ముఖే ముఖే సరస్వతీ
గురువు గారు నా గురించి రాసిన పద్యం ఆ. వె|| రచ్చబండ యైన రాజ్యాంగమది యైన విషయమేది యైన వీగిపోక జ్యోతి అక్క బల్కు జోరైన పద్యముల్ అక్క పద్యమనిన ఆవకాయ కందం. మించియు పొగమంచు దిశలు కొంచెమయిన కానరాక కురియుచు నుండెన్ *పంచవటి* ని దివ్యులు దీ వించిరి గాబోలు నిట్లు విజయో స్తంచున్ . 😍😍 సింహాద్రి జ్యోతిర్మయి పంచవటి శిష్యురాలు నేను రాసిన ఈ పద్యానికే గురువు గారు పై పద్యం రాశారు. 1. బ్రహ్మ కొడుకు మరీచి 2. మరీచి కొడుకు కాశ్యపుడు. 3. కాశ్యపుడు కొడుకు సూర్యుడు. 4. సూర్యుడు కొడుకు మనువు. 5. మనువు కొడుకు ఇక్ష్వాకువు. 6. ఇక్ష్వాకువు కొడుకు కుక్షి. 7. కుక్షి కొడుకు వికుక్షి. 8. వికుక్షి కొడుకు బాణుడు. 9. బాణుడు కొడుకు అనరణ్యుడు. 10. అనరణ్యుడు కొడుకు పృధువు. 11. పృధువు కొడుకు త్రిశంఖుడు. 12. త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు. 13. దుంధుమారుడు కొడుకు మాంధాత. 14. మాంధాత కొడుకు సుసంధి. 15. సుసంధి కొడుకు ధృవసంధి. 16. ధృవసంధి కొడుకు భరతుడు. 17. భరతుడు కొడుకు అశితుడు. 18. అశితుడు కొడుకు సగరుడు. 19. సగరుడు కొడుకు అసమంజసుడు. 20. అసమంజసుడు కొడుకు అంశుమంతుడు. ...