20/4*సుప్రభాత కాంతులు* కందంలో *మంగళా శాసనమ్* (14 శ్లోకాలు)

******************************************************** *సుప్రభాత కందం* *స్వేచ్ఛానువాదం* *శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనమ్* (14 శ్లోకాలు) *శ్లోకం..57* శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినామ్ | శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్|| *కందం..57* మంగళమో లక్ష్మీశా! మంగళమో భక్తసులభ! మహనీయగుణా! మంగళమో శ్రీ నిలయా! మంగళమో తిరుమలేశ!మంగళమయ్యా! తాత్పర్యం.. ఓ లక్ష్మీపతీ!ఓ భక్తసులభా!ఓ మహనీయగుణాకరా!ఓ శ్రీ నిలయా!ఓ తిరుమలేశా!నీకు మంగళమగుగాక! ***************************** *శ్లోకం..58* లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే | చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ || *కందం..58* అచ్చెరువున శ్రీదేవిని విచ్చిన కనుదోయి మెరయ వింటిబొమలతో ముచ్చట మీరగ గాంచెడు పచ్చవిలుతుతండ్రి!నీకు భద్రమగు నయా! 2. తాత్పర్యం.. ఓ మన్మధజనకా!చక్కనైన కనుబొమలతో అలరారి మెరుస్తూ విచ్చిన కన్నులతో ముచ్చటమీరగా నీ సతియైన లక్ష్మీదేవిని చూసే ఓ స్వామీ!నీకు మంగళమగుగాక. **************************** *శ్లోకం..59* శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే| మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్|| *కందం..59* వేంకట...