Posts

Showing posts from April, 2023

16.*సమస్యల వలయం*

Image
  రంభ,రాశి,రవళి,రాధిక అనే సినీ తారల పేర్లతో భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పూరణ అవధాని...బులుసు అపర్ణ గారు దత్తపది ఇచ్చిన వారు.. మార్తాటి ఈశ్వరీగోపాల్ గారు నా పూరణ  సందర్భం.. రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ద్రౌపది తన గోడు చెప్పుకుంటున్ప సందర్భం  తే.గీ. అన్న !విన  *రా శి* ఖి సమపు యాగ్రహమున సమరమునకు సం *రంభ* మ్ము సలుపుదురని యుద *ర వళి* దాచి దుఃఖమ్ము నోర్చుకొంటి పతుల వీ *రాధిక*  బిరుదుల్ మతిని నిలిపి బిరుదు.. ప్రతిజ్ఞ, సామర్థ్యం  సింహాద్రి జ్యోతిర్మయి  న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  23.9.2024 అద్దంకి లో జరిగిన నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానం లో ఒక‌ పృచ్ఛకుడు ‌అవధాని గారికి ఇచ్చిన దత్తపదులు ఇవి. వీటితో సరదాగా నా ప్రయత్నం  *దత్తపదులు*  సారా  కల్లు  రమ్ము  జిన్ను  రామాయణార్థంలో నా పూరణ *కం* మన *సారా* నిను నమ్మిన  వనధిని తేలాడి *కల్లు* వారధి నిలిచెన్  దునిమెద నిను *రమ్ము* తులువ! యని యా *జి న్ను*‌గ్గు సేస్తి వసురుని రామా! వనధి.. సముద్రం  కల్లు...ఱాయి ఆజి.. యుద్ధం  ఆజిన్+నుగ్గు..ఆజిన్నుగ...

6. నా (రీ) అనుభూతులు

Image
చిన్నారులకు వినాయక చవితి శుభాకాంక్షలతో .......1.వినాయకుని‌ ఆత్మకథ....... విన్నావా! చిన్ని నేస్తమా! వినాయకుణ్ణి నేనే సుమా! నలుగు ముద్దతో నన్ను నా తల్లి పార్వతి ప్రేమతో చేసింది ప్రాణాలు పోసింది మట్టిముద్దతో మీరు మలిచి పూజిస్తె చాలు సిద్ధిబుద్ధుల నిచ్చి దీవింతు మిముమెచ్చి నాలుగాకులు తెచ్చి నన్ను మనసార కొలిచి పెట్టు నమస్కారాలు ఉన్నంతలో ఇవ్వు ఉండ్రాళ్ళు కుడుములు ఆలకించి నా కథను అక్షతలు చల్లుకో నీలాపనిందలవి చేరవిక నీ దరికి జీవితాన్ని ప్రకృతితో ముడివెయ్యి బ్రతుకును పండుగలా గడిపెయ్యి నిరాశలను నిమజ్జనం చేసెయ్యి నేను అమ్మ చెప్పినమాట  బుద్ధిగా విన్నాను అన్ని విద్యలకు నేను అధిపతిని అయ్యాను నాన్న దండించినా నొచ్చుకోనందున అందరికీ నేను ఆది పూజితుడనయ్యాను అవమానాలను సహించాను నా కథను లోకంలో ఆరాధనీయం చేసుకోగలిగాను నా అవస్థను చూసి నవ్వినవాళ్ళు అమ్మ ఆగ్రహానికి గురయ్యారు శాపగ్రస్తులయ్యారు ఏకాగ్రతతో చదివాను ఏకసంధాగ్రాహినయ్యాను వ్యాసుని భారతానికి వ్రాయసకాడినయ్యాను చంచలమైన మనస్సనే ఎలుకను నేను బుద్ధితో స్వారీ చేస్తూ అదుపులో పెట్టుకుంటాను తల్లిదండ్రుల పాదసేవయే తరించే మార్గమని గ్రహించాను విష్ణు నా...