడా  చేసిన తర్వాత  అమ్మమ్మ ను, నాయనమ్మను కూడా  అయిపోయాక నాకు  సంపూర్ణంగా  సోదాహరణంగా  అర్థమయ్యింది *అకారసంధి* 🤣 సెప్టెంబర్ మొదటి ఆదివారం 8.9.2024 గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా నా కవిత సింహాద్రి జ్యోతిర్మయి  న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  8.9.2024 September 13 గ్రాండ్ పేరెంట్స్ డే మనవలు వంశవృక్షపు  చిటారు కొమ్మలు ఊతమిచ్చి  ఆ చెట్టును నిలబెట్టే మానులు, వేళ్ళు తాతలు బామ్మలు మురిపెంతో ప...