19.సీసోత్తరం

సుశ్లోకవేది మిత్రులకు శుభోదయం. గురువుగారికి నమస్సులు. సీసం. రత్నహార మొసగి రాముడా హనుమను గారవించిన యంత ఘనముగాను మేరువుశిఖరాన మెరయు చంద్రుడనగ హనుమ వక్షమున యా హార మమర వారి బంధముగని చేరి వానరులెల్ల మురిసి రామపదము మొక్కినారు సోదర సముడైన సుగ్రీవుడున్ రాక్ష సాధిపుడగు విభీషణ ప్రముఖులు తే.గీ. రాము వీడ్కొని చన కాళ్ళు రానివారై మిగుల దుఃఖపడుచు రాము నగరు బాసి జీవము నొదిలి పోయెడు జీవులవలె విభుడు శ్రీరాము సన్నిధి వీడి చనిరి. సుశ్లోకవేది మిత్రులకు శుభ రాత్రి గురువుగారికి నమస్సులు. సీసం బంధు హితులనెల్ల పరమాదరము తోడ సత్కరించి పిదప సాగనంపి తమ్ములతో గూడి యిమ్ముగా రాముండు ముచ్చటాడుచు తాను మురియుచుండ అపరాహ్ణ వేళలో యాకాశమందుండి వినిపించె నొకవాక్కు విస్మయముగ సౌమ్యుడా!శ్రీరామ!సన్నుతించెద నిన్ను పుణ్యుడా!గొనుము నే పుష్పకమును తే.గీ. రావణు వధించి జగముల రక్షసేసి వెలుగు రాముని జేరుమా వేడ్క మీర యని కుబేరుడు కర్తవ్య మానతివ్వ చేరుకొంటి చెంతకు నను స్వీకరించు. సీసం...