నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం న ర సం
అరుణ కిరణం
అరుణ గారి ఇంటర్వ్యూ
https://youtu.be/89_Lgv-dBgI?si=o92n7vXh05Pw-BzD
2017 లో అరుణ గారి ఆశయఫలంగా రూపుదిద్దుకున్న నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఉద్దేశ్యాలను ఉటంకిస్తూ నేను రాసిన
*నరసం ఆశయగీతం*
నవ్యాంధ్ర రాష్ట్రాన
రచయిత్రుల సంఘమిది
కవయిత్రుల మదిలోపల
తళుకుమన్న తలపొక్కటి
నరసంగా ఈనాడిటు
పురుడు పోసుకుంది
గతకాలం సమీక్షించి
నేటి స్థితిని వీక్షించి
అందమైన భవితవైపు
అడుగు కదపటానికై
అతివలంత ఏకమై
ఐక్యభావ వేదికై
మా స్వప్నం సాకారం
చేసుకొనగ శ్రమిస్తాం
మొల్ల నుండి మొదలుకొని
ఎల్లరు కవయిత్రులు
కావ్యజగతినెల్ల తాము
జ్యోతిర్మయ మొనరింపగ
విరచించిన కావ్యవిరుల
సాహితీ సౌరభాలు
వెదజల్లే ప్రస్థానం
అదే మా శుభాశయం
పద్య వచన కవనము
కవిత నవల గేయము
సంప్రదాయ సాహిత్యం
వైప్లవ్యం ఆధునికం
మార్గమేదైనగాని
సాధించిన అభ్యుదయం
కలబోసుకుంటాము
కదలి సాగిపోతాము
సేవకు మేం ముందుంటాం
సమానత్వ మాశిస్తాం
స్త్రీలకొరకు స్పందిస్తాం
న్యాయానికి నినదిస్తాం
మానవీయ విలువలు
మట్టిపాలు కానీయం
సంఘహితం మా లక్ష్యం
మా భూమిక సాహిత్యం
పుస్తకాలు ప్రచురించి
మేటి రచన సమీక్షించి
సాహిత్య సభలు జరిపి
సంస్థలతో మైత్రి నెరపి
అందమైన భావ సుమం
అక్షరమై పరిమళించ
యువత కిచ్చి ప్రోత్సాహం
మేం ముందుకు నడిపిస్తాం
అజ్ఞానం అణచివేత అనే చీకట్లు చీల్చి
ఆలోచన అక్షరం ఆయుధాలుగా దాల్చి
సాహితీ కిరణాలు
*అరుణ* దీప్తు లద్దగా
నరసమనే తూర్పు వేది
నారీ సూర్యోదయమిది
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
న ర సం
స్వేచ్ఛ స్పందన సమానత్వం
న ర సం రాష్ట్ర కార్యవర్గం
గౌరవాధ్యక్షులు
శ్రీమతి తేళ్ళ అరుణ (ఒంగోలు)
అధ్యక్షులు.. శ్రీమతి కళావతి చిన్న లక్ష్మి(ప్రొద్దుటూరు)
ఉపాధ్యక్షులు:
1.శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి (ఒంగోలు)
2.శ్రీమతి దండెబోయిన పార్వతి (కర్నూలు)
3.శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (గుడివాడ)
4.శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి, (విజయనగరం)
ప్రధాన కార్యదర్శి:
డా.పాతూరి అన్నపూర్ణ, నెల్లూరు
సహాయ కార్యదర్శులు
డాక్టర్ నూనె అంకమ్మ రావు (ఒంగోలు)
డాక్టర్ జి వి పూర్ణ చంద్
సాలిపల్లి మంగామణి(విశాఖ)
వైష్ణవి శ్రీ (విజయవాడ)
గల్లా మాధవీలత (చిత్తూరు)
వంగిపురపు శారద (గుంటూరు)
అధికార ప్రతినిధులు:
జోస్యభట్ల స్వాతి (విజయవాడ)
ప్రచార కార్యదర్శి
1.శ్రీమతి సామినేని శైలజ,విజయవాడ
2.
కార్యనిర్వాహక కార్యదర్శి:
ఆదుర్తి సుహాసిని (విజయవాడ)
కోశాధికారి
బీరం అరుణ (ఒంగోలు)
కార్యవర్గ సభ్యులు:
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
న ర సం ఆధ్వర్యంలో
*కవిత్వంతో కాసేపు*
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం న ర సం ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సరం వేడుకలు ఉల్లాసంగా జరిగాయి.
స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ లోని మహిళాభ్యుదయ సమితి కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో పట్టణంలోని కవులు రచయితలంతా పాల్గొని సందడి చేశారు.
*కవిత్వంతో కాసేపు* అనే శీర్షికతో న ర సం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కవి సమ్మేళనం నిర్వహించారు.నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో కళామిత్రమండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మ రావు ,జానుడి అధ్యక్షులు శ్రీ డాక్టర్ నూకతోటి రవికుమార్ , శాంతివనం మంచి కంటి వెంకటేశ్వర రెడ్డి,యు వి రత్నం,ధర్నాశి చిరంజీవి, మహబూబ్ జాన్,మిడసల మల్లికార్జున రావు,కె.బాలకోటయ్య,మా మూర్తి,కనమాల రాఘవులు,బనారె, హుమాయూన్, కవయిత్రులు మున్నంగి రాహేలు,మారేపల్లి సూర్యకుమారి,నాళం నరసమ్మ,బీరం అరుణ,రాధికారత్న తదితరులు పాల్గొని తమ కవితా గానంతో అలరించారు.
సభాధ్యక్షులు శ్రీమతి తేళ్ళ అరుణ గారు మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం సమస్త మానవాళికి సుఖాలను,శుభాలను చేకూర్చాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు.అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేసుకున్నారు.
నరసం కర్నూలు శాఖవారి ఆహ్వానం
వీడియో సమావేశం
https://youtu.be/9dS7UlRXKUI
*న ర సం* ప్రకాశం జిల్లా శాఖ మహిళా దినోత్సవ
సంబరాలు 2023
రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని *నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం* న ర సం కవితా పోటీలు (మహిళా కవయిత్రులకు మాత్రమే) నిర్వహించాలని సంకల్పించింది.
అయితే మాకేంటి అంటున్నారా!🤔
ఉత్తుత్తి పోటీలు కాదు.
బహుమతులు కూడా ఉన్నాయండోయ్
*ప్రథమ బహుమతి*
*1500 రూపాయలు*
*ద్వితీయ బహుమతి*
*1000 రూపాయలు*
*తృతీయ బహుమతి*
*500 రూపాయలు*
ఇంకెందుకు ఆలస్యం?
*కలాలను కదిలించండి
హృదయాలను ఆవిష్కరించండి
కవితలను అందించి ఆనందింపజేయండి*.
మీలోని సున్నితత్వం,ఆవేశం, ఆక్రోశం,ఆవేదన,ఆలోచన అన్నీ కవితా వస్తువులే కాగలవు.ప్రయత్నించండి.
రెండు తెలుగు రాష్ట్రాలలోని కవయిత్రులెవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
*నిబంధనలు*
మీరు పంపించే కవిత
25 పంక్తులకు మించకూడదు.
ప్రక్రియ ఏదైనా ఫరవాలేదు.పద్యం/గజల్/గేయం/వచనకవిత
కవితలు మన నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి వాట్సాప్ నెంబర్ కు మాత్రమే పంపించాలి.
ఆవిడ వాట్సాప్ నెంబర్
*9866014619*
మీ కవితలు ఇక
ఏ ఇతర గ్రూపులలోనూ పోస్ట్ చేయకూడదు.
ఇతివృత్తం మహిళలకు సంబంధించినది మాత్రమే అయి ఉండాలి.
కవిత మీ సొంతమని,వేరెక్కడా ప్రచురింపబడలేదని హామీ పత్రం జతచేయాలి.
కవితతో పాటూ మీ ఫోన్ నెంబర్,ఫోటో,ఊరిపేరు తప్పకుండా రాయాలి.
బహుమతులు మహిళా దినోత్సవం రోజున ప్రకటించి ,అదే రోజు బహుమతి మొత్తం సొమ్ము మీ ఫోన్ నెంబర్ కు గూగుల్ పే లేదా ఫోన్ పే చేయబడుతుంది.
విజేతలకు ప్రశంసా పత్రాలు కూడా అందజేయబడతాయి.
వివరాలు అన్ని గ్రూపులలోనూ ప్రకటిస్తాము.
కవితలు పంపడానికి చివరి తేదీ
ఫిబ్రవరి 10.
ఆ తరువాత వచ్చిన కవితలు స్వీకరించబడవు.
కవితలు PDF చేయించి పంపాలి.
కవితల ఎంపిక నిర్ణయం నిర్వాహకులదే.దీనిపై ఎటువంటి వాదప్రతివాదనలకు తావు లేదు.
కనుక మహిళామణులారా!
అందరూ ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని,మన న ర సం కలాల పదును చూపెడతారని ఆశిస్తాను.
ఇట్లు
శ్రీమతి తేళ్ళ అరుణ
న ర సం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు
న ర సం జిల్లా అధ్యక్షురాలు
మున్నంగి రాహేలు
ప్రధాన కార్యదర్శి
శ్రీమతి కత్తి కృపావరం
2.2.2023
అందరికీ శుభోదయం.
నరసం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కవితల పోటీకి స్పందించి తమ కవితలను పంపిన కవయిత్రులందరికీ ధన్యవాదాలతో కవితలు పంపిన వారి పేర్లు
1.సిరిపురపు నాగలక్ష్మి
2.నామని సుజనా దేవి
3.ముదిగొండ మల్లీశ్వరి
4.సోమయాజుల అన్నపూర్ణ
5.రావుల కిరణ్మయి
6.రామచంద్రుని లక్ష్మి
7.జి కావ్య
8.లక్ష్మీ సుధీర్
9.తన్నీరు శశికళ
10.ఏ వరలక్ష్మమ్మ
11.సిహెచ్ పద్మావతి
12.డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని
13.నల్లపనేని విజయలక్ష్మి
14.కొంజేటి రాధిక
15.ప్రభ జ్యోత్స్న
16.దీకొండ చంద్రకళ
17.గొర్తి వాణి శ్రీనివాస్
18.కే లలిత
19.ఆచార్య నందని
20.వి సుజాత మూర్తి
21. డాక్టర్ జి భవాని
22.ఆదూరి మనోహర
23.ఎన్ మున్ని
24.కే విజయలక్ష్మి
25.కే లక్ష్మీ సరోజ
26.ఎం సరస్వతి దేవి
27.ఆర్ మాధవి
28.తోట సులోచన
29.కొలకలూరి దేవికారాణి
30.కె.గాయత్రీదేవి
31. భాగవతుల భారతి
32. కందే సునీత
33. సి ఏ జ్యోతి వర్మ
34. పి మెర్సీ రాణి
35. బి చెన్నమ్మ
36. ఎన్ లహరి
37. డాక్టర్ ఎం జహానారా
38. ఎస్ వహీదా రెహ్మాన్
39. డాక్టర్ ఎం రుక్మిణి
40. లలితా రెడ్డి
41. ఘూలి లలిత
42. ఎస్ రత్నలక్ష్మి
43. శ్యామలాదేవి
44. నెల్లుట్ల సునీత
45. కే యామిని
46. డి హసీనాబీ
47.డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి
48.p.మాసుంబీ
49.భవానీ లీలావతమ్మ
50.భావన
51.సువర్ణ జోషీ
మరికొంతమంది ఫోన్ చేసి వివరాలు అడిగారు గానీ,కవితలు పంపలేదు.ఇకపై పంపిన కవితలు స్వీకరించబడవు.
ఇప్పటికే మీ కవిత పంపి,పై లిస్ట్ లో మీ పేరు గనుక లేకుంటే నా నెంబర్ కు ఫోన్ చేయగలరు.
కవితలు పంపిన వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు.వివరాలు మహిళా దినోత్సవం నాడే అన్ని గ్రూపులలోనూ ప్రకటిస్తాము.గెలుపొందిన కవితలను కూడా గ్రూపుల్లో పెడతాము.గెలుపొందిన వారికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా తెలియజేస్తాము.
ఎంపిక కమిటీ మెంబర్
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.2.2023
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మాతృభాషా వారోత్సవాలు
న ర సం
21.2.2023 నుండి 27.2.2023 వరకు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం న ర సం ఆధ్వర్యంలో అంతర్జాతీయ
మాతృభాషా వారోత్సవాలు
21.2.2023 నుంచి 27.2.2023 వరకు
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారి నిర్వహణలో
https://youtu.be/QHAqpAPE4ek
Created by srilakshmi Chivukula Na Ra Sam. Vzm
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
1
ఒంగోలు నరసం సభ్యులు తెలుగుతల్లికి నీరాజనం సమర్పించటం
https://youtu.be/jMh9YbFpUjw
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
2.
న ర సం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ గారి సందేశం
https://youtu.be/KogI-EahCko
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
3.
న ర సం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారి కవితా గానం
https://youtu.be/i4zQ5SpVek8
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
4
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి సందేశం
https://youtu.be/XyflVqfb-_4
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
5
సింహాద్రి జ్యోతిర్మయి గారి కవితా గానం
https://youtu.be/IhHDJZetb4E
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
6
నరసం ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మున్నంగి రాహేలు గారి గానం
https://youtu.be/5UYYBb9YQQw
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
7.
సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజుగారి సందేశం
https://youtu.be/8HuzX_9cTuY
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
8
శ్రీమతి మారేపల్లి సూర్యకుమారి గారి సందేశం
https://youtu.be/FgCZk8d2YEs
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
9
శ్రీమతి గోవిందరాజు సుభద్రా దేవి గారి కవిత
https://youtu.be/FgCZk8d2YEs
https://youtu.be/JRlXfku1EcY
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
10
తన్నీరు శశికళ గారి కవితా గానం
https://youtu.be/8aE1htqk_rg
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
11
శ్రీమతి అడవి అన్నపూర్ణ గారి కవితా గానం
https://youtu.be/Cq2fEoRGYI8
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
12
కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు
https://youtu.be/8qVJhtVUbIY
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
13
శ్రీమతి కర్నాటి చంద్రమౌళిని గారి కవితా గానం
https://youtu.be/xFbGxZmmqD0
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
14.
శ్రీమతి తోట సులోచనగారి కవితా గానం
https://youtu.be/5lb__cPCvko
కళామిత్రమండలి జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు గారి సందేశం
https://youtu.be/3873rR5Ne-E
16
https://youtu.be/4MWjZ6im6OM
17
https://youtu.be/x1ONbXABDQY
18
శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారి సందేశం
https://youtu.be/bJiKcC0Dzxo
19
కళారత్న, సరస్వతీ పుత్ర డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు గారి సందేశం
https://youtu.be/cLupHLYlbcY
20
చిరంజీవి విశాల్ విద్యార్థి
https://youtu.be/GAk7c0dMwg8
21
శ్రీమతి అరుణ సందడి
https://youtu.be/YvAzMLHv1O0
22
చిరంజీవి ప్రఖ్య సింహాద్రి పద్య పఠనం
https://youtu.be/axJBBehCTSo
23
చిరంజీవి శ్రీకృష్ణ
https://youtu.be/3AlT5l28rXQ
24
చిరంజీవి లాస్య
https://youtu.be/wNaoazXjsoY
25
శ్రీ నారంశెట్టి
https://youtu.be/UAuBQvvW-jU
26
https://youtu.be/kzAJnBZuu_o
27
సాలూరి సంతోషి
https://youtu.be/CFgT2w8wNoc
28
https://youtu.be/qkVPgzqfQTo
29
https://youtu.be/tClf16xf7-Y
30
https://youtu.be/UAF1aNQ1UR4
31
https://youtu.be/s-kwwxUbxfw
32
https://youtu.be/v4y9ptevV04
మహిళా మిత్రులందరికీ *అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం *నరసం ప్రకాశం జిల్లా శాఖ* ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు.ఈ పోటీలలో ఉత్తమ మైన కవితలుగా ఎంపికైన విజేతల వివరాలు.
ముందుగా మేం అనుకున్నది ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు మాత్రమే.
కానీ వచ్చిన 51 కవితలలో నచ్చినవి ఎక్కువగా ఉన్నందున జిల్లా కమిటీ నిర్ణయం మేరకు
తృతీయ బహుమతి మొత్తం 500 నుండి 750 రూపాయలకు పెంచి,
మరో నాలుగు కన్సొలేషన్ బహుమతులు ఒక్కొక్కరికీ 500 చొప్పున ఇవ్వదలిచామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము.
కమిటీ నిర్ణయం మేరకు ఫలితాలు ఇవి
1 *ప్రథమ బహుమతి* 1500 రూపాయలు
పొందిన కవిత
*పురిటిగడ్డ*
కవయిత్రి...
డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని, కర్నూలు
2 *ద్వితీయ బహుమతి* 1000 రూపాయలు
పొందిన కవిత
*ప్రకృతిలో ఆమె*
కవయిత్రి పేరు
నామని సుజనా దేవి,వరంగల్
3. *తృతీయ బహుమతి* 750 రూపాయలు
పొందిన కవిత
*నల్ల కలువ*
కవయిత్రి..
నల్లపనేని విజయలక్ష్మి , గుంటూరు
500 రూపాయలు చొప్పున
ప్రత్యేక బహుమతులు పొందిన కవితలు(4)
1.*రెండు ప్రేమకణాల నెత్తుటి గడ్డ కథ*
తన్నీరు శశికళ, నాయుడు పేట
2. *విస్మృత*
కొలకలూరి దేవికారాణి, తెనాలి
3.*సకల కళల హేల*
భవాని లీలావతమ్మ ,నంద్యాల
4.*ఆమె ఓ అద్భుతం*
గొర్తి వాణి శ్రీనివాస్, విశాఖపట్నం
విజేతలందరికీ అభినందనలు.
వీరికి ఈరోజే వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు బహుమతి మొత్తం సొమ్ము ను పంపడం జరుగుతుంది.
వారం రోజుల పాటు రోజుకొక్కరి కవిత చొప్పున వారి ఫోటోతో పాటు అన్ని గ్రూపులలోనూ పెట్టడం జరుగుతుంది.
కవయిత్రులు మాకంటే ముందుగా తమ కవితలను గ్రూపుల్లో పోస్ట్ చేయవద్దని మనవి.
ఎందుకంటే వారోత్సవాలు జరిపిన అనుభూతిని పొందడం కోసం😍.
మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో
నరసం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి *తేళ్ళ అరుణ*
నరసం ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు
శ్రీమతి *మున్నంగి రాహేలు*
ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి
శ్రీమతి *కత్తి కృపావరం*
జిల్లా ఉపాధ్యక్షురాలు
శ్రీమతి *మారేపల్లి సూర్యకుమారి*
కవితల పోటీ కమిటి సభ్యురాలు
శ్రీమతి *సింహాద్రి జ్యోతిర్మయి*
ఒంగోలు
8.3.2023
న ర సం కవితల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కవిత
*పురిటి గడ్డ*
(సైనికుని మాతృమూర్తి ఆవేదన)
డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని, కర్నూలు
కన్నా!
నా కనులను ఉప్పు సముద్రాలు చేస్తూ
నీ ఆశయ తీరానికి రెక్కలు సాచి
ఎల్లలు చేరిన క్షణం నుంచీ
బడిలో తొలి పొద్దు నాటి నీ రోదన
ప్రతిపొద్దూ నాదయ్యింది
ఒక్కో క్షణాన్ని శ్వాసతో కొలుస్తూ
బడి విడిచే సందెవేళ ఆనాటి నీ ఎదురుచూపు
మలిసందెవేళ ఈనాడు నాదయ్యింది
నీ నుదుటిని ముద్దాడి
నీ వెన్నుని నిమిరే వెచ్చని స్పర్శను
శీతలసీమకు రవాణా చేయగల
మంత్రమో యంత్రమో నాదగ్గర లేదురా చిన్నా!
జ్ఞాపకాల బావిలో గతాన్ని చేదుకుంటూ రొప్పేవేళ
నా ఎదరొదను నీకు వినిపించలేనురా!
నేను కదలని గడియారం ముల్లును భారంగా ఈడ్చుకుపోతుంటే
నీవు మిగలని కాలాన్ని కనుమల్లో వెదుక్కుంటున్నావు
నేను పగలంతా తలవాకిలికి చూపులతికించి
వేసారి కలతనిదుర పోయేవేళ
నీవు నిశిని ఏలే అనిమిషరేడు వవుతున్నావు
కర్మభూమికి ఆచివర బాధ్యతతో నీవు
ఈ చివర నీమీద బెంగతో నేను
ఏ క్షణం ఏ కబురు పిడుగుపాటవుతుందో!
సరిహద్దుల నుంచి తరలిస్తున్న
త్రివర్ణాల హిమపేటికలు
ఏ కన్నపేగులను కాల్చేస్తున్నాయో!
చితిని చేరే చావు పరుగులో
ఉగ్రవాద విద్వేషం ఉడుకురక్తాన్ని మృత్యువు చల్లార్చకముందే
ఒక్కసారి వచ్చిపోరా నాన్నా!
పురిటి గడ్డను
కళ్ళల్లో పెట్టుకొని కాచేనిన్ను
కడుపారా పొత్తిళ్ళలో పొదువుకుంటా
ఒకే ఒక్కసారి రారా నా కన్నా!
న ర సం కవితల పోటీలలో *ద్వితీయ బహుమతి* పొందిన కవిత
*ప్రకృతిలో ఆమె*
**********************
నామని సుజనా దేవి
కట్టు బాట్ల కడలిలో ముంచినా
కడిగిన ఆణిముత్యంలా మెరిసి
కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాస్తూ
కలువల కనులలో కన్న కలల సాకారానికై
కడవరకు కష్టాలకెదురీదుతూ పోరాడుతున్న ఆమెలో...
కడలితీరం చేరడానికి అలుపెరగక ప్రయత్నించే
అలసిపోని అలల చైతన్యం కనబడుతుంది!!
ఆటు పోట్లను తట్టుకుని పోరాడి, గెలిచి నిలిచి
తన ఉనికిని చాటుకుంటున్న తరుణిని చూసినపుడు...
అతః పాతాళానికి తొక్కినా , ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుని
నింగే హద్దుగా సగర్వంగా చిగురించే విత్తనంలా గోచరిస్తుంది !!
ఆటంకమెంత పెద్దదయినా ఆత్మస్థైర్యంతో
ముందుకు దూకే సాహసాన్ని, సమయస్పూర్తిని చూస్తే
అనంతాకాశాన్ని కొలిచే బుజ్జి పిట్ట గుర్తొస్తుంది!!
అణిగిమణిగిన అమాయకపు అణువులా కనిపిస్తూ
విశ్వసిస్తే విశ్వమంతా ప్రాణవాయువందించే విశ్వజనీనశక్తిలా
ఆగ్రహిస్తే నింగినంటే ఆటంబాంబు విస్పోటనంలా అగుపిస్తుంది!!
వేరయిపోతున్న తల్లిపేగు బంధాలను
ఆత్మీయానురాగాల తీగలతో కలిపి ఉంచే అమ్మను చూస్తే
కొమ్మలు రెమ్మలు ఆకులు పూలు పళ్ళతో
శాఖోపశాఖలుగా విస్తరించినా, అడుగున అవని మాటున
అన్నింటికీ జీవాన్నిస్తూ కలిపి ఉంచే వేర్లు గుర్తొస్తాయి!!
అడగకుండానే అన్నీ ఇచ్చి, ఇవ్వడం తప్ప
తీసుకోవడం, కోరడం తెలియని అమ్మను/పడతిని చూస్తే
పరోపకారం తప్ప అన్యమెరుగని ప్రకృతి గుర్తొస్తుంది!!
*************************
న ర సం కవితల పోటీలలో తృతీయ బహుమతి పొందిన కవిత
*నల్లకలువ*
(సెరీనా విలియమ్స్ గురించి)
కవయిత్రి పేరు..
నల్లపనేని విజయలక్ష్మి
ఆమె వికసించడానికి
ఏ చంద్రోదయమూ అవసరం కాలేదు
పరిమళాలు పంచడానికి
ఏ వాయువు తోడునూ కోరుకోలేదు
నాలుగేళ్ల వయసులో
పట్టిన రాకెట్ తో
నలభయ్యేళ్ళ వయసు వరకూ
ఆకాశం అంచులను తాకిన ప్రయాణం
ముళ్ళబాటలో నడక
మోకాళ్ళ గాయాల వేధింపులు
ఇంక సెలవు తీసుకోమన్న శస్త్ర చికిత్సలు
అయినా బరిలో దిగితే
చిరుత పులి దూకుడు
ఇంద్రనీలమణి ప్రకాశం ఆమెది
అసమాన వేతనాలను ప్రశ్నించే వేళ
ఆమెదో ధిక్కారస్వరం
రికార్డుల వేటలో అలుపెరుగని యంత్రం
అవకాశాల్లో సగం మనవే అందిపుచ్చుకునే సాహసం మీకుందా!
అని సవాలు విసురుతుంది ఆమె జీవితం
కనబడని మారుతమై
నివురు గప్పిన నిప్పును రగిలిస్తుంది
కడుపులో బిడ్డను మోస్తున్నా
కడదాకా ఆపని పోరాటం
కలను నిజం చేసుకున్న వైనం
విజేత వీర గాధను వినిపిస్తుంది
అవును
నలుపంటే దృఢత్వం
నలుపంటే పట్టుదల
నలుపంటే ప్రేరణ
నలుపంటే విజయం
నలుపంటే మాతృత్వపు మమకారం తెలిసిన
మృదువైన హృదయం కూడా
అందుకే ఆమె *నల్ల కలువ*
********
న ర సం కవితల పోటీలలో ప్రత్యేక ప్రశంసా బహుమతి పొందిన *పద్యకవిత*
*సీసం*
మహిళలున్నతావు మరుమల్లె తోటగా
...వికసనమగు గాదె విరులగూడి
మహిళలులేకున్న మరుభూమి వంటిది
...అతివలేక జగతి యందమేది
కార్యమందున దాసి కరణమందున మంత్రి
...అన్నమిడెడు వేళ యన్నపూర్ణ
సకల కళల హేల సహనశీల వువిద!
...అందుకొమ్మ జనుల వందనమ్ము
*ఆ.వె*
తావు లన్నిట విధి తానుండజాలక
మలచి మమత రూపు
మహిళ గాను
అమ్మనిలకు బంపె కమ్మదనము నింపి
జగతిని వెలిగించ జనని వోలె.
విధి... బ్రహ్మ
🙏🙏🙏🙏🙏
🌹భవాని లీలావతమ్మ🌹
న ర సం కవితల పోటీలలో ప్రత్యేక ప్రశంసా బహుమతి పొందిన 2వ కవిత
*రెండు ప్రేమకణాల నెత్తుటి గడ్డ కథ*
కవయిత్రి... తన్నీరు శశికళ
బ్రతుకు పల్లకీ మోస్తూ,
కొన్ని అడుగులు నీ పక్కనే వేయబోతాను.
ఆడదానివి నాతో పాటా నడిచేది అని
కళ్ళ ఎరుపు కంచెలు కట్టేస్తావు.
అమ్మ కడుపు లోపలి గోడలలో
ఉన్నప్పుడే ఎన్ని సార్లు విన్నాయో
ఈ చెవులు ఈ మాట!
అడుగు వెయ్యబోయే ప్రపంచం
రెండుగా చీలిపోయుయింది అని
అప్పుడే తెలిసింది.
పురిటి ఆడపిల్ల కోసం చెత్త కుండీలు
తమ చేతులు చాచుకొని కూర్చుని
ఉంటాయి.
ఆడపిల్లకు ఇక్కడ కంటే మృత్యువు
నీడ చల్లగా ఊయలలు ఊపుతుంది.
రెండు ప్రేమకణాలతో
తొమ్మిది నెలలు పెరిగిన నెత్తుటి ముద్ద
కలల బుడగలు పేల్చేసుకుంటూ
బ్రతుకు త్రాసులో క్రిందకి తూగిపోతుంది.
హత్తుకోవాల్సిన అమ్మ ఒడి,
చదువుకోవాల్సిన బడి
అన్నీ ఆడపిల్ల అని పేరుపెట్టి
వెనుక వరుసలో కూర్చోబెడతాయి.
కట్నం కోసం మొదలై న
పొదుపురాక్షసి చదువును మ్రింగి
బ్రేవుమంటుంది.
డబ్బు తూకాలతో గెలుచుకున్న వరుడు
పండుగ కట్నాలతో బేరాలు చేస్తాడు.
తెచ్చిన జీతం అతని జోబులోకే!
విదిల్చిన మెతుకులతో ,
తీర్చాల్సిన సుఖపు బాకీలతో
రెప్పలు అంటుకుని పొయ్యేది కొన్ని
క్షణాలే!
ఉదాయాస్తమయాలు లోపలి
ఒంటరితనాన్ని జాలిగా చూస్తుంటాయి.
ఒడి నింపిన ఇద్దరు బిడ్డలు
యంత్రంగా మారిన తల్లిని ,
నీకేమి తెలుసని హేళన చేస్తుంటాయి.
ప్రభుత్వ రిజిస్టర్స్ నీ పేరు,నీ ఇంటి పేరు
గాలికెగిరిన చెత్త ను చేస్తాయి.
అతని పక్కన పడిపోయిన అడుగులు,
నేను మనిషిని అని గుర్తు చేస్తే,
కాదు దేవుడు నా పక్కటెముకలతో
చేసిన నా ఆటబొమ్మ వి అంటాడు.
బొమ్మ ఇంక ఉలకదు, పలకదు,
సంస్కృతి దారాలు నేస్తూ,
ప్రగతి నిచ్చెనలు ఎక్కిస్తూ ఉంటుంది ,
తన వీపు మీద మోసే హెర్క్యులేస్ తాను!
@@@@@
పంపిన వారు:తన్నీరు శశికళ,
లెక్చరర్.నాయుడుపేట.
న ర సం కవితల పోటీలలో ప్రత్యేక ప్రశంసా బహుమతి పొందిన 3వ కవిత
కవయిత్రి..గొర్తి వాణి శ్రీనివాస్ విశాఖపట్నం
*ఆమె ఓ అద్భుతం*
**************
సహస్రాధిక సమస్యల
సామాన్లు మదినిండా
సహనంతో సర్దుకుంటూ
ఒద్దికగా దిద్దుకుంటూ
అస్తిత్వ పటాలను
అన్నివైపులా అమర్చుకుంటూ
సహకరించని రేయికి
సామరస్య దివ్వెతో
వెలిగించుకుంటూ
లోకం గీసిన
నీతినియమాల గీతలపై
నిట్టనిలువునా నడిచెడుతూ
అనివార్యమైన ఆత్మాభిమానపు
ఊతకర్రని ఒడుపుగా నిలబెడుతూ
ఇంటా బయటా
ఇంతని చెప్పలేని
ఒత్తిళ్ల కత్తులపై
నవ్వుల గారడీల
పూలను రువ్వేస్తూ
వెనక్కి తిరిగి చూసుకుంటే
త్యాగంతో గడిచిన రోజులే అన్నీ
తనకోసమై తను బతికిన
క్షణాలను వేళ్ళతో లెక్కిస్తూ
లేని పెద్దరికాన్ని
అలసిన కంటితో
మందగించిన చూపులవెంట
అనురాగపు అద్దాన్ని సరిచేసుకుంటూ
బతుకు చివరిమలుపులో
బంధుజనంతో బంధాన్ని
ముడివేసుకుంటూ
'ఆమె ఎంత మంచిదో'
అనే ఆ ఒక్క మాటను
ఆత్మరూపంలో ఆనందంతో
స్వీకరిస్తూ
మనుష్యాణాం స్త్రీ జన్మ దుర్లభం
దేవుళ్లనైనా దీవించగల
పదవి తనదని ఆత్మతృప్తితో
కదలి వెళుతుంది ఆమె..
జిల్లాలకు మహిళల పేరులు పెట్టాలి – అన్నపూర్ణ ప్రధాన కార్యదర్శి
https://kalamsainikudu.com/2023/03/10/జిల్లాలకు-మహిళల-పేరులు-ప/
https://www.facebook.com/100006949601827/posts/pfbid02SVViTNCx4w7rPFDcRxXefMSB5X2eqAYfWhA7R6aiDZTvxcgKV1kRHDJ9xzq85XDl/?mibextid=Nif5oz
*శ్రీ శ్రీ , నాగభైరవ కోటేశ్వరరావులకు ఘన నివాళి*
ఒకరు మహాకవి,మరొకరు జాతీయకవి.సాహితీ జగత్తులో ఇరువురూ తమదైన ప్రగాఢ ముద్రను వేసిన వారే నని వక్తలు కొనియాడారు.జూన్ 14 నాగభైరవ 15 వ వర్ధంతిని, జూన్ 15 న శ్రీ శ్రీ 40 వ వర్ధంతి ని పురస్కరించుకుని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ లోని ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి కార్యాలయం లో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న ర సం) ఆధ్వర్యంలో15 వ తేదీ సాయంత్రం సభ జరిగింది.కవులు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు న ర సం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ అధ్యక్షత వహించగా నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తేళ్ళ అరుణ మాట్లాడుతూ మహాప్రస్థానం తో శ్రీ శ్రీ ఖ్యాతి
కవనవిజయంతో నాగభైరవ కోటేశ్వరరావు గారి ప్రతిభ లోకవిఖ్యాతమయ్యాయని అన్నారు.
డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో తొలిసారిగా విప్లవ కవిత్వం తో శ్రీ శ్రీ స్ఫూర్తి నింపారని,నాగభైరవ కోటేశ్వరరావు గారు ఎంతోమంది యువతకు ప్రోత్సాహం ఇచ్చి కవులుగా తీర్చిదిద్దారని అన్నారు.
కార్యక్రమంలో ఇరువురి చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు.
ఈ సభలో కళామిత్రమండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు గారు, కృష్ణదేవరాయాంధ్ర సాహితీ సంస్థ అధ్యక్షులు శ్రీ కుర్రా ప్రసాద్ బాబు, ఓరుగంటి ప్రసాద్,యు.వి.రత్నం,మిడసల మల్లికార్జున రావు, N.వెంకటేశ్వర్లు,కవయిత్రులు సింహాద్రి జ్యోతిర్మయి, ఝాన్సీ దుర్గ, మారేపల్లి సూర్యకుమారి,నాళం నరసమ్మ ,బీరం అరుణ తదితరులు పాల్గొన్నారు.
.......................అభినందన సభ.......................
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి స్టేట్ బెస్ట్ అవార్డు అందుకున్న శ్రీమతి తేళ్ల అరుణ గారి అభినందనసభ
తేదీ:22.03.2019,వేదిక:మౌర్య కాన్ఫరెన్స్ హాల్ ఒంగోలు నందుసాయంత్రం 6గంటలకు జరుగుతుంది.
.........గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో తన జీవితాన్ని పునీతం చేసుకుంటూ ాజకీయ రంగంలో రాణిస్తున్న కోణం ఒకవైపు.....
..........సామాజిక మార్పుకోసం 23 సంవత్సరాల నుండి శ్రమిస్తూ మహిళాభ్యుదయ సమితిని స్థాపించి కొందరు భర్తల అగాయిత్యాలకు బలియైపోయిన మహిళలను,చిన్న వయసులోనే ప్రేమ పేరుతో మోసపోయిన అబలలను ఒకరేమిటి ఎంతోమంది అనాధలను,అభాగ్యులను చేరదీసి, చేయూత నందించి .....పతితులార!భ్రష్టులార!బాధాసర్ప దష్టులార!ఏడ్వకండి! ఏడ్వకండి !అంటూ అక్కున చేర్చుకున్న మానవతామూర్తిగా ఒకవైపు......
..........పై రెండు ఒకయెత్తు అయితే... మరోకోణం సాహిత్యం రంగం.సంఘ సంస్కరణ మార్గంలో స్త్రీ సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తూ,స్త్రీ ఆర్థిక స్వావలంబన కోసం పరితపించే ఆదర్శ మహిళ శ్రీమతి తేళ్ల అరుణగారు.
..................అన్ని రకాలుగా అన్యాయానికి బలియైపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటూ "పరోపకారార్థ మిదం శరీరం "అన్న సూక్తి కి నిదర్శనమే ఆమె.ఇలాంటి అవార్డు ఎన్ని ఇచ్చినా,మరెన్నో వచ్చినా ఆమె సేవాభావం ముందు తక్కువే నని చెప్పాలి.అమ్మగా, అక్కగా ఎంతోమంది కి స్ఫూర్తి నిచ్చిన మా అమ్మ అరుణమ్మకు
ఇతోధికంగా మేము చేస్తున్న ఈ చిరు సత్కారం లో మీరంతా భాగస్వాములు కావాలని మా ఆకాంక్ష..........
ఇట్లు
..................ఆత్మీయ మిత్ర మండలి.ఒంగోలు..........
.............డా.నూనె అంకమ్మరావు
.............డా.నాగభైరవ ఆదినారాయణ
.............శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి
.............డా.మున్నంగి రాహేలు
.............శ్రీమతి కె.కృపావరం
.............శ్రీమతి వి.ఝూన్సీదుర్గ
.............కుర్రాప్రసాదుబాబు
.............మిడసల మల్లికార్జునరావు
.............షేక్ మహబూబ్ జాన్
............డా.సంతవేలూరి కోటేశ్వరరావు
............డా.వంకాయలపాటి రామకృష్ణ
............భువనగిరి పురుషోత్తం
............శ్రీమతి యం.సూర్య కుమారి
............శ్రీమతి ఆదూరి మనోహర
............తన్నీరు బాలాజీ
............ఇనకొల్లు మస్తానయ్య
............డా.ఉదయజానకి లక్ష్మీ
............నలిగల రాధికా రత్న
............పిన్ని వెంకటేశ్వర్లు
...........యు.వి రత్నం
...........యం.ఎల్.కాంతారావు
..........నూకతోటి శరత్ బాబు
..........రంగుల సంధ్య
..........కోవెలకుంట్ల బాలకోటయ్య
*న ర సం ఆశయ సాధనలో మరో అడుగు*
చిన్నారులను,యువతరాన్ని సున్నితత్వం వైపు నడిపించడానికి చక్కని మార్గం సాహిత్యమే అనే మా న ర సం ఆశయంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని దేవి ఇంగ్లీషు మీడియం స్కూల్ లో విద్యార్థులకు *పర్యావరణ పరిరక్షణ* అనే అంశంపై కథల పోటీలు నిర్వహించడం జరిగింది.
మా న ర సం చిత్తూరు
జిల్లా శాఖ అధ్యక్షురాలు శ్రీమతి కరణం విమల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో న ర సం గౌరవాధ్యక్షురాలినైన నేను రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి , కళామిత్రమండలి తెలుగు లోగిలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నాము.
తెలుగు భాషపట్ల పిల్లలకు గల ఆసక్తి,అభినివేశం కథలను అల్లడంలో వారి చిన్ని మెదళ్ళలో మొలకెత్తిన ఊహలు మమ్మల్ని ముగ్ధులను చేశాయి.
విమల ప్రయత్నాన్ని,ఆ ప్రయత్నం లో ఆమెకు సహకరించిన పాఠశాల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందించాము.
అదే సమయంలో పద్యాలను తడుముకోకుండా,తడబడకుండా చక్కని ఉచ్చారణతో పిల్లలు చెప్పడం చూసి ముగ్ధులమయ్యాము.
తదనంతరం గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ,తృతీయ, రెండు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చాము.బహుమతులు అందుకుంటున్నప్పుడు
పిల్లల ముఖాల్లో కనపడ్డ వెలుగు , ఆనందం చూసి మేము ఒక మంచి పని చేశామన్న సంతృప్తి మా మనసులలో నిండిపోయింది
మా ఆశయం దిశగా న ర సం వేసిన మరో అడుగు...
మీ
తేళ్ళ అరుణ
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం
(న ర సం) నిర్వహించబోతున్న
*శతాధిక కవయిత్రుల సమ్మేళనం* లో పాల్గొనడానికి
నారీమణులకు ఆహ్వానం
2017 జూలై లో ప్రారంభమైన మన నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు రచయిత్రులు, కవయిత్రులతో
*శతాథిక కవయిత్రుల సమ్మేళనం* విజయవాడలో నిర్వహించాలని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న ర సం) నిర్ణయించింది.
దీనికి మీరు చేయవలసిందల్లా కవయిత్రులుగా మీ పేర్లను త్వరగా నమోదు చేసుకోవడమే.
కవయిత్రులకు జ్ఞాపికలు, సత్కారాలు ఉంటాయి.విశిష్ట మహిళలకు పురస్కారాలు కూడా ఇవ్వదలిచాము.
కార్యక్రమం పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తాము.
మీరు ఈ మెసేజ్ ని మీ సాహితీ మిత్రులందరికీ చేర్చండి.
గమనిక..
*రాత్రి బయలుదేరితే తప్ప చేరుకోలేని
దూరప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు (కవయిత్రులకు మాత్రమే) వసతి సదుపాయం కల్పించబడుతుంది.
** కవయిత్రులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ఒక గ్రూపును ఏర్పాటు చేస్తాము.
*నిబంధనలు*
కవయిత్రులు తమకు నచ్చిన సామాజిక అంశాలపై 20 లైన్ల(కచ్చితంగా 20 లైన్లు) కవితను మాత్రమే చదవాలి.
అటువంటి కవితలతో పుస్తకం వేయిస్తామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం.
కవితలలో వ్యక్తిగత విమర్శలు,దూషణలు, అభ్యంతరకరమైన అంశాలు ఉండరాదు.
కవితలను పరిశీలనకు పంపవలసిన పనిలేదు.
కవిత చదివిన తరువాత మీ పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ తో కవితలను సభలో నిర్ణయించిన వ్యక్తికి అందజేస్తే సరిపోతుంది.
20 లైన్లకు మించిన కవితలు అచ్చుకు స్వీకరించబడవు.
పద్యాలైతే ఒక సీస పద్యం, రెండు ఇతర ఛందస్సులు
లేదా ఏవైనా 5 పద్యాలు వ్రాయవచ్చు.
పై నిబంధనకు అనుగుణంగా
సభలో చదివిన కవితలు మాత్రమే ప్రచురణకు స్వీకరించబడతాయి.
పేర్లు నమోదు చేసుకునేందుకు ఫోన్ నెంబర్ , గ్రూప్ కూడా కూడా త్వరలోనే ప్రకటిస్తాము
ఇట్లు
శ్రీమతి తేళ్ళ అరుణ
నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు
శ్రీమతి చిన్న లక్ష్మీ కళావతి
న ర సం రాష్ట్ర అధ్యక్షురాలు
శ్రీమతి పాతూరి అన్నపూర్ణ
న ర సం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం 6 వ వార్షకోత్సవ సందర్భంగా
రచయిత్రుల కవితలు
1.మొదటి ఆవృత్తం
వీడియో
http://youtu.be/V2gY9kyM1q4
కవయిత్రులు కవితా గానం
#నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం 6 వ వార్షకోత్సవం
ఆధ్వర్యం: శ్రీమతి తేళ్ళ అరుణ గారు
2.రెండవ ఆవృత్తం
వీడియో
http://youtu.be/LNazgP_wgIg
"నరసం"అవార్డ్స్
శ్రీమతి తేళ్ళ అరుణ మరియు నరసం సభ్యుల ఆధ్వర్యంలో
3.పురస్కారాల వీడియో
వీడియో
http://youtu.be/LmdPo9Ry_jw
"నరసం"అవార్డ్స్
శ్రీమతి తేళ్ళ అరుణ మరియు నరసం సభ్యుల ఆధ్వర్యంలో
వీడియో
http://youtu.be/LmdPo9Ry_jw
"నరసం"కవయిత్రులు కవితా గానం
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం వారి నిర్వహణ
శ్రీమతి తేళ్ళ అరుణ& నరసం సభ్యులు
4.3వ ఆవృత్తం
వీడియో
http://youtu.be/qhJYgfRSKq4
కవితా గానం/"నరసం"/6 వ వార్షిక వేడుక
4 వ ఆవృత్తం
వీడియో
http://youtu.be/3hPFyiKsoro
"నరసం"కవయిత్రులు కవితా గానం
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం
శ్రీమతి తేళ్ళ అరుణ గారు & నరసం సభ్యుల ఆధ్వర్యంలో
5 వ ఆవృత్తం
వీడియో
http://youtu.be/XFwkF-scDLU
"నరసం"కవయిత్రులు కవితా గానం
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం 6 వార్షిక వేడుక
6వ ఆవృత్తం
వీడియో
http://youtu.be/XvuKrn8_DKQ
7 వ ఆవృత్తం
https://youtu.be/Eecs-TzNaQ4?si=3RUtDWU1Bve_diri
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న ర సం) 6 వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఆగస్టు 12 వ తేదీ జరగబోయే శతాధిక కవయిత్రుల సమ్మేళనం సభకు హాజరయ్యేందుకు ఇప్పటివరకూ తమ సమ్మతిని తెలియజేసిన కవయిత్రుల జాబితా
1.వి సుజాత మూర్తి, వైజాగ్
2.వై చంద్రకళ, విజయవాడ
3..పి జ్యోతిష్మతి, అద్దంకి
4.సాలిపల్లి మంగామణి ,వైజాగ్
5..ఎం సాయి లక్ష్మి, గుడివాడ
6..ఎన్ సి హెచ్ సుధ మైధిలి, గుంటూరు
7. గుడిపూడి రాధికా రాణి, మచిలీపట్నం
8.వి విజయశ్రీ దుర్గ, విజయవాడ
9.జి. సావిత్రి ప్రసాద్, కాకినాడ
10.యస్. రత్నలక్ష్మి, నంద్యాల
11. షేక్ ముంతాజ్ బేగం ,ఏలూరు
12. కోన పద్మావతి, వైజాగ్
13.టి విజయదుర్గ, కర్నూలు
14.జి రాజరాజేశ్వరి, మచిలీపట్నం
15.సుభాషిణి వడ్డెబోయిన,ఒంగోలు
16.కృష్ణవేణి పరాంకుశం, ఒంగోలు
17.కరణం విమల, చిత్తూరు
18.గంపా శ్రీదేవి, అనకాపల్లి
19.కె. దేవికారాణి, తెనాలి
20.మొండ్రేటి సత్యవీణ, హైదరాబాద్
21.గల్లా మాధవీ లత, చిత్తూరు
22.ప్రత్తిపాటి సుభాషిణి, బాపట్ల
23.శిరిపురపు అన్నపూర్ణ, విజయవాడ
24.యనమండ్ర వరలక్ష్మి, అద్దంకి
25.కనమర్లపూడి సావిత్రి, విజయవాడ
26.డాక్టర్ ఎన్ విజయలక్ష్మి, కర్నూలు
27.తాటికోల పద్మావతి, గుంటూరు
28. అరుణ సందడి, నెల్లూరు
29.ఎం సునీత, ఒంగోలు
30. టి. మహేశ్వరి, షాద్ నగర్
31. డాక్టర్ యు. ఝాన్సీ ,నూజివీడు
32. జూపూడి సుధారాణి, బంటుమిల్లి
33. పి. భాను తేజశ్రీ, విజయవాడ
34. ఎం నాగజ్యోతి, ఆదోని
35. కె. సంధ్యా రెడ్డి, హైదరాబాద్
36. గీతా కుమారి, సత్తుపల్లి
37. ఎస్ హసీనా బేగం, పుంగనూరు
38. సామినేని శైలజ, విజయవాడ
39. సన్నిధి స్వాతి కృష్ణ, అనకాపల్లి
40. ఉరిమళ్ళ సునంద, ఖమ్మం
41. కె. గాయత్రీ దేవి, పుంగనూరు
42. రామచంద్రుని లక్ష్మి, ఒంగోలు
43. గోవిందరాజు సుభద్రాదేవి ,నెల్లూరు
44. ఎస్. స్రవంతి, పుంగనూరు
45. నెమ్మాని హరిప్రియ, విజయవాడ
46. పి అమర జ్యోతి, అనకాపల్లి
47. డాక్టర్ పి నీలవేణి, కడప
48. సయ్యద్ నజ్మా షమ్మీ, నెల్లూరు
49. చయనం అరుణా శర్మ, విజయవాడ
50. కె. సౌందర్యవతి, రాజమండ్రి
51. సి హేమలత, పుంగనూరు
52. దేవరకొండ ప్రసన్న, తెనాలి
53. బేతా శారదా దేవి, రాజమండ్రి
54. కె. అరుణ ప్రసన్న, తిమ్మసముద్రం
55. సుకన్య వేదం, కర్నూలు
56. డాక్టర్ కోనేరు లక్ష్మీ ప్రమీల, హైదరాబాద్
57. డాక్టర్ మైలవరపు లలితా కుమారి, గుంటూరు
58. పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
59. తుమ్మల స్నిగ్ధ మాధవి, విజయవాడ
60. కందెపి రాణీప్రసాద్, కరీంనగర్
61. ఆవలకొండ అన్నపూర్ణ, తిరుపతి
62. సిద్ధాబత్తిని రమా మయూరి, తుమ్మలపాలెం
63. సత్యవతి దినవహి, గుంటూరు
64. దుర్గం సునీత, సత్తెనపల్లి (స్టూడెంట్)
65. వి. అమరేశ్వరి, విజయవాడ
66. ఎస్. దేవహర్షిణి, నంద్యాల
67. భోగరాజు సూర్యలక్ష్మి, విజయనగరం
68. డాక్టర్ టి. శ్రీదేవి, గుంటూరు
69. లంకా మాధవి, గుంటూరు
70. కొల్లా జయశ్రీ, విజయవాడ
71. జంధ్యాల కామేశ్వరి ,ఒంగోలు
72. మారేపల్లి సూర్య కుమారి ,ఒంగోలు
73. సువర్ణ జోషి, కర్నూలు
74. అన్నమరాజు హైమావతి, కర్నూలు
75. భవాని లీలావతమ్మ, కర్నూలు
76. దేవరకొండ జోత్స్న, కర్నూలు
77. సాతర్ల ఝాన్సీ రాణి, కర్నూలు
78. పర్వతనేని శ్రీలక్ష్మి, విజయవాడ
79. అమ్మల కామేశ్వరి, శ్రీకాకుళం
80. కరెడ్ల సుశీల, మచిలీపట్నం
81. కరకవలస వాసవి, శ్రీకాకుళం
82. గూనాపు శార్వాణి, పాతపట్నం
83. ఎం. అనాంబిక, తిరువూరు
84. యాచం మంజులత, సరూర్ నగర్
85. నీలిమ పసుపులేటి, కర్నూలు
86. ఈడిగ దుర్గ, కర్నూలు
87. గరికపాటి దేవి సుకన్య ప్రసాద్, గొల్లపల్లి
88. భాను శిరీష, గుడివాడ
89. చెరుకూరి వెంకటలక్ష్మి, తూర్పుగోదావరి
90. సోలా జానకి దేవి, నెల్లూరు
91. పంతుల వరలక్ష్మి, ధర్మపురి
92. వడ్డాది లక్ష్మీ సుభద్ర ,విజయవాడ
93. షేక్ నజియా బేగం, విజయవాడ
94. నూచెర్ల శుభామహి, ఖమ్మం
95. సింహాద్రి వాణి, విజయవాడ
96. ఉప్పల శాంతిశ్రీ, హైదరాబాద్
97. కోతి దివ్యశ్రీ, ఆదోని
98. భూపతి సుమశ్రీ, కాకినాడ
99. సింహాద్రి పద్మ, అవనిగడ్డ
100. సిహెచ్. నాగమహాలక్ష్మి, ఏలూరు
101. ఎం. ఎన్. వి. సూర్యకుమారి, తాడేపల్లిగూడెం
102. మున్నంగి రాజకుమారి, ఒంగోలు
103. వల్లభనేని ఝాన్సీ దుర్గ, ఒంగోలు
104.జాదవ్ సాయి శ్రవంతి, కామారెడ్డి
105.రావాడ కృష్ణ కుమారి,సాలూరు
106.మాచిరాజు మీనాకుమారి, విజయవాడ
107. డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి , కేశవరం, (కోనసీమ)
108.అస్మతున్నీసా షేక్, తెనాలి
109. ములుగు లక్ష్మీ మైథిలి నెల్లూరు
110. పి పద్మజా రామకృష్ణ, తెనాలి
111. డి.ఎస్.వి. మహాలక్ష్మి, హైదరాబాద్
112. కాసర లక్ష్మీ సరోజా రెడ్డి, జంగారెడ్డిగూడెం
113. వి . శ్రీ ఉమామహేశ్వరి, విజయవాడ
114. ఆలపాటి సత్యవతి, విజయవాడ
115. శ్రీ సుధ కొలచన, హైదరాబాద్
116. బంగారు కల్ప గురి, హైదరాబాద్
117. ఘాలి లలితా ప్రవల్లిక, మహబూబ్ నగర్
118. జాస్మి సుధీర్, కేరళ
119. పేరూరు మహాలక్ష్మి, అనంతపురం
120. బిరుదు రాజు ప్రమీలా రాణి, ఏలూరు
121. జోస్యభట్ల స్వాతి, విజయవాడ
122. వైష్ణవి శ్రీ, విజయవాడ
123. నాళం నరసమ్మ, ఒంగోలు
124.బీరం అరుణ, ఒంగోలు
125.తొమండ్ర మల్లీశ్వరి,రాజమండ్రి
126. డాక్టర్ దేవులపల్లి పద్మజ, వైజాగ్
127.గంగవరపు సునీత, మార్టూరు
128.కె.శైలజా శ్రీనివాస్, విజయవాడ
129.తన్నీరు శశికళ
130.వేదాల విజయలక్ష్మి, గుంటూరు
131.వేదాల హరిణీకృష్ణ , గుంటూరు
************
Comments
Post a Comment