Posts

Showing posts from November, 2022

నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం న ర సం

Image
అరుణ కిరణం  అరుణ గారి ఇంటర్వ్యూ  https://youtu.be/89_Lgv-dBgI?si=o92n7vXh05Pw-BzD 2017 లో అరుణ గారి ఆశయఫలంగా రూపుదిద్దుకున్న నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఉద్దేశ్యాలను ఉటంకిస్తూ నేను రాసిన  *నరసం ఆశయగీతం* నవ్యాంధ్ర రాష్ట్రాన రచయిత్రుల సంఘమిది కవయిత్రుల మదిలోపల తళుకుమన్న తలపొక్కటి నరసంగా ఈనాడిటు పురుడు పోసుకుంది గతకాలం సమీక్షించి నేటి స్థితిని వీక్షించి అందమైన భవితవైపు అడుగు కదపటానికై అతివలంత ఏకమై ఐక్యభావ వేదికై మా స్వప్నం సాకారం చేసుకొనగ శ్రమిస్తాం మొల్ల నుండి మొదలుకొని ఎల్లరు కవయిత్రులు కావ్యజగతినెల్ల తాము జ్యోతిర్మయ మొనరింపగ విరచించిన కావ్యవిరుల సాహితీ సౌరభాలు వెదజల్లే ప్రస్థానం అదే మా శుభాశయం పద్య వచన కవనము కవిత నవల గేయము సంప్రదాయ సాహిత్యం వైప్లవ్యం ఆధునికం మార్గమేదైనగాని సాధించిన అభ్యుదయం కలబోసుకుంటాము కదలి సాగిపోతాము సేవకు మేం ముందుంటాం సమానత్వ మాశిస్తాం స్త్రీలకొరకు స్పందిస్తాం న్యాయానికి నినదిస్తాం మానవీయ విలువలు మట్టిపాలు కానీయం సంఘహితం మా లక్ష్యం మా భూమిక సాహిత్యం పుస్తకాలు ప్రచురించి  మేటి రచన సమీక్షించి  సాహిత్య సభలు జరిపి  సంస్థలత...