ముఖే ముఖే సరస్వతీ




గురువు గారు నా గురించి రాసిన పద్యం

ఆ. వె|| 
రచ్చబండ యైన రాజ్యాంగమది యైన
విషయమేది యైన వీగిపోక 
జ్యోతి అక్క బల్కు జోరైన పద్యముల్ 
అక్క పద్యమనిన ఆవకాయ

కందం.
మించియు పొగమంచు దిశలు
కొంచెమయిన కానరాక కురియుచు నుండెన్ 
*పంచవటి* ని దివ్యులు దీ
వించిరి గాబోలు నిట్లు  విజయో స్తంచున్ .  😍😍

సింహాద్రి జ్యోతిర్మయి 
పంచవటి శిష్యురాలు
నేను రాసిన ఈ పద్యానికే గురువు గారు పై పద్యం రాశారు.




1. బ్రహ్మ కొడుకు మరీచి
2. మరీచి కొడుకు కాశ్యపుడు.
3. కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
4. సూర్యుడు కొడుకు మనువు.
5. మనువు కొడుకు ఇక్ష్వాకువు.
6. ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
7. కుక్షి కొడుకు వికుక్షి.
8. వికుక్షి కొడుకు బాణుడు.
9. బాణుడు కొడుకు అనరణ్యుడు.
10. అనరణ్యుడు కొడుకు పృధువు.
11. పృధువు కొడుకు త్రిశంఖుడు.
12. త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.
13. దుంధుమారుడు కొడుకు మాంధాత.
14. మాంధాత కొడుకు సుసంధి.
15. సుసంధి కొడుకు ధృవసంధి.
16. ధృవసంధి కొడుకు భరతుడు.
17. భరతుడు కొడుకు అశితుడు.
18. అశితుడు కొడుకు సగరుడు.
19. సగరుడు కొడుకు అసమంజసుడు.
20. అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
21. అంశుమంతుడు కొడుకు దిలీపుడు. 
22. దిలీపుడు కొడుకు భగీరధుడు.
23. భగీరధుడు కొడుకు కకుత్సుడు.
24. కకుత్సుడు కొడుకు రఘువు.
25. రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
26. ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
27. శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
28. సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
29. అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
30. శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
31. మరువు కొడుకు ప్రశిష్యకుడు.
32. ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
33. అంబరీశుడు కొడుకు నహుషుడు.
34. నహుషుడు కొడుకు యయాతి.
35. యయాతి కొడుకు నాభాగుడు.
36. నాభాగుడు కొడుకు అజుడు.
37. అజుడు కొడుకు ధశరథుడు.
38. ధశరథుడు కొడుకు రాముడు.
39. రాముడి కొడుకు లవ కుశలు

వారాల పేర్లు ‌ఏర్పడ్డ విధానం
మైలవరపు శ్రీనివాసరావు గారు 
https://fb.watch/l47Ctag-0g/?mibextid=NnVzG8


[21/09, 8:08 am] Prabhakar: *సంస్కృతములో - పుష్పాల పేర్లు*

1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపన: = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు.
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.పున్నగం = పొన్న పువ్వు
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.కుముదం = మల్లె
35.పుష్ప మంజరీ = పూలవెన్ను.. 

సేకరణ
[21/09, 8:08 am] Prabhakar: #*నైవేద్యాల పేర్లు*

*తెలుగు పేర్లు–సంస్కృతం పేర్లు*
*పళ్ళు*
అరటిపండు – కదళీఫలం
ఆపిల్ – కాశ్మీరఫలం
ఉసిరికాయ – అమలక
కిస్మిస్ – శుష్కద్రాక్ష
కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం
కొబ్బరికాయ చిప్పలు – నారికేళ ఖండద్వయం
ఖర్జూరం – ఖర్జూర
జామపండు – బీజాపూరం
దబ్బపండు – మాదీఫలం
దానిమ్మపండు – దాడిమీఫలం
ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం
నారింజ – నారంగ
నిమ్మపండు – జంభీరఫలం
నేరేడుపండు – జంబూఫలం
మామిడి పండు – చూతఫలం
మారేడుపండు – శ్రీఫలం
రేగు పండు – బదరీ ఫలం
వెలగపండు – కపిత్తఫలం
సీతాఫలం – సీతాఫలం

*విశేష నివేదనలు*

అటుకులు – పృథక్
అటుకుల పాయసం – పృథక్పాయస
అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం
అన్నం (నెయ్యి, కూర, పప్పు, పులుసు, పెరుగు) – మహానైవేద్యం
ఉగాది పచ్చడి – నింబవ్యంజనం
కట్టుపొంగలి (మిరియాల పొంగలి) – మరీచ్యన్నం
కిచిడీ – శాకమిశ్రితాన్నం
గోధుమ నూక ప్రసాదం – సపాదభక్ష్యం
చక్కెర పొంగలి – శర్కరాన్నం
చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం
నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం
నువ్వుల పొడి అన్నం – తిలాన్నం
పరమాన్నం (పాలాన్నం) - క్షీరాన్నం
పానకం – గుడోదకం, మధుర పానీయం
పాయసం – పాయసం
పిండివంటలు – భక్ష్యం
పులగం – కుశలాన్నం
పులిహోర – చిత్రాన్నం
పెరుగన్నం – దధ్యోదనం
పేలాలు – లాజ
బెల్లపు పరమాన్నం –గుడాన్నం
వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్
వడలు – మాసపూపం
శెనగలు (శుండలు) – చణకం
హల్వా – కేసరి

*వివిధ పదార్థాలు*
అప్పాలు – గుడపూపం
చెరుకు ముక్క – ఇక్షుఖండం
చక్కెర – శర్కర
తేనె – మధు
పాలు – క్షీరం
పెరుగు – దధి
బెల్లం – గుడం
వెన్న – నవనీతం🙏

#అందరికి ముందుగా గణేష్ చతుర్దశి శుభాకాంక్షలు🌹

#సర్వోజనా సుఖినోభావంత్🙏



*మనవారి మేధ*

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం (రెప్ప పాటుకాలం)
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము, ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ...లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతా యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం (చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట
             (--భాగవతాదారితం )

ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు. విదేశీయులు మాత్రమే కనుగొన్న ట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి.

*_పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు_*

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.

1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.

7 . సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన 
మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం 
చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

*శ్రీ ఆది శంకరుల విరచిత ... శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము* 

*1.విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం*
*పశ్యన్నాత్మని మాయయా* *బహిరివోద్భూతం* *యధానిద్రయా*
*యస్సాక్షాత్కురుతే* *ప్రభోధసమయే స్వాత్మానమే* *వాద్వయం*
*తస్మై శ్రీగురు మూర్తయే* 
*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*2.బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః*
*మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం*
*మాయావీవ విజృంభ త్యపి మయా* *యోగేవయః స్వేచ్ఛయా*
*తస్మై శ్రీగురు మూర్తయే* 
*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*3.యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే*
*సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్*
*యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ*
*తస్మై శ్రీగురు మూర్తయే* 
*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*4.నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప* *ప్రభాభాస్వరం*
*జ్ఞానం యస్యతు* *చక్షురాదికరణ* *ద్వారా బహిస్పందతే*
*జానామీతి తమేవ* *భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్*
*తస్మై శ్రీ గురు మూర్తయే* 
*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*5.దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః*
*స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః*
*మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే*
*తస్మైశ్రీ గురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*6.రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్*
*సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్*
*ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే*
*తస్మై శ్రీగురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*7.బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా స్వవస్థాస్వపి*
*వ్యావృత్తా స్వను వర్తమాన మహమి* *త్యంతస్స్ఫురంతం* *సదా స్వాత్మానం* *ప్రకటికరోతిభజతాం* *యోముద్రయా భద్రయా*
*తస్మైశ్రీగురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 

*🌟ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*8.విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః*
*శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః*
*స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః*
*తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 

*🌟 ఎవరి మాయ వలన ఈప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*9.భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః* *పుమాన్*
*నిత్యభాతి* *చరాచరాత్మక* *మిదం* *యస్మైచ మూర్త్యష్టకం*
*నాన్యత్కించ నవిద్యతే* *విమృశతాంయస్మాతత్పర స్వాదిభో*
*తస్మై గిరి మూర్తయే* 
*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 

*🌟ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*10.సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్* *స్తవే తేనాస్వ* *శ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్*
*సర్వాత్మత్వ మహావిభూతి సహితం* *స్వాదీశ్వత్వం స్వతః*
*సిద్ధేత్తత్పురష్టధా* *పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్!!*

*🌟ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును. సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*

*లీలాశుకుడు- శ్రీకృష్ణ కర్ణామృతము*

లీలాశుకుడు కాలము 12 వశతాబ్దమని 15 వశతాబ్దమని మరి కొందరు, విద్వాంసులు నుడివిరి.

ఈయన యే ప్రాంతమువాడో స్పష్టముగా తెలియ వచ్చుటలేదు.

శుకయోగి లీలావతారముగా పరిగణింప బడ్డ ఇతని గురువు సోమగిరి. తల్లి నీవి.తండ్రి దామోదరుడు. 

ఈ లీలశుకుడు మొదట బిళ్వమంగళుడు. అతడు మొదట ప్రాకృత దర్శనమునందుండి పాపము నాశ్రయించి, చింతామణి అను వేశ్య పట్ల అత్యంతాసక్తుడయ్యెను.

ఒకనాడు కృష్ణా నదిని సమయము గాని సమయమున దాటి చింతామణి దగ్గరకు అతికష్టముతో వెడలి ఆమె చూపిన వైరాగ్యమునకు కదలి, ఉపదేశము పొందెను.

మొదట ఇతనికి ఆధ్యాత్మిక దర్శనమున స్పృహ కలిగెను. తాను రచించిన " అద్వైత వీథీ పథికై రూపస్య" అను శ్లోకమున తన రెండు స్థితులను వెల్లడించెను.

చివరకు అతడు వైష్ణవ సాంగత్యము చేత ,వైష్ణవోపదేశము చేత భక్తుడయ్యెను. అప్రాకృత దర్శనము చేత వానికి రతి కలిగెను. జాత రతుడై అతడు కృష్ణ రసమున ప్రవేశించెను. 

అపై గొప్పకృష్ణ భక్తుడైన లీలాశుకుడు మధుర భక్తితో , మాధుర్యోపాసనలో శ్రీకృష్ణుని నామ గుణలీలా స్వరూపములను వర్ణించుటలో యెంతగానో లీనుడయ్యెను. 

ఈ భావనా సమాధిస్థితిలో ఆయన, *శ్రీకృష్ణ కర్ణామృతమను* దివ్య స్తోత్ర గ్రంథమును రచించెను. 

ఈ శ్రీకృష్ణకర్ణామృతములోని ప్రతి శ్లోకము లోనూ లీలాశుకుని ప్రేమభక్తి నిండియున్నది. మధుర భక్తి ఉపాసకులకు ఈ స్తోత్ర కావ్యము మిగుల ఉపాదేయమైనది.

శ్రీ లీలాశకుని ఈ శ్రీ కృష్ణకర్ణామృతము అమృత భాండారము. ఈ అమృత భాండారములోని ఒక్క బిందువైననూ రుచిచుచినవాడు సాంసారిక ద్వందములనుండి ముక్తుడగును. శ్రీకృష్ణ లీలాకథలందు, స్వరూప మాధురియందు మునిగిన మానవుడు సాంసారిక ధర్మములను పాలించుచున్నను చివరకు భగవానుని శరణములోనికి చేరును. 

శ్రీకృష్ణ కర్ణామృతము భక్తజనులు , కవులు, శాస్త్ర వేత్తలు, అందరూ ఆస్వాదించదగిన మధుర పాయసము. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే అన్నీ పోషక పదార్థములు ఇందులో యున్నవి. 

ఈ కావ్య పఠనమువలన శుద్ధ ప్రేమజ్ఞానము అలవడుతుంది. శ్రీకృష్ణుని సౌందర్య మాధుర్య లీలల హద్దులు అవగతమవుతాయి.

అంధ్రులలో ఈ శ్రీకృష్ణ కర్ణామృతము పట్ల యెంతో ఆదరణ కలదు. 

శ్రీకృష్ణ కర్ణామృతము మూడు ఆశ్వాసములు. ప్రసిద్దములైన సుమధురములైన యెన్నొశ్లోకములు రెండు .మూడు ఆశ్వాసములలో కనబడును. 

కొన్ని ప్రసిద్ధి చెందిన శ్లోకములు .....

1: *"కస్తూరి తిలకము లలాట ఫలకే " (2-109)* 

2: *"కరారవిందేన ముఖారవిందం " (2-57)* 

3: *"కంకణ కిణికిణి రభసై " (2-75 )*  

4: *"ముఖార విందే మకరంద బిందు " (3- 28)* 

5: *"కరకమల దళ దళిత లలిత తర వంశి " (1-52)* 

6: *"బాలోయ మాలోల విలోచనేన "( 1-69 )*

7: *"మందార మూలే మదనాభిరామం " ( 1-100)*

8: *"గోధూళి ధూసిరిత కోమల కుంతలాగ్రం "*(2-26)
( పోతన గారి " హయ రింఖాముఖ ధూళిదూసరిత పర్యన్యస్తాల కోపేతమై " గుర్తు తెస్తుంది)

9: *"అంగనా మంగనా మంతరే మాధవో " (2-35)*
 ( నారీ నారీ నడుమ మురారీ పాట గుర్తు తెస్తుంది )

10: *"బాలాయ నీల విపుషే నవ కింకణీక "(2-73)*  
 
11: *" సజల జలద నీలం వల్లవీ కేళీ లోలము--" నౌమి గోపలబాలం " ( 2-12)*

12: *"మందం మందం మధుర నినదైర్ వెణు మాపూరయంతం" (2-6 )*

మనసుపెట్టి చదివితే పరవశంతో ఆనందంఅంచులవరకూ చేరుకోగలం!

   ఇదే "రసోవైసః"-అనేవేదవాక్యంలోనిపరమార్ధం!

            స్వస్తి!
         assalamualaikum రసజ్ఞభారతిసౌజన్యంతో-

చొప్పకట్ల 

అటజని కాంచె భూమిసురుడు పద్య వివరణ
http://telugupadyam.blogspot.com/2008/05/blog-post_25.html?m=1

దివాకర్ బాబు మాడభూషి 
(అన్ని కామెంట్స్ చదవండి. నేను చెప్పినది సత్యం. ఎవర్తోనూ ఆర్గ్యుమెంట్ చేయదలచుకోలేదు) 

కర్ణుడు

పుట్టంగానే తల్లి చేత విడిచి వేయబడిన వాడిగా మనమంతా ఎంతో జాలి చూపవలసిన పాత్ర! 

ఆ తర్వాతఅబద్ధాలు చెప్పి పరశురాముడి వద్ద ధనుర్విద్య అభ్యసించాడు. 

అప్పుడున్న నిబంధనల వల్ల పోటీల్లో పాల్గొన లేకపోతే దుర్యోధనుడు పడేసిన ముష్టికి కక్కుర్తి పడ్డాడు. 

దుర్యోధనుడు దుష్టుడని తెలిసినా అతని పక్కన చేరి వారించక పోగా చెడు పనులన్నీ ప్రోత్సహించాడు.  నిండు సభలో ద్రౌపది పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

నిజమైన స్నేహితుడయితే దుర్యోధనుడిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేవాడు. అది చేయలేదు. కారణం మంచి చెబితే రాజ్యం లాగేసుకుంటాడని భయం.

అసలు కర్ణుడు ఏ యుద్ధంలో నూ గెలువ లేదు. 
గెలిస్తే గిలిస్తే ఏవైనా చిన్న చిన్న రాజ్యాలు గెలిచాడేమో! 

గోగ్రహణం అప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయి  కేవలం అర్జునుడి దయాభిక్షతో బ్రతికాడు. 

ఘోష యాత్ర అప్పుడు గంధర్వ రాజు చేత తన్నులు తిని, భీమార్జునుల వల్ల కాపాడబడి ధర్మరాజు పెట్టిన ప్రాణ  భిక్షతో బ్రతుకు జీవుడా అని అంగ రాజ్యానికి చేరాడు. 

కురుక్షేత్ర సంగ్రామంలో (అహంకారంతో) ఇగో తో పంతాలకు పోయి సమయం వృధా చేశాడు. 

ఆ తర్వాత భీముడి చేతిలో ఓడిపోయి. భీముడు పెట్టిన భిక్షతో ప్రాణాలు కాపాడుకున్నాడు. 

ఏదైనా మంచిపని ఉందంటే… అది కుంతీ దేవి వచ్చి కర్ణుడిని జన్మ రహస్యం చెప్పి పాండవుల వైపు రమ్మంటే రానని తన స్వామి భక్తిని ప్రకటించుకోవడం! . 

దాన కర్ణుడంటారు. ఎవరి సొమ్ము ఎవరీకి దానం చేశాడు.తను ముష్టిగా పొందిన  కౌరవులు సొమ్ము నుండి దానం చేసి దాన కర్ణుడిని పేరు పొందడం హాస్యాస్పదంగా లేదూ… 

అయితే, ఇంద్రుడు వచ్చి సహజ కవచ కుండలాలు
దానం ఇమ్మని అడిగితే తన ప్రాణాలకు ముప్పు అని తెలిసినా దానం ఇచ్చాడు. ఈ ఒక్క దానానికి కర్ణుడ్ని
దాన కర్ణుడు అనవచ్చు.

ఇక, 
దుష్ట చతుష్టయంలో ఒకడై…. పద్మవ్యూహంలో పసివాడైన అభిమన్యుడ్ని అంతమంది యోధులతో కలిసి చుట్టుముట్టి చంపిన మహా వీరుడు కర్ణుడు. 

చివరికి 
తను చేసిన తప్పుకి పొందిన శాపాల వల్ల, చేసిన అకృత్యాల వల్ల ఓడిపోయి మరణించాడు. 

కొంతమంది ఎందువల్ల కర్ణుడిని గొప్పవాడని పొగుడుతారో అర్ధం కాదు!  సినిమాల్లో చూపించేవన్నీ నిజాలు కాదు. 
కర్ణుడిని గురించి తెలుసుకోవాలంటే మహాభారతం చదవండి🙏

సంతోష్ కుమార్ గారు ఏం చెప్తున్నారు చదవండి

కర్ణుడు గొప్ప యోధుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అంటున్నారు అది ఎంత మాత్రము నిజం కాదు అసలు  మహాభారతం లో ఎక్కువ సార్లు ఓడిపోయిన వీరుడు కర్ణుడొక్కడే
అతను ఓడిపోయిన యుద్ధలలో కొన్నిటిని చెప్తాను

ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో ఓడిపోతాడు 
దీనికి రిఫరెన్స్ 👇
అది పర్వం 189వ అధ్యాయం 10 నుండి 22 వ శ్లోకాలు

ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడితో ఓడిపోతాడు
రిఫరెన్స్ 👇
సభాపర్వం 30వ అధ్యాయం 18 నుండి 21 శ్లోకాలు

అరణ్యపర్వంలో గంధర్వులతో ఓడిపోతాడు
రిఫరెన్స్ 👇
241 వ అధ్యాయం 15 నుండి 32 శ్లోకాలు

విరాట పర్వం
అర్జునుడితో 3సార్లు ఓడిపోతాడు
రిఫరెన్స్ 👇
54 వ పర్వం 1 నుండి 36 శ్లోకాలు

60 వ అధ్యాయం 1 నుండి 27 శ్లోకాలు

ద్రోణ పర్వంలో అభిమన్యుడితో ఓడిపోతాడు 
40వ అధ్యాయం పూర్తిగా
41 వ అధ్యాయం 1 నుండి 8 శ్లోకాలు

భీముడి చేతిలో ఓడిపోతాడు చాలా సార్లు
ద్రోణ పర్వం 14వ రోజు యుద్ధం 129 వ అధ్యాయం నుంచి చదివితే అనేక సార్లు ఓడిపోయి పారిపోయినట్టు ఉంటుంది
అదే రోజు అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు
తర్వాత 17వ రోజు యుద్ధం లో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు 

అభిమన్యుడు చేతిలో రెండు సార్లు యుద్ధం నుంచి పారిపోతాడు.. 

ఇవి time సరిపోక చాల తక్కువ reference లు చెప్తున్నా కానీ ఇంకా అతను ఓడి పోయినా అనేక సందర్భాలు ఉన్నాయి

ఇవి తెలియక సినిమాలు చూసి సీరియల్స్ చూసి కర్ణుడు గొప్పా అనుకుంటే అది మీ కర్మ....

కర్ణుడు చరిత్రలో గొప్ప వీరులలో ఒకడు
కానీ అదే చరిత్రలో అతని కన్నా గొప్ప యోధులు వీరులు ఉన్నారు అందులో అర్జునుడు ఒకడు...
But ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా చరిత్రని వక్రీకరిస్తే ఆ చరిత్ర పాడవదు,దానికి ఏం కాదు,, కానీ పాడయ్యేది మన బుద్ధులు
మొన్నటి రాముడి కన్న రావణుడు గొప్ప అన్నారు ఇప్పుడు అర్జునుడి కన్నా కర్ణా గొప్ప అంటున్నారు అదే తేడా....
పూరాణాలు తెలుసుకోవాలి అంటే ప్రామాణిక పుస్తకాలు చదవండి 😊
జై శ్రీ రామ 🙏🚩



ఆంధ్ర సాహిత్యంలో ' ద్వర్ధికావాలు'
              ------------------------------------------------------: 

             "రెండర్ధంబుల పద్య మొక్కటైనన్ నిర్మింపంగ శక్యంబుగా

               కుండున్ ,దద్గతి కావ్యమెల్ల నగునే యోహోయనంజేయదే,

               పాండిత్యంబున , నందునన్ దెనుఁగు కబ్బం బద్భుతంబండ్రు ద

              క్షుండెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషాకృతిన్ ;

             
             " భీమన తొల్లి చెప్పెనను పెద్దలమాటయెగాని, యందు నొం

                డేమియు నేయెడన్ నిలుచు టెవ్వరుగానరు"----

        
                           అంటూ రాఘవపాండవీయ గ్రంధావతారికలో కృతిపతి చెప్పినట్లుగా పింగళి సూరనగారిమాట! కాబట్టి యిలాంటి గ్రంధాల రచన వేముల వాడ భీమన కాలంలోనే ప్రారంభమైనట్లు చెప్పుకోవచ్చు. కానీ ఆయన రాసిన రాఘవపాండవీయమనే గ్రంధం నేడు అలభ్యం. కారణాలు యేవైనా కావచ్చు ,నేడు మనకు లభిస్తున్న ద్వర్ధికావ్యాలలో పింగళిసూరన రచిం చిన రాఘవపాండవీయమే ప్ర ప్రధమ ద్వర్ధికావ్యం.

                                  ద్వి+ అర్ధి- ద్వర్ధి; ద్వి అంటే రెండు. అర్ధి అంటే అర్ధముల నిచ్చే కావ్యమని యర్ధము. ఏదో ఒకటి ,రెండు పద్యాలకు మాత్రమే పరిమితంగాక మొత్తం కావ్యమంతా కలసి రెండు కధలను సంపూర్ణంగా వినిపించాలి. అప్పుడది ద్వర్ధికావ్స మౌతుంది. ఈలక్షణం పూర్తిగా సమన్వయ మయ్యే కావ్యం "రాఘవ పాంజవీయము"-

                       ప్ధమాశ్వాస మాదిగా యిందులో ఉన్నప్రతిపద్యం రామ భారత కధలను వినిపిస్తూ ముందుకు సాగుతాయి. ఎక్కడా కధాగమనం కుంటుపడదు. ఈవిధంగా వ్రాయటం అద్భుతమేగదా? అసలేమిటిది? యెందుకిది? అని ప్రశ్న?  

                               ఇది కవి ప్రతిభా పాటవ ప్రదర్శనం ! తనకు సరి మరి లేరని చాటడం!  

                                                    నిజమే ! ఇట్టివారరుదే !లక్షల మందిలో యేయొక్కరో యిద్దరో మిగులుతారు. వారిని గురించి తెలిసికోవటానికే యీసాహితీ ప్రయాణం. సరిగ్గా సూరన సమకాలికుడు రామరాజ భూషణ కవి కూడా ఒక ద్వర్ధికావ్యం వ్రాశాడు
దానిపేరు "హరిశ్చంద్ర నలోపాఖ్యానము. కానీ అది రాఘవ పాండవీయమంత సులభ గ్రహ్యము కాకపోవుట దానికంతగా ప్రచారము
లేదు. ఆవెనుక నిట్టివేవో పలుకావ్యములు త్ర్యర్ధి ,(మూడర్ధాలు) చతురర్ధి ,(నాలుగు అర్దాలు) కావ్యాలువ్రాశారు.కానీయవి పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లైనవి.

         - పింగళి సూరన ప్రతిభకు ప్రతీకలు కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయాలు. రాఘవపాండవీయం కవితా ప్రామాణిక దృష్టిలో అత్యద్భుతమైన రచన. అట్టికావ్యం ఇప్పటివరకు మరొకటి లేకపోవటమే దాని
ప్రత్యేకతకు నిదర్శనం. రాఘవపాండవీయం శ్లేషకావ్యాలలో తలమానికం. సులభసుందర మైనశైలితో, అభంగ , సభంగ శ్లేషలతో ,
ఒకేపదము ఒక యర్ధమున తెనుగు గను, మరియొక యర్ధమున సంస్కృత పదముగను మారుచు విచిత్రముగా నర్ధద్వయ సంపాదన మొనరించు చుండును. ఒక చిన్న కంద పద్యం ఉదాహరణగా మీకీ గ్రంధంలోని రచనను పరిచయం చేస్తా!

                      కం: ఏనుంగని కరమరయక

                            పూనితిఁ గాకిట్టులేయ పొసఁగునె యెందున్,

                             కానమె కాలనియమగతితో

                             ముని యుగము ద్రుంచె, మునుకొని యిచటన్;

         సందర్భము: రామాయణార్ధమున: దశరధుడు వేటకు వచ్చాడు. శ్రవణకుమారుడు తలిదండ్రుల దాహముదీర్ప నీటికొరకై యేటిలో సొరకాయను ముంచ శబ్దమైనది. ఏనుగు నీరుద్రాగుచున్నదను భ్రమతో శబ్దవేధినుపయోగించెను.బాణాఘాతమున శ్రవణుడు నేలకొరిగెను. ఆవార్తవిని యతని తలిదండ్రులును మరణించిరి. అపుడు దశరధుని విషాద వాక్యములు.

          భారతార్ధము:- పాండు రాజు కుంతి మాద్రులతో కలసి హిమాలయ ప్రాంతమున వేటకు వచ్చెను.మృగరూప ధారులై క్రీడించు
కిందము డను మనిపై బాణప్రయోగమును చేసెను. కిందముడు పాండురాజును శపించి మరణించెను.అపుడతనిభార్యయు భర్తననుగ
మించెను. ఆస్థితిలో పాండురాజు విషాద వాక్యములు.

      అన్వయం: రామాయణం: ఏనుంగని ,కరమరయక , ఏసితిగాక , యిట్టులేయ పొసగునె, కాననె కాలకర్మగతితో ,మునియుగమున్ ద్రుంచెన్: అనియన్వయము. ఏనుగేమో యనుకొని బాణంవేశాను. సరిగా చూసుకోవాలిగదా! యిలాతొందరపడరాదు. యింతకీ 
కాలనియమం వారికి పూర్తయింది. అందుకే నాకుజాగ్రత్తకొరవడింది.ఇంతకీ కాలందీరింది ఆదంపతులు మరణించారు.నేను నిమిత్తమాత్రుణ్ణే! అనిదశరధుడనుకొంటున్నాడు.

               భారతం: ఏనుం,గనికరమరయక, యేసితిగాక, అట్టులేయ పొసగునె, కాననె (మె) కాలనియమ గతితో ,మునియుగమున్ ద్రుంచెన్, మునుకొని యిచటన్:- అని సమన్వయము." కనికరములేక (దయ) బాణంవేశా నాలేడిజంటపై అలా వేయకుండా ఉండవలసినది. వారికి కాలం సమీపించింది. అందుకే ఆముని దంపతుల మరణానికి కారణమైనాను. అనిపాండురాజు వేదన!

                         ఈవిధంగా సరళంగా కాఠిన్య విరళంగా మొత్తంగ్రంధాన్ని రచించి ఔరా! యనిపించుకొన్న ఘనుడు

                                                       పింగళి సూరన కవి! ద్వర్ధికావ్యాలలో మేటి
                                       
                                                           రాఘవ పాండవీయము!

      సత్యనారాయణ చొప్పకట్ల                                                                     స్వస్తి!


*పూర్వం గురుశిష్యులు చెప్పుకునే మంత్రం.!*

*ఈ మధ్య ఎక్కడ మనం వినడం -చూడటంలేదు..*

ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. 

భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. 
మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. 
ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. 
మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక. 
టూకీగా ఇదీ అర్ధం.

*భావము.*

ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. 
అతడు మనల నిరువురను పోషించుగాక.  
మనము గొప్ప శక్తి తో(దివ్య బలముతో) కలసి 
పని చేయుదుముగాక. 
అధ్యయనము చే మనమిరువురమును 
మేథా సంపదను పొందుదుము గాక! 
           
మనమితరులను ద్వేషింపకుందుము గాక. 
శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక.  
(ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాబ్రత్వము, పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను ఉదారములైన ఆశయములను ప్రకటించును. )

*వివరణ:.💐*

పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. 
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక. 
టూకీగా ఇదీ అర్ధం.

పాఠం, అధ్యయనం మాత్రమే కాదు, 
ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే కాక, 
ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - 
నేను చెబితే నువ్వు వినాలి, 
నేను గెలిస్తే నువ్వు ఓడాలి, 
నాది పైచెయ్యి నీది కింది చెయ్యి, 
నేను అంటాను నువ్వు పడు. 
ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను, 
ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు. 

తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. 
కొత్త ఆలోచనలు బయల్దేరినై. 
వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను, 
మానవ సంబంధాల్లోను - Win win mentality, 
Active listening, Empathetic listening 
వంటి concepts ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. 

పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత. 
కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా? 
ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్‌లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో, బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? 
మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?

అప్పుడే అనిపిస్తుంది, 
ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. 
మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. 
ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి. 
మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - 
చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. 
మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి. 
ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, 
దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి. 
అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో, 
నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను. 
అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే 
స్వ-పర భేదం మాయమవుతుంది. 
త్వమేవాహం. 
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

*సర్వే జనా సుఖినోభవంతు..!!


ఏమిటి తల్లీ....ఇలా ఏడుస్తున్నావ్? ధవళ వస్త్ర కాంతులతో ధగ ధగ మెరుస్తున్నా, నీ మోమున ఆ నీలి నీడలెందుకమ్మా!?

మీ వలననే నేనిలా శోకిస్తూ ఉన్నాను రా!? మీ మానవులు క్రూరులు. మీ ఆశలకు అంతం లేదురా.

నా గర్భాన్ని గనుల పేరుతో తొలిచేస్తున్నారు...

సాగరాలను కెలికేస్తున్నారు....

నా బిడ్డలైన 83 లక్షల 99వేలా 999 రకాల్లో ఎవ్వరినీ వదిలిపెట్టరు మీరు.

మీ ఆకలికి వారంతా బలవుతున్నారు కదరా!

ఇంధనాలంటూ...సముద్ర గర్భాలను శోధిస్తూ తోడేస్తున్నారు.

మీ విలాసాలకు రకరకాల ఫ్యాక్టరీలు పెట్టి...వాటి వ్యర్ధాలను సాగర జలాల్లో...నదులలో కలిపేస్తూ కలుషితం చేస్తున్నారు!
ఎన్నో జీవులను పొట్టన పెట్టుకుంటున్నారు!

నేను ఆగ్రహిస్తే....మీరసలు ఉండరురా!

నా బడభాగ్ని తో మిమ్మల్ని భస్మీపటలం చేయకముందే...

నా బిడ్డలైన వైరస్ లు మిమ్మల్ని అంతం చేయక ముందే...

జల ప్రళయం తో మిమ్మల్ని కబళించకముందే...

నీళ్ళు నన్ను ముంచేస్తున్నాయి. ఊపిరి అందడం లేదు. అమ్మా.....అని అరిచి కళ్ళు తెరిచి చూస్తే....ఎదురుగా భార్యామణి!

ఏం రాత్రి తాగింది ఇంకా దిగలేదా!? ఆఫీస్ కు వెళ్ళేదుందా లేదా!?

హార్నీ....ఇదంతా కలే!

అబ్బా ప్రశాంతంగా నిద్రైనా పోనీవు కదే. ఈ రోజు పబ్లిక్ హాలిడే. రంజాన్ పండుగ కదా!

ఇక లేవయ్యా...నీ ఫ్రెండ్ నియామతుల్లా బిర్యానీ...ఖీర్ తెచ్చిస్తే మెక్కడం కాదు. కాస్త వాళ్ళకు విషెస్ చెప్పవయ్యా లేచి.

అంటే గుర్తు చెయ్యమంటావ్...అవన్నీ మర్చిపోకుండా తెచ్చివ్వరా అని.

                               ********

భూమి వయస్సు 4.543 బిలియన్ సంవత్సరాలగా (షుమారు 454 కోట్లు)....నిర్ధారించారు!

మరి ఈ రోజు ప్రపంచ భూమి దినోత్సవం!

ఇంత అందమైన గ్రహం.....విశ్వాంతరాలలో.....ఎక్కడా లేకపోవచ్చు!

జలం.....జీవం.....రెండూ....సాగుతున్న.....స్రవంతి....ఇక్కడే ఉంది!

జీవరాశులలో.....ఉన్న గొప్పదనం.....ప్రాణం!

ఏకకణజీవి మొదలు.......జీవరాశినంతా......శాసించి తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నానని...మనిషి విర్రవీగుతున్న సమయంలో ఈ నావెల్ కోవిడ్- 2 వైరస్ బాగా బుధ్ధి చెప్పింది!

ఓ కంటికి కానరాని చిన్న కణం కూడా కాదది! కణంలో చిన తునక! దానికే ప్రపంచమంతా గజ గజా వణికి పోతున్న వైనం అనుభవ పూర్వకం ఇప్పుడు మనకు! 

                                   *********

ప్రకృతి కున్న కరుణ.....ఇతర జీవులలో ఉన్న ఐకమత్యం ...మనిషిలో మృగ్యం!

కుల, మత ధ్వేషాలతో క్రుళ్ళిపోతున్న మానవుడు....నా దృష్టిలో అధమ జీవి!

విషయమేదైనా....మతం...కులం దగ్గరే......ఆగిపోయి.....అసలు సాగకుండా....చతికిలబడిపోయిన మనిషి....నీకెక్కడ ఉంది....హక్కు...ప్రపంచ భూమి దినోత్సవం ....చేసుకోవడానికి!?

పల్లెటూరి ముఠా కక్షల మొదలు......ప్రపంచ యుధ్ధానికి....సవాళ్ళు విసురుకుంటున్న దేశాలను....చూస్తే....మానవ జాతి ...సిగ్గుతో చచ్చిపోవాలి!

వద్దు.....నీకెందుకోయి....ప్రపంచ భూమి దినోత్సవ శుభాకాంక్షలు!

ఎగిరే పక్షికి,

ఈదే చేపకి,

పూచే మొక్కలకు,

కాచే చెట్లకు,

కీటక సమూహాలకు...

గాలి, నింగి,నీరు, అగ్ని.......

అన్నింటికీ....అందిస్తున్నా....నా ప్రపంచ భూమి దిన శుభాకాంక్షలు!

ఒక్క మనిషికే చెప్పాలంటేనే....మాటలు పెగలడం లేదు!

                                   *********

ఈ భూమిని....ఏకఛత్రాధిపత్యంగా ఏలడానికే...మనం ఉన్నాం! మనుషులమండి...మనం దేన్నీ వదలం. చివరికి గోధుమ గడ్డి...పచ్చి గడ్డి....దేన్నీ వదలం!

నాన్ వెజ్ పేరుతో...కోళ్ళు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, పందులు, ఎద్దులు, కుందేళ్ళు, పిట్టలు, బాతులు, చేపలు, కప్పలు నక్కలు, కుక్కలు, పాములు, గబ్బిలాలు,......ఇలా ఒకటేమిటి....జీవరాసులనన్నింటినీ...తినేద్దాం! ఏసియన్ కంట్రీస్ కొన్నింటిలో...పచ్చి ఆక్టోపస్ లను కూడా తింటారు!

సృష్టిని.....మనమే ఉండాలనుకుంటే.....సోదిలోకి కూడా మిగలకుండా పోయేది మనిషే! ఈ నిజం మనం ఎంత త్వరగా గ్రహిస్తే...అంత మంచిది.

WORLD EARTH DAY(22 - ఏప్రిల్ )....అంటే...ఈ భూగ్రహం మీద ఉండే 87 లక్షల జీవ జాతులన్నింటికీ పండుగే! 

మరి అన్నీ బ్రతకాలిగా!

                                 *********

అనంత విశ్వంలో....అతి సుందర గ్రహం....87 లక్షల జీవరాసులతో..కళకళ లాడే గ్రహం.....మన భూమే. నేల మీద కన్నా...సముద్రాన...మరింత వైవిధ్యమైన జీవులున్నాయి.

మరి ఈ వైవిధ్యతను....కాపాడటం....మన లక్ష్యం. మరే జీవికి లేని ...తెలివి...విజ్ఞానం...మన సొంతం. ఇప్పుడు ఏలుతున్నది మనమే!

చిన్ని సున్నితమైన ముచ్చటగొలిపే పక్షులు....ఈ కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు, ....లాంటివి...తిని బ్రతుకుతుంటాయి. మరి వాటి నోటి దగ్గర తిండి కూడా మనం లాక్కుని తినేస్తే....అవెలా బ్రతుకుతాయి!?

సృష్టిలో....ఆహారం విషయంలో ఓ బాలన్స్...ఓ సమతుల్యత....సహజంగానే ఉంది. అదే ఆహార చక్రం. ఈ సమతుల్యత పాటించకపోతే....మనిషికే నష్టం. తన అస్థిత్వం కోల్పోకతప్పదు.

అసలు వంట చేయకుండా....సహజంగా మనిషి...ఏం తినగలడో చూస్తే...ఒక్క పండ్లు తప్ప....ధాన్యాలు...చిరుధాన్యాలు...సిరిధాన్యాలు కూడా రావు! అవి నిజానికి చిన్న చిన్న పక్షిజాతులకై నిర్దేశించినవి.

ఇక నాగరికత పెరిగి...వంట ఎప్పుడు మొదలైందో....అప్పుడే వరి, గోధుమ, సజ్జ, రాగులు, మొక్కజొన్న, జొన్న....ఇలా అన్నింటినీ...వండుకు తింటున్నాం.ఆ కొర్రలు, సామలు, ఊదలు, అండు కొర్రలు & అరికెలు....వీటినైనా....కనీసం ఆ పక్షులకోసం వదిలేయవచ్చు కదా!

వదలం. ఎందుకంటే...ఇదో కమర్షియల్ ట్రెండ్ అయిపోయింది!

                                  *********

మొక్కలను నాటడం....చెట్లను కాపాడుకోవడం....సహజసిధ్ధమైన...చెరువులను...సరస్సులను...కాలువలను...పిల్ల నదులను....కాపాడుకోవాలి మనం. 

ఎంతసేపు....స్థలం కనిపిస్తే చాలు...పిల్లర్స్ వేసి కాంక్రీట్ జంగిల్ చేసి పారేస్తే....రేపు నీకు ఉండటానికి.....నువ్వు శ్వాసించడానికి....ఆక్సిజన్ అనేది అరుదైపోయి....పోతావ్!

అంటే...ఈ జీవవైవిధ్యాన్ని కాపాడడానికి...ఇంక ఏం తినాలి...అని అడగకండి? ఎందుకంటే...మనిషిలాగే...అన్ని జీవరాసులకు...జీవించే హక్కు ఉంది కదా! 

ఏం తినాలో...ఏం తినకూడదో....మీకే తెలుసు. ఎందుకంటే...విజ్ఞత...జ్ఞానం...లాంటివి ఉన్నది మీకే...అంటే మనకే...మనుషులకే!

ఆ....నేనీ గ్రహానికి...కింగ్ ను...నేనేమైనా తినేస్తాను....నాదే రాజ్యం...అని అహంకరిస్తే....గతాన్ని ఒక్కసారి గుర్తు చేయాల్సుంటుంది మరి! 

నువ్వసలు పుట్టనేలేదప్పటికి...అందుకే నీకు పరిచయమై ఉండవు! జురాసిక్ పార్క్ సినిమాలో చూసే ఉంటావ్...డైనోసార్ లను. అది సినిమా కాబట్టి...మనుషులను...వాటిని కలిపి చూపారు! 

కానీ డైనోసార్ల యుగంలో మనిషసలు లేడు! అవి కూడా ఇలాగే విర్రవీగాయి.. ఇప్పుడసలు కనపడకుండాపోయాయి!

ప్రకృతి ముందు...ఎవరైనా బచ్చాగాళ్ళే!అది ఆగ్రహిస్తే...సునామీలు, వరదలు, భూకంపాలే! వాటి ధాటికి....నువ్వు తట్టుకోలేవ్!

బ్రతకడానికి తిను....తినడానికే బ్రతికేయోద్దు మరి. నువ్వు జీవిస్తూ...ఈ భూమి మీద జీవులనీ బ్రతకనీ.

1)అనవసరంగా చెట్లు నరికి....పచ్చని అడవులను కాంక్రీట్ జంగిల్స్ గా మార్చకూడదు.

2)మన ఆవాసాల కోసం...ఆఫీసుల కోసం....రాజధానుల కోసమో...పచ్చని పంటపొలాలను...అడవులను ఆక్రమించకూడదు. 

3)విపరీతమైన వాయు కాలుష్యం....జల కాలుష్యాలకు....కారణమౌతున్న పరిశ్రమలు పూర్తిగా మూసేయాలి. అవి ఉత్పత్తి చేసే వస్తు వినిమియం మనం మానేసి.....వాటికి సహజసిధ్ధమైన ప్రత్యామ్నాయాలు కనుగొనాలి.

4)కాలుష్య కారణాలైన యంత్రాల వినిమయం....తగ్గించుకోవాలి. ఎ.సి లు, రిఫ్రిజిరేటర్లు...లాంటివి.

5)ఇకనైనా విద్యా- వైద్య - వ్యవసాయ రంగాలకు....బడ్జెట్లు అధికం చేయాలి.

6)ప్రకృతి సహజమైన ఆహార చక్రానికి విరుధ్ధమైన అలవాట్లకు దూరంగా ఉండాలి. శాఖాహార వినియోగం పెరగాలి....ఎందుకంటే...మనిషికి సృష్టి నిర్దేశించినది శాఖాహారమే.

7)మరీ విపరీత...వికృత ఆహారపుటలవాట్లు గల వారిని ఎడ్యుకేట్ చేయాలి. వినకపోతే...శిక్షించాలి చట్టాలు చేసి.

8)మనతో బాటు ఇతర జంతు జాతిని....వృక్ష జాతులను....కాపాడుకుందాం. అవసరం అనుకుంటే కఠిన చట్టాలు చేసైనా సరే.

                                   ********

454 కోట్ల వయస్సున్న ఈ సుందర భూగ్రహానికి....అతిథులుగా వచ్చాం...మనం...షుమారు 2 లక్షల సంవత్సరాల క్రింద!

అతిథులుగా వచ్చిన వాళ్ళం అతిథి మర్యాద పాటించాలి కదా!

భూమి మీద అప్పటికే సీనియర్లైన జంతు జాలాన్ని..వృక్ష జాలాన్ని...ప్రేమతో ఆలింగనం చేసుకుందాం.

ఇలా ప్రపంచ దేశాలన్నీ...ఏకమై....కొన్ని కఠోర శాసనాలు చేసుకుని....ఖఛ్ఛితంగా అమలు చేసిన నాడు.......

ఈ సుందర భూగ్రహం...అత్యంత సురక్షితం అయిన నాడు....ప్రపంచ భూమి దినోత్సవం......ఆనందంగా చేసుకోవచ్చు.

ప్రపంచ భూమి దినోత్సవ(22-4-2022) శుభాకాంక్షలు.🌹

                            🌹🌿🌹🌿🌹🌿🌹

ప్రకృతికి ప్రణామం.....ఎర్త్ డే స్పెషల్.

https://youtu.be/CRVrugDG-Bg

నేల తల్లికి వందనం......

https://youtu.be/HXePK5HfrJQ

భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు...

https://youtu.be/9XvxihyuQfI

పువ్వులో గువ్వలో వాగులో తీగలో.......

https://youtu.be/lmAPwIVhIHY

ఎగిరే గువ్వ ఏమంది...విసిరే గాలి ఏమంది....

https://youtu.be/nStDJhFOrZg

కొండల కోనల సూరీడు...కురిసే బంగారు నీరూ.....

https://youtu.be/8hUJ22ov_R8

ప్రణామం ప్రణామం ప్రణామం.......

https://youtu.be/lFAiFov5pP8

అడవి చెట్లను...పావురాళ్ళను కలలోనైనా కనగలమా.....ఆశలు సమాధి చేస్తూ.....

https://youtu.be/ib39H_Ljjk0

శ్రీశైలం మల్లన్న శిరసొంచెనా...చేలంతా గంగమ్మ వాన....

https://youtu.be/fgFUtcGbI-w

మా నేలతల్లి దీవించుమా...బంగారు పంటల్ని పండించుమా....

https://youtu.be/lJMXG9Pa-ys

నిద్దర చాలని బధ్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం......

https://youtu.be/A9PU__VQkSs

గ్రీన్ సింఫనీ........భూపరిరక్షణ......గానం.....కె.ఎస్. చిత్ర.

https://youtu.be/85Hyyvo_5gE

🌎🐅🦓🐫🌳🐂🐕🐇🌳🦃🦇🦅🌳🦆🦈🐟🌳🌎

                                                      - డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు........... !!

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో
మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.
భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.
ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.
కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.


వ్యాకరణం ఎలాఏర్పడింది?

వేదాంగములలో వ్యాకరణమొకటి.ఇది భాషను సంస్కరించుటకు
ఏర్పడినది.దీనియావిర్భావచరిత్రమును తెలిసికోగలరు.

వ్యాకరణానికి మూలం మాహేశ్వరసూత్రాలు.ఇవే!అవి;

"నృత్తావసానే నటరాజరాజో
ననాద,ఢక్కాం నవపంచవారాన్
ఉధర్తుకామాస్సనకాది సిధ్ధా
నేతద్విమర్శే శివసూత్రజాలమ్!!

🪷మాహేశ్వర సూత్రాలు..!!🪷

🌸పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలు మ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు.

🪷ఈ సూత్రాలే "మాహేశ్వర" సూత్రాలుగా పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.ఈ శ్లోకం చూడండి..

🌸నృత్తావసానే నాటరాజ రాజో |
ననాద ఢక్కాం నవ పంచవారం ||
(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)

🪷ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ |
ఎతద్విమర్శే శివ సూత్రజాలం ||
-అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే

🌸వాక్యకారం వరరుచిం, భాష్యకారం పతంజలిం, పాణినిం సూత్రకారం... ప్రణతోస్మి మునిత్రయం.! అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు. పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం. ఇవి పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.

🌸 1 ‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

🪷 2 ‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)

🌸 3 ‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)

🪷 4 ‘ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)

🌸 5 ‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)

🪷 6 ‘ల ణ్’ (లకారం)

🌸 7 ‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )

🪷 8 ‘ఝ, భ య్’ ( ఝకార, భకారాలు)

🌸 9 ‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)

🪷 10 ‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )

🌸 11 ‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)

🪷 12 ‘క ప య్’ (క & ప )

🌸 13 ‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )

🪷 14 ‘హల్’ ( హకారం)

🌸ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.

🪷ప్రతి సూత్రం చివర ఉన్న పొల్లు, హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి. అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, 

🌸ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.
ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి” భాష్యాన్ని రచించి లోకానికి ప్రసాదించారు. ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.

https://www.facebook.com/100001831146597/posts/pfbid0EBcP2XgxHtx6QhSY7kTnNrdiHbWE3HTBsgdgCUmiysYhBuk8KhUXypU26BccNev8l/




అద్భుతమైన పద్యం!!

              ఈరోజు ఒక గొప్ప పద్యం పరిచయం చేసికుందాం .తెలుగుకవితా క్షేత్రంలో జంటకవులుగ,అవధానకవులుగా 
                ప్రసిధ్ధులయిన తిరుపతి వేంకట కవులలో నొకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి ముత్తాతగారు "నరసన్న" 
                 గారిరచనగా నిది లోకంలో ప్రచారంలో ఉంది . 

        చం: ఘన కబరీ స్తనాకృతులు కంధరమై, దరమై, రమైక్యమై 
                చను; మది కంఠవక్త్రములు సాదరమై దరమై రమైకమై, 
                  దినుసగు;వాక్ స్మితాంగములు ,తేనెలతో,నెలతో, లతోక్తితో 
                    నెనయగు; నాభి,జంఘ, గతి, హేమకరిన్, మకరిన్, కరిన్,నగున్; 

              ఈపద్యంలో అందమైన స్త్రీ వర్ణనం చేస్తున్నాడు కవి ,ప్రతిపాదంలో క్రమాలంకారం ఉపయోగిస్తూ ,చిత్రకవితా 
              రీతులను చవిచూపాడు . నాయిక సర్వాంగ సౌందర్యాన్ని వర్ణిస్తూ, మొదట కేశపాశాన్ని -కంధరమై-మేఘం 
              వలెఉన్నదన్నాడు. స్తనాకృతులు - కొండలతోపోల్చాడు ;ఆకృతి- రూపము రమైక్యమై - లక్ష్మవలెనున్నదట. 
                                మొదటిపాదంలో కంధరమై, దరమై, రమైక్యమై, అఁటూమొదటిఅక్షరాన్ని విడిచిచెపుతున్నాడు 
             తక్కినపాదాల్లోకూడాఇంతే! కానీఅర్ధంమారుతూ ఉంటుంది.ఇక2వపాదంలో, మది, కంఠ, వక్త్రము, లను 
              వర్ణించాడు. మదిసాదరమై - ఆదరంతోకూడినదియై; కంఠం - దరమై; అంటే శంఖమువలెనున్నదయి; 
                        వక్త్రము-ముఖము; రమైకమై- కాంతిమంతమై ; యున్నదట ;ఇక3 వపాదంలో వాక్, స్మిత, అంగము 
                లను, వాక్కును తేనెతోను, స్మితమును నెల ,చంద్రునితోను, అంగములను- అవయవములను లతలతోను 
                 పోల్చినాడు; 4వపాదంలో నాభి, జంఘ, గతి, లను - నాభి- పొక్కిలిని హేమకరి -ఉమ్మెత్తపూవుతోను,  
                   జంఘ- పిక్కలు మకరిన్- మొసలి ; గతిన్ -గమనమును కరిన్- ఏనుగునడకలను ,నవ్వుతున్నాయట!


"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?

ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ద్వానా శాస్త్రి గారు రాసారట. బావుంది. అది ఇక్కడ పెడతాను. forwarded as it is.

తెలుగు భాషాభిమానుల కోసం.👇

అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?

అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:

అరుఁగు = వీధి అరుగు

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు = కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.
(డాక్టర్
ద్వా. నా. శాస్త్రి ..)
అయినా తెలుగు భాషను కాపాడుకోవాల్సిన కాలం ఆసన్నమైంది కదా! పైవి మనకు అందించిన ద్వా.నా.శాస్త్రి గారికి ధన్యవాదాలు...🙏💐🙏

[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి )

మార్మిక ప్రణయ సందేశము !

            శ్లో: " కాచిత్ బాలా రమణ వసతిం ప్రేషయంతీ కరండం

                     దాసీ హస్తాత్ , సభయ మలిఖత్ వ్యాళ మస్యోపరిష్టాత్

                     గౌరీకాంతం , పవనతనయం ,చంపకం , చాత్ర భావం 

                     పృఛ్ఛత్యార్యో నిపుణతిలకో , మల్లినాధః కవీంద్రః "

                                      చాటువు- అజ్ఙాత కర్తృత్వం!

               
                     ఒకరోజు భోజుడు కొలువు దీరి యుండగా ద్వారపాలకుడు వచ్చి రాజుగారికి ఒకలేఖనందించాడు. అందులో పైశ్లోకం ఉన్నది. దానిని రాజు చదివి వినిపించాడు. 

                         దాని భావమిది:- ఒకయువతి దాసీదాని చేతికి ఒకపేటిక నందించి ప్రియునకు యిచ్చిరమ్మన్నది. ఆపెట్టెపై ,

                        పాము , శివుడు , ఆంజనేయుడు , సంపెంగల బొమ్మలను ' భయం భయంగా చిత్రించింది'- దీని భావమేమిటని? మీసభలోని పెద్దలను కవులను మల్లినాధ పండితుడు అడుగుచున్నాడు. బదులీయగలరు. !

                             ఇదీ లేఖసారాంశం. భోజుడు పండితులందరివంకా చూశాడు. అందరూ మిన్నకున్నారు. అప్పుడు కాళిదాస మహాకవిలేచి ," రాజా! దీని 

యంతరార్ధమిది! ఈలేఖ వ్రాసిన యువతి అష్టవిధ నాయికలలో ఒకరైన 'ప్రోషితభర్తృక ' (భర్త పరదేశంలో ఉన్నమగువ) ఎక్కడోఉన్నప్రియునకు తనబాధను , విరహమును మర్మంగా (రహస్యంగా) సందేశం పంపుతున్నది. తనవిరహ బాధను నలుగురు
పెంచుతున్నారని , నీవు త్వరగా వచ్చి ఆబాధను పోగొట్టమనీ సందేశంలోని మర్మం. ఆనలుగురు యెవరనేది వారిశత్రువులను
పెట్టెపై చిత్రించటం ద్వారా తెలియ జేసింది.

                            ఇంతకీ ఆమె విరహాన్ని పెంచేవి యేవీ? మొదటిది , మలయమారుతం. దానికి శత్రువు పాము.(పాములకు గాలే ఆహారమని ప్రతీతి) రెండవది ,మన్మధుడు.మన్మధుని శత్రువు శివుడు. మూడవది ఉద్యానము. (పూలతోట) దానికి శత్రువు ఆంజనేయుడు.(లంకేశ వనారి అంజనీకుమారుడుగదా) నాల్గవది తుమ్మెదలు. వాటికి శత్రువు సంపెంగ. ఇంత రహస్యంగా, ఎవరికీ అర్ధంగాని విధంగా చిత్రించిన ఆయువతి చాతుర్యానికి సభ్యులు విస్తుబోయారు. అయారే !అనియామెను ప్రస్తుతించారు. లేఖార్థమును యింత చక్కగా విప్పిచెప్పిన కాళిదాసు నభినందించారు.

                      ఈలేఖను విరచించి పంపిన మల్లినాధుని భోజుడు తనసభకు రప్పించి కాళిదాసునకు మల్లినాధునకు ఘనసన్మానం చేశాడు..
మల్లినాధుడు గొప్పకవి.పండితుడు. కవిజన కల్పకమగు భోజుని తనకవితతో నిట్లని ప్రస్తుతించాడు.

             శ్లో: దేవ భోజ! తవ దాన జలౌఘైః / సోయమభ్ధి రజనీతి విశంకే ! /

                    అన్యధా తదుదితేషు శిలా , గో / భూరుహేషు కథమీదృశ దానమ్ ,//

               భావం: భోజరాజా! నీవుదానాలిచ్చే టప్పుడు విడిచే నీటితోనే సముద్రం యేర్పడిందని నేననుకుంటున్నాను. అలాకాకపోతే ఈసముద్రంలో జన్మించిన 'చింతామణి' (శిలా) కామధేనువు (గోవు) భూరుహము (చెట్టు) యివన్నీ దానగుణాన్ని యెలాపొందాయి?( పాల సముద్ర మథనవేళ చింతామణి, కామధేనువు , కల్పవృక్షము మొన్నగునవి లభించాయి. వాటికి దానగుణం నీవలననే కలిగిందని కవి భావన) అతిశయోక్తి; కావ్యలింగాలంకారములు. 

                    అలాంటి ప్రతిభావంతులైన కవులతో భోజుని జీవితం చిత్రింప బడింది. నేడివి చాటువులని కొట్టిపారేస్తున్నారు.

                   అయినా వాటియునికి ప్రజాహృదయాలలో భద్రంగా నిలచిపోయింది. దాని నెవ్వరు చెరపగలరు?

                                                                                   స్వస్తి!


*ఒక రోజు భోజరాజు కొలువు లోనికి నలుగురు వచ్చారు. వృద్ధ దంపతులు, వారి కొడుకు, కోడలు (యువక జంట)*

పెద్దాయన మహారాజా! మాది విద్వత్ కుటుంబం అని చెప్పాడు.భోజరాజుకు కావలిసిందేముంది వెంటనే ఒక సమస్య యిచ్చాడు. 

"క్రియా సిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే" 

 అర్థము:--మహాత్ములు 
తమ మహత్తు వలన ఏ పరికరములు లేకుండానే ఘనకార్యములను సాధింతురు. వృద్ధుడిని పూరించ మన్నాడు. 

వృద్ధుడి పూరణ:--
ఘటో జన్మస్థానం మృగపరిజనో భూర్జవసనః
వనేవాసః కందాశనమపిచ దుఃస్థంవపురిదమ్ ౹
తథాప్యేకోగస్త్యః సకలమపిబద్వారిధి జలం
క్రియాసిద్ధిస్సత్త్వే భవతి మహతాం నోపకరణే ॥

అర్థము:--అగస్త్యుడు కుండ యందు పుట్టెను.మృగములే అతని పరిజనముగా యుండెను. భూర్జర పత్రములనె ధరించెను.వనవాసము చేయుచు కందమూల ఫలా
దులనే భుజించును. అట్లయ్యును సముద్రమును పుక్కిట బట్టి పీల్చేను.మహాత్ములు తమ మహత్వము వలననే ఏ పరికరములు లేకపోయిననూ ఘనకార్యములను సాధింతురు.

భోజుడు సంతోషించి ఆయనను సత్కరించి,ఆయన భార్యను అదే 
సమస్యను పూరింపుమనెను.

ఆమె పూరణ:--
రథస్యైకం చక్రం భుజగ యమితాః సప్త తురగా
నిరాలంబోమార్గః చరణ వికలస్సారథిరపి ॥
రవిర్గచ్ఛత్యంతం ప్రతిదినమపారస్య నభసః
క్రియాసిద్ధిస్సత్త్వే భవతి మహతాం నోపకరణే ॥

అర్థము:-సూర్యుడు ఒక్కటే చక్రము గల రథము నెక్కి పాములు పగ్గములుగా గలిగిన ఏడు గుర్రములు రథము లాగగా నొక దిశ నుండి వేరొక దిశ కు గొప్ప ప్రయాణము ప్రతి 
దినము చేయుచున్నాడు.మహాత్ములు పరికరములు లేకున్నను, తమ మహత్వము వలన ఘనకార్యములను సాధింతురు.
.
భోజుడు సంతసించి ఆమెను సత్కరించి పిదప ఆమె పుత్రుని గాంచి నీవు కూడా ఈ సమస్యనే పూరి౦చ మనెను.

పుత్రుని పూరణ:-
విజేతవ్యా లంకా చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యో రణభువి సహాయాశ్చ కపయః ౹
తథాప్యేకో రామః సకలమవధీద్రాక్షసకులమ్
క్రియాసిద్ధిస్సత్త్వే భవతి మహతాం నోపకరణే ॥

అర్థము:--జయింప వలిసినది లంకారాజ్యము.సముద్రమును నడక మూలము గానే దాట వలయును. శత్రువు మహా బలవంతు డైనపులస్త్య బ్రహ్మ కొడుకైన రావణుడు.యుద్ధ రంగమున సహాయము నిలకడ లేని కోతులు అయిననూ రాముడు అపార పారవారం బగు రాక్షస మూకను నాశన మొనరించెను. మహాత్ములు సరియైన పరికరములు లేకున్ననూ తమ మహత్వము వలన ఘన కార్యములను సాధింతురు.

భోజుడు సంతోషించి అతనికి యధావిధి గా సత్కారము జేసి సరస్వతీ 
రూపము లాగ భాసించు చున్న అతని భార్యను గాంచి యిదే సమస్యను పూరింప మనెను  
కోడలు యొక్క పూరణ:-

 ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ చంచలదృశాం
దృశాంకోణో బాణః సుహృదపి జడాత్మా హిమకరః ౹
తథాప్యేకోనంగస్త్రిభువనమపి వ్యాకులయతి
క్రియా సిద్దిస్సత్త్వే భవతి మహతాం నోపకరణే॥

అర్థము:--మన్మధునిది అతి సుకుమారం బగు పుష్పపు ధనువు,తుమ్మెదల బారు వింటినారి.అతి చంచల మగు స్త్రీల చూపులు బాణములు మన్మధ వికారమును వృద్ధి జేయు జడస్వరూపుడగు చంద్రుడు స్నేహితుడు.తాను శరీరము లేనివాడు. అట్లయ్యును సకల ప్రపంచమును మన్మధ వికారమునకు గురి చేయు చున్నాడు.మహాత్ములు సరియైన పరికరములు లేకున్ననూ వారి మహత్వము వలన ఘనకార్యములను సాధింతురు. 

భోజుడా యువతి పూరించిన దానికి సంతోషించి తన భార్య లీలావతి 
ధరించు రత్నాభరణము లన్నియు దెప్పించి యామెకు బహూకరించెను.

చొప్పకట్ల సత్యనారాయణ
7.10.2022


పెద్దల పరిహాసాలు !

                                     మన యిళ్ళలో  పెళ్ళిళ్ళు  జరిగినపుడు  పెళ్ళికి వచ్చినవారు  ఒకరితో నొకరు యెన్నిపరిహాసాలో!  యెన్నెన్ని
వినోదాలో! చెప్పటానికి వీలా? అలాటి సందర్భంలో  ఒకవేళ  జగత్పాలకులైన  త్రిమూర్తులే  అలాంటి  వ్యవహారం నడిపితే యెలాఉంటుంది? 

గంటికృష్ణవేణమ్మగారి, "గిరిజా కళ్యాణం"- అనేకావ్యంలో ని 
 ఈ ఘట్టం..చిత్తగించండి!
       
            గిరిజా కళ్యాణానికి  విష్ణుమూర్తి  సకుటుంబంగా  విచ్చేశాడట. వివాహం జరిగాక  భోజనాలు జరుగుతున్న సందర్భం. శివుడు విస్తరిలో ఉన్నపదార్ధాలను అటునిటు కదుపుతున్నాడట!

                 ఆసమయంలో విష్ణువు  శివుడు ఒకరినొకరు  వేళాకోలా లాడుకొన్నారట!  ఇదిగో ఇలా---

      విష్ణువు  శివునితో--   "  విసము తిన్న నోట  కసవయ్యెఁగాబోలు 
         భక్షణంబులెల్ల   పార్వతీశ"!
 అట్టి దివ్యమైన  ఆహారములు  లే
       వటంచు   పల్కె  విష్ణుఁ డభవు తోడ .."

                           విష్ణువు  శివునితో  యిలా అంటున్నాడు. "  ఏమయ్యా!  ఈబూరెలూ ,గారెలూ, అవీ  నీకు నచ్చినట్లు  లేదే? 
కాలకూటం తిన్న నోటికి  యీభక్ష్యాలన్నీ  గడ్డిలాగ  రుచిలేనివై కనబడుచున్నవేమో? ఏంచేస్తాం?  అన్నాడు.

       దానికి  సమాధానంగా శివుడు -   

              "  నిక్కము  నీవుపల్కినది   నీరజనాభ!  ఇటెందు మ్రుచ్చిలన్

                 చిక్కదు  వెన్న !  తెత్తు మన  చిక్కవు  యెంగిలి కాయలెందు, నీ

                 కెక్కడ  దెత్తుమయ్య? అవి ;  ఇప్పు డటంచు  శివుండు  నవ్వగా

                 నక్కడ  పంక్తి  భోజనము నందు  ఫకాలున   నవ్విరందరున్ "!

                         నిజమేనయ్యా  విష్ణూ! నువ్వుచెప్పింది.  ఇక్కడెక్కడా  దొంగతనంచేద్దామన్నా   వెన్న దొరకదు.  తెద్దామన్నా  యెంగిలి కాయలుదొరకనే దొరకవు.  ఎక్కడనుండి  తేగలం మరి !  అని  శివు డనగానే  బ్రహ్మ, ఇంద్రాది దేవతలు  ఫకాలున  నవ్వారట !

                        మనదృష్టిలో  యిది పరిహాసమేయైనా  కవిదృష్ట్యా  ఇది  నిందాస్తుతి!
  
                                              దీని  అంతరార్ధం యేమిటంటే- లోకాలను నాశనంచేసే  కాలకూట  విషాన్ని  కంఠాన ధరించి, అందరినీ కాపాడిన వాడు శివుడని  విష్ణువు ప్రస్తుతించితే ,వెన్నదొంగిలి నెపంతో గోపికలనుధ్ధరించినవాడనీ,, శబరి యెంగిలిపండ్లను తిని భక్తపరాధీనుడైన వాడు విష్ణు వనీ  శివుడు విష్ణువును ప్రశంసించాడు..

                                       బాగుంది కదూ?

                                                                                       స్వస్తి!

సత్యనారాయణ చొప్పకట్ల


మామ మీద పద్యం! ఆమామెవరోమరి?

ఉ: మామను సంహరించి ,యొకమామకు గర్వమడంచి , యన్నిశా 
మామను రాజుఁజేసి , యొకమామ తనూజున కాత్మ బంధువై ,
మామకుఁ గన్నులిచ్చి , సుతు మన్మధునింతికిఁ దానె మామయై ,
మామకు మామ యైన పరమాత్ముఁడు మీకుఁ బ్రన్నుఁడయ్యెడిన్!
భావము: మామ కంసుని సంహరించి ,వారధి నిర్మాణానికి ముందు (రామావతారంలో) మామయైన సముద్రుని గర్వమణచి ,
నిశా మామయైన చంద్రునకు 'రాజు' అనే పేరు నొసఁగి ,మామ కొడుకైన అర్జునునకు ఆప్తుడై , మామయైన ధృతరాష్ట్రునకుఁ గన్ను
లిచ్చి , కొడుకైన మన్మధుని భార్యరతికి మామయై ,తనకు పిల్ల నిచ్చిన సముద్రునకు గంగనొసఁగి ,తనమామకు మామయై యొప్పు విష్ణువు మీకు ప్రసన్నుఁడగు గాక! 

ఆపరాత్పరుడు యిన్నిమారులు మామగా మారుట యిందలి చమత్కారము!

గంగ విష్ణు పాదజ, ఆవిధంగా ఆమె విష్ణు తనయ. నదులన్ని సాగరమున గలియునుగదా ఆవిధముగ ఆమెను విష్ణువు
సాగరునకు అర్పించినటుల సమన్వయము. లక్మి నొసగి సముద్రుడు విష్ణువునకు మామయైనాడు. తనపాదజయగు గంగను సముద్రునకొసఁగి విష్ణువు మామకు మామయైనాడు.
కవి యెవరోగాని అద్వితీయ మైన ప్రతిభావంతుడు. ఇన్ని మారులు మామగా విష్ణుమూర్తిని తీర్చి దిద్దినాడు.కవిప్రతిభకు జొహారు!!

                         స్వస్తి!

సత్యనారాయణ చొప్పకట్ల

*ఈ శ్లోకాన్ని జీవితంలో ఓకసారి చదివి ఆనందించండి.*

ఒకసారి ఓ వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్లి *రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి* అన్నాడు.

ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు. ఆ వ్యక్తి చదివి నివ్వెరపోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది:

*గవీశపాత్రో నగజార్తిహారీ*
*కుమారతాతః శశిఖండమౌళిః।*
*లంకేశ సంపూజితపాదపద్మః*
*పాయాదనాదిః పరమేశ్వరో నః॥*

ఆశ్చర్య పోయాడు చదవగానే. ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి.
*గవీశపాత్రః* ... *గవాం ఈశః గవీశః* .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు *గవీశపాత్రః*- అంటే సదాశివుడు.
*నగజార్తి హారీ* ... *నగజ* అంటే పర్వత పుత్రిక, అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.
*కుమారతాతః* .... *తాతః* అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.
*శశిఖండ మౌళి:* ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
*లంకేశ సంపూజిత పాద పద్మ:*... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. *అనాదిః* ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ, అటువంటి *పరమేశ్వరః నః పాయాత్*.... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

*మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా* అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.

అప్పుడు ఆ పండితుడు *నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు.* 
*అది విష్ణువును కీర్తించే శ్లోకమే!* అని చెప్పి
అతనికి ఆశ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు. *నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును,*
*నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోన లేదు. న+ఆది, అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నాను, అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు.*

*గవీశపాత్రః* ... లో *గ* తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. *విః* అంటే పక్షి అని అర్ధము. *వీనామ్ ఈశః వీశః* ... పక్షులకు రాజు అంటే గరుడుడు,
గరుడు *ని* చేతచేత గౌరవింపబడువాడు, అంటే గరుడుని వాహనుడైన విష్ణువు.
*నగజార్తి హారీ* ... మొదటి అక్షరం తీసివేస్తే *గజార్తి హారీ*.. గజేంద్రుని ఆర్తిని దూరము చేసిన వాడు, విష్ణువు.
*కుమారతాతః* .... *కు* తీసివేస్తే *మారతాతః* అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. *మదనో మన్మదో మారః* (అమరము)
*శశిఖండ మౌళిః* .. *శ* తీసివేస్తే *శిఖండమౌళిః* నెమలిపింఛము ధరించిన వాడు కృష్ణుడు, అనగా విష్ణువు.
*లంకేశ సంపూజిత పాద పద్మ:* మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... *కేశ సంపూజిత పాద పద్మ:* 
*క* అంటే బ్రహ్మ, *ఈశః* అంటే రుద్రుడు; అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు, విష్ణువు.
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ,
బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .
ఇక *ప* తీసివేస్తే *రమేశ్వరః* అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం!

గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రాసాయనికాది ఏ శాస్త్రమునకైనా మహనీయులు వ్రాసిన రామాయణ భారత భాగవత రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము. ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆభాషకు అనుంగు బిడ్డ అయిన ఆంధ్రము నేర్పించండి.
ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది.

*భారతే భాతు భారతీ*

🌹🙏🌹

*వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?* 
                🌷🌷🌷

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "
- అంటే అర్ధం తెలుసా???
SUN'DAY
MO(O)N'DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY
- అంటే ఏమిటో తెలుసా?
అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?
సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర - అంటే తెలుసా?
ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా?
తెలియదా!? 
సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!
ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!
వారము - అంటే 'సారి' అని అర్ధము.
1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!
కాస్త విపులంగా....
భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. 
భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే. 
ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

#మందా_మరేడ్య_భూపుత్ర_సూర్య_శుక్ర_బుధేందవః
అనగా... పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 
ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 
ఆ భాగాలను వారు "హోర" అన్నారు.
"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.
దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 
ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.
హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 
ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 
కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.
మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,
ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.
ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.
అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 
అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 
వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.
అదే మొదటిరోజు. 
అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.
ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 
అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.
ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. 

ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత  గ్రంథాల్లో ఇమడవు కదా! 

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? 
పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు ఆ?? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 
నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు 
🙏🙏🙏🙏🙏

సేకరణ:
శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్యంసౌజన్యంతో-


అందరికి "ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీమహావిష్ణువు పుట్టిన రోజు "

భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.

"అదెలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

20.11.2022

వే దాం గ ము లు !

వేదరాశి సహజమైన శబ్దాలు. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ? వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.

1. శిక్షా

వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.

2. వ్యాకరణం

కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మనవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.

3. కల్పం

వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పం.

4. నిరుక్తం

పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సేవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.

5. ఛందస్సు

ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.

6. జ్యోతిషం

మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.

వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.  
                                  స్వస్తి!

*గోత్రం అంటే ఏమిటి?* 
సైన్సు ప్రకారము 
మన పూర్వీకులు
గోత్ర విధానాన్ని ఎలా 
ఏర్పాటు చేశారో గమనించండి!!

(వేదంలో యేముంది?ఎందుకీగోత్రాలు?సగోత్రం వివాహాలకెందుకు పనికిరాదు?అనివాదించే వారికిది విజ్ఞానసమ్మతమైన సమాధానం!కాదనేవారున్నారా?వృధావాదంవద్దు!!,)

మీరు పూజలో కూర్చున్న 
ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 
మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??

గోత్రం  వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 
*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 
పొందిన అధునాతన శాస్త్రమే!

గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?

మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 

వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 

కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?

వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? 
తర్కం ఏమిటి?

ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  
మన గోత్ర వ్యవస్థ వెనుక 
జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!

గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  
మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం

గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.

జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 
వీటిల్లో సెక్స్ క్రోమోజోములు
 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 
ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.

గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు.

XY లో - X తల్లి నుండి 
మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.

ఈ Y ప్రత్యేకమైనది మరియు 
అది X లో కలవదు. 
కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 
ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).

మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 

ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...
గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు 
ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....

ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్  పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.

ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.

కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 
లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...

మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది
మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..

మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.

అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.🙏🙏

 


Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ