గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)
గీతా (కంద) మరందం భగవద్గీత (అమర గాయకులు శ్రీ ఘంటసాల పాడిన భగవద్గీత శ్లోకాలకు) స్వేచ్ఛానువాదం కంద పద్యాలలో గీతా (కంద) మరందం రచన.. సింహాద్రి జ్యోతిర్మయి న ర సం (నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఒంగోలు 9866014619 అంకితం మద్గురువర్యులు శ్రీ రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ (రిటైర్డ్ ఐఆర్ఎస్) గారికి సభక్తికంగా *గీతా (కంద) మరందం* ఒక మాట అందరికీ నమస్సులు.నా పేరు సింహాద్రి జ్యోతిర్మయి.నేను కవయిత్రిగా ఇప్పటివరకూ ఏవేవో పాటలు,పద్యాలు,కవితలు రాసుకుంటూ పోయాను.రాస్తూనే ఉన్నాను.ఇంతకుముందు భజగోవిందం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం,శ్రీవిష్ణు కందం ఇవన్నీ కందపద్యాలలో రాశాను.ఈ సంవత్సరం భగవద్గీత కందపద్యాలలోకి అనువాదం చేయాలని మనసులో ఒక స్ఫురణ కలిగింది.భగవద్గీత ఇంతకు ముందు చాలా సందర్భాలలో విన్నదే.చదివినదే, అక్కడక్కడా కొన్ని శ్లోకాలు నోటికి వచ్చినవే అయినా మా గురువుగారి నోటివెంట అనేక సందర్భాలలో గీతాశ్లోకాలు ,వాటి అంతరార్థాలు వినడం వల్ల గీతా శ్లోకాలు నేర్చుకోవాలి అని బలంగా అనిపించింది.దానికి ఒక సందర్భంకలిసివచ్చింది. నాకు చాలాకాలంగా ...