16.*సమస్యల వలయం*

 

రంభ,రాశి,రవళి,రాధిక అనే సినీ తారల పేర్లతో భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పూరణ
అవధాని...బులుసు అపర్ణ గారు
దత్తపది ఇచ్చిన వారు..
మార్తాటి ఈశ్వరీగోపాల్ గారు

నా పూరణ 
సందర్భం.. రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ద్రౌపది తన గోడు చెప్పుకుంటున్ప సందర్భం 

తే.గీ.
అన్న !విన  *రా శి* ఖి సమపు యాగ్రహమున
సమరమునకు సం *రంభ* మ్ము సలుపుదురని
యుద *ర వళి* దాచి దుఃఖమ్ము నోర్చుకొంటి
పతుల వీ *రాధిక*  బిరుదుల్ మతిని నిలిపి
బిరుదు.. ప్రతిజ్ఞ, సామర్థ్యం 

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
23.9.2024


అద్దంకి లో జరిగిన నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానం లో ఒక‌ పృచ్ఛకుడు ‌అవధాని గారికి ఇచ్చిన దత్తపదులు ఇవి.
వీటితో సరదాగా నా ప్రయత్నం 

*దత్తపదులు* 
సారా 
కల్లు 
రమ్ము 
జిన్ను 

రామాయణార్థంలో

నా పూరణ

*కం*
మన *సారా* నిను నమ్మిన 
వనధిని తేలాడి *కల్లు* వారధి నిలిచెన్ 
దునిమెద నిను *రమ్ము* తులువ!
యని యా *జి న్ను*‌గ్గు సేస్తి వసురుని రామా!

వనధి.. సముద్రం 
కల్లు...ఱాయి
ఆజి.. యుద్ధం 
ఆజిన్+నుగ్గు..ఆజిన్నుగ్గు
నుగ్గు చేయడం అంటే పొడి పొడి చేయటం

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


అద్దంకి లో జరుగుతున్న శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానంలో ఒక పృచ్ఛకురాలిగా 
వారి అవధాన విద్యకు నమస్సులు సమర్పిస్తూ..

*సీ.*
పొసగని *సమస్య* ల విసరుచు పొత్తుగ 
...పూరణ జేయగ గోరువారి 
వింత *దత్తపదు* ల వేడ్కమీర నొసగి 
....పాండిత్యమును జూపుచుండు వారి 
అమ్ముల వలె దోచు *యాశువు* ల్ సంధించి 
...చిరుచిరు నవ్వులు చిందువారి 
వాగ్వైభవమ్మెల్ల *వర్ణన* జొప్పించి 
....చిద్విలాసము జూపి చెలగు వారి

*ఆ.వె.*
పలుకులమ్మ దయను  పద్యమ్ము లవలీల 
అల్లుచు సెహబాసు లందుకొనుచు 
అద్భుతముగ జేసె నవధాని ధారణ
వారి మెచ్చుకొనగ వాక్కు లేదు🙏🙏🙏

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
25.8.2024.

[26/08, 9:29 pm] Simhadri Jyothirmai: *ఆశువు*

*దేశ‌భాషలందు తెలుగు లెస్స* యను మధురోక్తిని నేటి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు లెస్ అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో,రానున్న తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భాషను కాపాడుకునే కర్తవ్యాన్ని ఉద్బోధిస్తూ ఆశువు చెప్పండి.

అవధాని శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి పద్యం 

*ఆ.వె.*
లెస్సుకాదు భాష లెస్స లెస్స యనుడు
మాతృభాషలోని మధురిమలను 
తెలుసుకొనగ దగును తెలుగువారెల్లరు 
స్ఫూర్తిమంతమైన శుద్ధభాష 

*నేను చేసుకు వెళ్ళిన పూరణ*
*కం.*
ఉస్సురనగ నేల
తెలుగు 
లెస్సయను ఘన పలు కాంగ్ల లెస్సయ్యె నయో!
నిస్సిగ్గుగ మన దగదిక 
లెస్సగ కాపాడుకొనగ లెమ్మిక తెలుగుల్

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
25.8.2024
[26/08, 9:29 pm] Simhadri Jyothirmai: శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానం లో 
నేనిచ్చిన
*వర్ణనాంశం*

నాటి కోడలిగా,నేటి అత్తగా కూడా తానే భయపడుతూ గడుపుతున్న నేటి మధ్యవయసు ఆడవారి పరిస్థితిని వర్ణిస్తూ పద్యం చెప్పండి.

అవధాని గారి పూరణ

*తే.గీ.*
నాటి కోడలి పోస్టులో చేటుగొంటి
నేటి అత్తమ్మ పోస్టులో చేటుగొంటి 
ఏమి ఖర్మము మాకిద్ది యీ తరాన 
అనుచు విలపించె నొకనాటి యనుగు చెల్లి

నేను చేసుకున్న పూరణ 

*ఆ.వె*

అణిగిమణిగి యుంటి నానాడు అత్తింట 
కూడదాయె స్వేచ్ఛ కోడలింట 
నేడు నాడు గూడ నేనైతి లోకువ 
తరములంతరముల తగులుకొంటి

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
25.8.2024
[26/08, 9:29 pm] Simhadri Jyothirmai: శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానం లో 
నేనిచ్చిన సమస్య 

చం.
*పతితను కోరి చేరుకొన పావనులౌదురు సర్వులీ యిలన్* 

అవధాని గారి పూరణ

అతులిత మాధురీ సుధల నందగజేయును యెల్లవారికిన్ 
*పతితను కోరి చేరుకొన,పావనులౌ దురు సర్వులీ యిలన్*
సతతము రామనామసుధ సక్తిగ గోరుచు గ్రోలుచుండినన్ 
వితత మహత్వ కార్యములు వేదన లేకనె తీరునిద్ధరన్ 

నేను చేసుకున్న పూరణ 

చం.
సతతము సాగుచుండు నది జాహ్నవి పుణ్యుల మ్రొక్కులంది,కా
మితముల దీర్చు నాకధుని మేదిని జారె భగీరథుం డుమా
పతి కృప నందినంత సురపావనియౌ హరి పాదజాత యా
*పతితను కోరి చేరుకొన పావను
లౌదురు సర్వులీ యిలన్*

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
25.8.2024
[26/08, 9:29 pm] Simhadri Jyothirmai: శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానం లో నేను ఇచ్చిన దత్తపదులు

*అండ,దండ,కండ,రండ*
అన్యార్థంలో భారతకథా ఘట్టం ఏదైనా చెప్పండి 

అవధాని గారి పూరణ 

ఉ.
అండగ కృష్ణుడుండ మనకాశయ సిద్ధి లభించునింకపై 
కండబలంబు జూపి యని కార్ముకమెత్తియు జయంబు నందుమా 
రండల కౌరవాధముల రాజిత తేజ మథఃకరింప వే
దండములట్లు మీరలిక దర్పము జూపుచు సాగుడిప్పుడున్.

నేను చేసుకున్న పూరణ 
సందర్భం..రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ద్రౌపది విన్నపం 

*అండ* జ యానుడా!వినవె!యక్కట నాథులు మ్రాన్పడంగ నే
*దండ* మొనర్ప నిండు సభ దండిగ చీరలొసంగి యన్న!నా
*కండ* గ నిల్చినట్లె,మది యారట దీర్పగ సంధి ద్రుంచి రా 
*రండ* ని ధార్తరాష్ట్రులను ప్రల్లద మాడుచు పోరుగూర్పుమా!

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
25.8.2024




సమస్యా పూరణలు

బాలు పాటలు
B+ మాటలు
అంటూ B పాజిటివ్ వేదికగా అమెరికా తెలుగు భాషా ప్రియులు శ్రీయుతులు
భాస్కర్ రాయవరం గారి 
 ఆధ్వర్యంలో జరిగిన

స్వర్గీయ
బాలూ గారు పాడిన పాటలలోని మాటలు దత్తపదులుగా ఇచ్చి,
రామాయణ,భారతార్థాలలో పద్యాలు చెప్పమంటూ ఏర్పాటు చేసిన
పద్యలహరి కార్యక్రమానికి ఆహ్వానితులైన 12 మంది కవులలో  ఒకదానిగా   ఈ ఉదయం  నేను కూడా పాల్గొనటం నా భాగ్యం.

నాకు ఇవ్వబడిన 4 పదాలు

కోటప్ప
లైలా
బంగినపల్లి
జగడం.

నా పూరణలు

1.భారతార్థంలో..

ఉద్యోగ పర్వం లో 
రాయబారానికి వెళ్ళబోతున్న శ్రీ కృష్ణుని తో సహదేవుడు తన అభిప్రాయాన్ని చెబుతున్న సందర్భం

తేటగీతి.

మనదు *కోటప్ప* నమ్ముగ మాయతోడ
దుష్టు *లై లా* గి కొనలేదె ద్యూతమందు
*జగడ* మాడగ కాల్దువ్వు పగఱ తోడ
వసుధ *బంగినపల్లి* యే పంచుకొనగ.

పగఱు అంటే
శత్రువులు అనే అర్థం 

*మామిడి పండ్లు రసాలు అయితే ఏకంగా ఒక్కరే తినాలి.
బంగినపల్లి ముక్కలు కోసుకొని తింటాం కదా!

2.
రెండవ పద్యం
రామాయణార్థంలో

కైక దశరథుని  వరాలు కోరిన సందర్భం

తేటగీతి

*జగడ* మాడెడు కైకతో చాలకునికి
శోకజలధి పా *లై లా* వు లేక తండ్రి
అలసిపోవ, జననికి *కోటప్ప* గించె
రసరసాల *బంగినపల్లి* రాము మనసు.

రసాలము.. మామిడి

మామిడి పండు రసాలైనా,బంగినపల్లి అయినా తీపే కదా!
రాముడి మనసు కూడా అంతే మధురం అని నా భావన.

కోట అంటే రాజ్యం అనే అర్థంలో వాడాను రెండు పద్యాలలోనూ.

కోటను ఆక్రమించడం అంటే రాజ్యాన్ని ఆక్రమించారు అనే కదా అర్థం.

ఈ పదాలకు ప్రముఖ చిత్రకారులు కూచి గారు అందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ.

నా పద్యాలను ప్రశంసించిన నిర్వాహకులు,తక్కిన కవులకు నా ధన్యవాదాలు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.10.2020


కవిమిత్రులకు నమస్సులతో నేటి సమస్యకు నా పూరణ

సుదర్భం...
పారిజాత వృత్తాంతం విని యలిగిన సత్యభామను అనునయించటానికి వచ్చిన శ్రీకృష్ణ స్వామి వారి మనోగతం

నా సరి యౌనె భోజసుత?నారదు డిచ్చిన దివ్య పుష్పమున్
తీసుకుపోయి యిచ్చె తన! దేవికి నాథు డటంచు సత్య లో
గాసిలి కోప మందిర మున గన్పడ స్వామి తలంచె నిట్లహో!
*మాసిన చీర కట్టినను మానిని మిక్కిలి యందగత్తెయే!*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.7.2023


కవిమిత్రులకు నమస్సులతో నా పూరణ 

పాణిని పట్టువారె యిల! వావికి రాజును రాణియౌ సుమా!
ప్రాణము పోసి భావమున, వ్రాసిన కైతలు బిడ్డలౌ గదా! 
వీణియ పాణియందు గల వేత్తల తల్లిని బ్రహ్మగారి యా
*వాణిని రాణికాదనిరి పండిత సత్కవివర్యులెందరో!*

సింహాద్రి జ్యోతిర్మయి 
17.4.2023


[29/04, 8:14 am] Simhadri Jyothirmai: సమస్య(136):-

"వనవాసము శిక్ష కాదు వరమె యనదగున్"

      లేదా

"వనవాసం బది శిక్ష కాదు వరమే పాటించ సంతోషమౌ"

1.పద్యము వ్రాసే ముందు దాని నామము కూడా వ్రాయాలి.
2. మన ఛందస్సు సమూహములో ఎలాంటి చిత్రములను వాడుటకు అనుమతి లేదు, వాడినచో తొలగించబడును.

నా పూరణ 

*కందం*
మనమెడబాటును సైపదు
మనలేదిట నీవులేక మైథిలి స్వామీ!
గొనిపోవుము నీవున్నను
*వనవాసము శిక్ష కాదు వరమె యనదగున్*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.4.2023
[29/04, 10:15 am] Simhadri Jyothirmai: సమస్య(136):-

"వనవాసము శిక్ష కాదు వరమె యనదగున్"

      లేదా

"వనవాసం బది శిక్ష కాదు వరమే పాటించ సంతోషమౌ"

1.పద్యము వ్రాసే ముందు దాని నామము కూడా వ్రాయాలి.
2. మన ఛందస్సు సమూహములో ఎలాంటి చిత్రములను వాడుటకు అనుమతి లేదు, వాడినచో తొలగించబడును.

నా రెండవ పూరణ 
*కందం*

ఘనమౌ పాశుపతాస్త్రము,
హనుమయ్య యొసంగిన వర మక్షయ పాత్రం
బును, వజ్రి మన్నన కతన
*వనవాసము శిక్ష కాదు వరమె యనదగున్*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.4.2023

సమస్య(134):-

"నిలబడి తినుట యది మంచి నియమం బాయెన్"

1.పద్యము వ్రాసే ముందు దాని నామము కూడా వ్రాయాలి.
2.చిత్రములు వాడకూడదు.

నా పూరణ

నిలకడగా బంతిని చతి
కిలబడి  వేడుకను మెచ్చి గృహమున దినుటల్
కలిమికి, హోదాకు వెగటు
*నిలబడి తినుటయది మంచి నియమంబాయెన్*

సింహాద్రి జ్యోతిర్మయి
28.4.2023


కవిమిత్రులందరికీ శుభోదయం.

నా పూరణ కు సందర్భం.
ఈ మధ్య మా స్నేహితురాలు తను పిల్లలకు ట్యూషన్లు చెప్తుంది.ఒక మూడవ తరగతి పిల్లవాడి పేరు ఋషి.వాడు రుషి అని రాశాడు.ఇది తప్పురా ఇలా రాయకూడదు అంటే ఇదే కరెక్ట్.మా టీచరు ఇలాగే రాయమంది అంటాడట.తను నాకు ఫోన్ చేసింది.
మరి ఇదే ఖాయమంటే ఇక బ్రహ్మర్షి, రాజర్షి వంటి వాటిని ఎలా విడదీయాలో!
సంధి సూత్రాలు మార్చాలేమో!😔😔

రాదుర? రాయమన్న *ఋషి* !రాసెద వేలర తప్పుగా యనన్
లేదుగ! టెక్స్టు బుక్కున *ఋ*, లేతురు తిట్టగ నెత్తివేసిరిగా
మాదగు టీచరమ్మ *రుషి* మాకిటె చెప్పెను చూడుడంచు తా
*వాదన చేయరమ్మనెను వాణి సుపుత్రుడు వాక్కులమ్మతో*

సింహాద్రి జ్యోతిర్మయి
18.4.2023


మహతి సమస్యాపూరణం659
తేది:26-04-2023
నేటి సమస్య......

కడలికిగల్గె సంతసము కామిత
మూర్తి స్పృశించినంతటన్......

మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు.....

కవిమిత్రులకు నమస్సులతో నా పూరణ 

అడగియు లోక మెల్ల నపు ; 
డాతని బొజ్జను డాగి యుండగా
పడుకొని యుండె స్వామి పసి ;‌ పాపడి తీరున మఱ్ఱి యాకుపై
వడి తన వ్రేళు లొక్కట చి ;వాలున తాకగ ధన్యమూర్తియౌ
*కడలికి గల్గె సంతసము ; కామితమూర్తి స్పృశించినంతటన్*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
26.4.2023
సాహిత్యం గ్రూపు వారి
దత్తపది :

‘గంగ - గంగ - గంగ - గంగ'�నాలుగు పాదాలలో 'గంగ'ను 
అన్యార్థంలో ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాఛందం


నా పూరణ

సందర్భం...
బంధువధ చెయ్యలేనని విచారపడుతున్న అర్జునునకు శ్రీకృష్ణుని గీతోపదేశం

తేటగీతి..
విల్లు చేపట్టి చెల *గంగ* విముఖుడనని
వ్యధను మును *గంగ* తరుణమే పార్థ! యిపుడు 
కీర్తి వెలు *గంగ* రణభూమి నార్తి వీడి
 పోరు సల్పుము కలు *గంగ* భూరిజయము

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.4.2023


57
మహతి సమస్యాపూరణం651
తేది:19-04-2023
నేటి సమస్య......

వేదన దీర్చు రామునకు వేదనలెక్కువ గావె నిత్యమున్....

మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు.....

కవి మిత్రులందరికీ నమస్సులతో నా పూరణ 

*ఉత్పలమాల*

మోదముతోడ రాజ్యమును మోహము లేకయె తమ్ము కిచ్చుచో 
పాదుక లిచ్చివేసి తన పాదము కందగ సంచరించుచో
కాదనకుండ సీతకును కాంచన లేడి నిడంగ జూచుచో
*వేదన దీర్చు రామునకు వేదనలెక్కువ గావె నిత్యమున్*



తల్లి కోరిక మేరకు రాజ్యమిచ్చి వనవాస క్లేశాన్ని,
తమ్ముని కోరిక మేరకు పాదుకలిచ్చి అడవిలో పాదచారియై తిరిగే క్లేశాన్ని
సీతకోరిక మేరకు పైడిలేడి కోసం వెళ్ళి సీతా వియోగ క్లేశాన్ని 
రాముడు అనుభవించాడని నా భావం.

సింహాద్రి జ్యోతిర్మయి
19.4.2023

మహతి సమస్యాపూరణం655
తేది:22-04-2023
నేటి సమస్య......

మంగళదాయకుండతడు మానిని పాలిటి కామధేనువే.....

మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు.....


కవిమిత్రులకు నమస్సులతో నా పూరణ
56
*ఉత్పలమాల* 
కొంగును పట్టిలాగి సభ కూడని చేతను చేయు చుండ నా
చెంగటనే పతుల్ గనరు, జ్యేష్టులు ధర్మము జెప్పరు కావుమంచు తా
కొంగును జాచి వేడగనె కొల్లగ చీరెలు చెల్లికిచ్చెగా
*మంగళదాయకుండతడు మానిని పాలిటి కామధేనువే!*

సింహాద్రి జ్యోతిర్మయి
22.4.2023

555
3, ఏప్రిల్ 2023, సోమవారం
శంకరాభరణం వారి
*దత్తపది - 193*
4-4-2023 (మంగళవారం)
*"మూడు - ఆరు - ఏడు - పది"*
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
*రామాయణార్థంలో*
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయ వలెను.
నా ప్రయత్నం ఇలా....


అశోకవనంలో సీతమ్మ ను సందర్శించిన హనుమ ఆమెను ఊరడిస్తున్న సందర్భం

*ఆటవెలది* 
*మూడు* నమ్మ చావు మూఢు లంకేశుకు 
శోక *మారు* నీకు శుభము కలుగు
*నేడు* పు సమయమ్ము వాడి వనితకింక
*పది* లమగను రామభద్రు సతికి  

సింహాద్రి జ్యోతిర్మయి
4.4.2023

54
మహతి సమస్యాపూరణం585
తేది:16-02-2023
నేటి సమస్య......

పాశ్చాత్యుండు దయాకరుండు
ధరణిన్ పాలింపరాడేలనో......


మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు
శార్దూలము 
పశ్చాత్తాప మొకింతయేని కలదే!భాషా‌మహా ద్రోహమున్
నిశ్చింతాత్ములనంగ సల్ప తగవే! నిర్మోహులై తెల్గుకున్
దుశ్చారిత్రము దీనిమాన్ప మరలన్ తొల్లింటి బ్రౌన్ వంటి యో
*పాశ్చాత్యుండు దయాకరుండు ధరణిన్ పాలింప రాడేలనో!*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.2.2023
53
మహతి సమస్యాపూరణం590
తేది:21-02-2023
నేటి సమస్య......

తెలుగేమేలటభాషలన్నిటనునేదేశంబునందుండినన్.....

మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు

మిత్రులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో నేటి సమస్యకు నా పూరణ

తెలుగే వద్దట నేటి తెల్గులకయో!తెల్లంబుగా దెల్పుచున్
పలుకాడంగ మనంబునన్ వెఱతురే!ప్రారబ్ధ మేమందు?నా
తెలుగే ముద్దని నేర్వమందు మిము సందేహింపక నేర్వండికపై
*తెలుగే మేలట భాషలన్నిటను యేదేశంబునందుండినన్*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.2.2023


52
[13/5/2018, 11:19 am] Jyothirmai Simhadri: శంకరాభరణం సాహితీమిత్రులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో నా పూరణ

తే.గీ.
అర్చనయు ప్రార్థన నమాజులన్ని సమమె
ఆలయము చర్చియు మసీదు లవి యొకటని
మతము జాతుల భేదము మాపదలచి
*చర్చిలో సంధ్యవార్చెను సాయుబయ్య*
సింహాద్రి జ్యోతిర్మయి
13.5..2018
51
[13/5/2018, 11:52 am] Jyothirmai Simhadri: నా పూరణ

సుమశరమై మురిపించిన
విమలమతి సతి పురిటికని వెడలి మరలి రా
గ,మగనికా సుతు మోమున
*నమవస దినమందు చంద్రుడగపడె నింగిన్.*

సింహాద్రి జ్యోతిర్మయి
13.5.2018
[14/5/2018, 6:32 am] Jyothirmai Simhadri: నేను రాసుకున్న సమస్యలు
50
*జనకుని పెళ్ళాడి మదిని జానకి మురిసెన్.*

కందం

మునిసమ్మతి గొని యా శివ
ధనువు విరిచి తనకతండె తగు వరుడనగా
మనసును గెలిచిన మన్మథ
*జనకుని పెండ్లాడి మదిని జానకి మురిసెన్.*
[14/5/2018, 3:09 pm] Jyothirmai Simhadri: సమస్య
49
కందం
*అవధానము సేయువాడె యజ్ఞాని యగున్*

భువి యబ్బురమవధానము

కవితా చమత్కృతి మెచ్చి కరతాళములన్
రవమొనరింపని సభలన్
*యవధానము సేయువాడె యజ్ఞాని యగున్.*
[17/5/2018, 8:51 am] Jyothirmai Simhadri: [5/17, 8:50 AM] Jangam Jyothirmai: 17, మే 2018, గురువారం

దత్తపది - *139*

*దేవకి - యశోద - సుభద్ర - రాధ*

పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ

రామాయణార్థంలో

మీకు నచ్చిన ఛందస్సులో

పద్యాన్ని వ్రాయండి

48
http://kandishankaraiah.blogspot.in
[5/17, 8:50 AM] Jangam Jyothirmai: కవి మిత్రులకు శుభోదయం

నా పూరణ

అశోక వనంలో హనుమతో సీత రామునకు పంపుతున్న తన సందేశం.

తే.గీ.
దేవ! కినుక బూనితివొ!నీ దేవిపైన
రావు ననుగావ నా యపరాధమేమి?
నీ యశోదర్పముల జూపి నీచుడైన
రావణు వధింపు సతి సుభద్రమ్ము నొంద.

సింహాద్రి జ్యోతిర్మయి
17.5.2018

47
[24/5/2018, 10:06 am] Jyothirmai Simhadri: తే.గీ.
వద్దిపర్తి పద్మాకరు వారియొక్క
అమెరిక యవధాన సభలయందు నేను
పృచ్ఛకునిగ యప్రస్తుతంబిట్లు సేయ
ఎద్ది నాకున్న యర్హత యెరుగనైతి


తే.గీ.
వచ్చె అవకాశ మదె పెద్ద భాగ్యమనుచు
సరస గూర్చొని పలుకాడ సాహసించి
నాకు తోచిన రీతిగా నడిపినాను
మీకు నచ్చుటయే గొప్ప మెప్పు సుమ్ము

ఆ.వె.
పద్య పద్మములవి పద్మాకరమునందు
విరియు వేళలోన వీలుజూసి
పలుకు కిరణకాంతి పరచితి దండాన
తప్పు సరియనుడిదె దాసుడనుచు.
[24/5/2018, 10:11 am] Jyothirmai Simhadri: పలుకు కిరణకాంతి పరచిన దోసమున్
తలపకు గురువర్య దండమిదియె.
[24/5/2018, 10:12 am] Jyothirmai Simhadri: చివరి పద్యంలో చివరిరెండు పాదాల బదులు ఇది యాడ్‌చేసుకో.
[27/5/2018, 6:41 am] Jyothirmai Simhadri: సైలెంట్ లో ఉంది.వినబడలేదు.
రెండవ ‌యవధాని ఇంటి పేరు తప్ప పేరు అర్థం కాలేదు.
అందుకని ఇంటిపేరు‌తోటే ఒక పద్యం‌ రాశాను.

తే.గీ.
సాటియేలేని యవధాన సమరకేళి
సైంధవుల రీతి యడ్డెడు సరసకవుల
పరవశంపు పాలడుగున ముంచి మీరు
నెగ్గి కృష్ణార్జునులగుచు నిలిచినారు.
46
శంకరాభరణం వారి సమస్య( 25.8.2022)
*రవికను విప్పెడి తఱి నిటు రమ్మన దగునా!*

దీనికి నా పూరణ

*కందం*

నవదంపతులమె యింకను?
కువకువలాడగ ,విడువుము, కోవెల కేగన్
సవరింపగవలె పనులిదె
*రవి కనువిప్పెడి తఱి నిటు రమ్మన దగునా!*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.8.2022

45
[13/9/2017, 8:00 pm] Jyothirmai Simhadri: ఈ రోజు శంకరాభరణం వారి సమస్య
చెవి,ముక్కు,కన్ను,నోరు
రామాయణార్థంలో స్వార్థం త్యజించి వాడాలి.

నా ప్రయత్నం

ఆ.వె.

దయయె లేని బోయ తా నోరు షిగ మారి
తుష్టిని పలు కన్ను తులు జగంబు
ఆలపిం చెవి మల యవనిజ చరితమ్ము
రాగ ముక్కు చాటు రామ కథను

ఉక్కు...శౌర్యం

సింహాద్రి జ్యోతిర్మయి
13.9.2017
[13/9/2017, 8:04 pm] Jyothirmai Simhadri: దయయె లేని బోయ తానో రుషిగ మారి
తుష్టిని పలుకన్ నుతులు జగంబు
ఆలపించె విమల యవనిజ చరితమ్ము
రాగముక్కు చాటు రామ కథను.
రాగము+ఉక్కు
రాగము...ప్రేమ
ఉక్కు...శౌర్యం.
44
[16/9/2017, 10:04 am] Jyothirmai Simhadri: అందరికీ నమస్కారం.
ఈ వారం సమస్యకు నా పూరణ.
పది,వంద,వేయి,లక్ష.
భారతార్థం లో
తే.గీ.
తాచె మీ ద్రౌపదిని యా సదస్యులు గన
కీచకుండు నీ వంద యున్కి ,తలచితిని
శాస్తి చేతువు క్షాత్ర లక్షణమున యని
భీమ!నీవే యిటుల కునుక నేమి చేతు?

సింహాద్రి జ్యోతిర్మయి
16.9.2017.
43.
[17/9/2017, 8:59 pm] Jyothirmai Simhadri: భీమ!నీవే యిటు కునుక నేమి చేతు?

.

సమస్య..
జనకుని వరియిచి మదిని జానకి మురిసెన్.
పూరణ..

కం. మునియానతి తలదాలిచి
       ఘనమగు శివధనుసు విరిచి కమనీయుండై
      మనసును గెలిచిన మన్మథ 
      జనకుని వరియించి మదిని జానకి మురిసెన్.
42.
దత్తపది..
పాలు,పెరుగు,తేనె,నేయి,నీరు..ఈ పంచామృతాలతో పసిపాపల వర్ణన

తే.గీ. నవ్వితే నెలవంక చిన్నారి పెదవి
         వెలుగునే యిరు కన్నులా చలువ కాంతి
         పలుకు వినువారి మది మురిపాలు పెరుగు
         చంటి పాపలు కలుషములంటనీరు.

               సింహాద్రి.


[14/3/2019, 11:43 am] Jyothirmai Simhadri: 🌅🌅🌅 *శుభోదయం* 🌅🌅🌅



🔏🔏🔏🔏 *పద్యరచన* 🔏🔏🔏🔏

41.
తేది. 14 - 03 - 201 గురు వారం 


చిత్రం. *547*


ఈ దిగువ చిత్రాన్ని గాంచి అనువైన పద్యాన్ని/ పద్యాలను వ్రాయండి.

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
[14/3/2019, 11:43 am] Jyothirmai Simhadri: కందం.
చిగురు పదమ్ములు చాటెను
సొగసుగ భంగిమను దీర్చి చూడుడు మీ క
న్గవ దిప్పనీము పద తా
ళ గతుల జూపుదుము మా కళా కౌశలతన్.

సింహాద్రి జ్యోతిర్మయి
14.3.2019

40.
[16/3/2019, 9:59 am] Jyothirmai Simhadri: శంకరాభరణం కవిమిత్రులకు నమస్సులు.
నేటి సమస్యకు నా పూరణ

ఆ.వె.
కన్నె నడుగు వేళ కాసులు కోరక
పిల్ల గుణగణంబు ప్రియ వచనము
మెచ్చి మాకు మీదు లచ్చి నిడమని యా
ధనము గోరువాడు ధన్యజీవి.

సింహాద్రి జ్యోతిర్మయి
16.3.2019.

39.
[19/3/2019, 7:39 am] Jyothirmai Simhadri: శంకరాభరణం కవిమిత్రులకు నమస్సులు.
నేటి సమస్యకు నా పూరణ

కందం.
లోకులనగ కూసెడు పలు
*గాకులు మానవులకెపుడు కష్టముల నిడున్*
చేకొని ధైర్యము నూతగ
మూకల నదిలించి నీవు ముందుకు పొమ్మా!

సింహాద్రి జ్యోతిర్మయి
19.3.2019.

38.
పాండుసుతుండు,కృష్ణుడు అని పల్కిరి అంటే యుద్ధ రంగంలో మాట్లాడుకున్నారని విజ్ఞులు చెప్పుకుంటారు అనే భావం తో నా పూరణ

ఉత్పలమాల

ఉండునె బంధులన్ దునుమ నుల్లము నందున శాంతి సౌఖ్యముల్
మెండగు శోక భావమున మేను వణంకెడు నన్న పార్థుతో
చెండక శత్రులన్ విజయ!చెల్లదు దుఃఖము నీకు నీగతిన్
*పాండుసుతుండు కృష్ణుడని వల్కిరి విజ్ఞులు పూర్వమెప్పుడో!*

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.3.2023

37.
[4/3/2019, 8:13 am] Jyothirmai Simhadri: శంకరాభరణం కవిమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలతో నా పూరణ.

భక్తితో భజన చేయాలంటే కామాన్ని జయించాలి.
కాముని జయించిన వాని అనుగ్రహము పొందాలంటే ముందు గా జగదంబ ను ప్రసన్నం చేసుకోవాలి.
రామదాసు చూపాడు కదా మార్గం

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...
అదే సులువైన మార్గం.

కందం

కాముని గెలిచిన వాడౌ 
స్వామి యనుగ్రహము నీవు సంపాదింపన్
కామాక్షిని, పరమశివుని
*రామ భజన సేయుము శివరాత్రి కి భక్తిన్*.

రామ.... స్త్రీ
పరమశివుని రామ... పార్వతి

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.3.2019
[4/3/2019, 9:31 am] Jyothirmai Simhadri: నా రెండవ పూరణ

రామనవమి పందిళ్ళను
రామ భజన చేయుము, శివరాత్రి కి భక్తిన్
కాముని గాల్చిన ద్రాక్షా
రామపు స్వామిని గొలువుము రంజిల మనముల్

సింహాద్రి జ్యోతిర్మయి
4.3.2019

[5/9/2017, 7:20 pm] Jyothirmai Simhadri: శంకరాభరణం అనే ఒక బ్లాగు వారు ఫేస్ బుక్ లో 
గు -రు-పూ - జ 
అనే అక్షరాలు మొదటి అక్షరాలుగా ఉపయోగించి పద్యం రాయమని సమస్య ఇచ్చారు.దీన్ని న్యస్తాక్షరి లేదా దత్తపది అని అంటారు.
పై పద్యం దానికి నా పూరణ.
[5/9/2017, 7:20 pm] Jyothirmai Simhadri: తే.గీ.
గుడిని విడిచిన దేవుడై బడిని వెలసి
రుసుము కోరక యజ్ఞత రూపు మాప
పూని భావి పౌరుల దిద్దు బోధ చేసి
న్మ సాఫల్య మదియని చాటు గురువు

సింహాద్రి జ్యోతిర్మయి
5.9.2017.
36.
శంకరాభరణం కవి మిత్రులకు నమస్సులు

నేటి

*భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!*

అనే.సమస్య కు నా పూరణ

యౌవన శోభల నొప్పెడు
దేవేరిని పాండురాజు తీరని తమితో
మోవిని యానంగ కడచె
*భావజు సుమ బాణమె యమపాశమ్ము గదా!*

కడచె అంటే
మరణించె అని అర్థం.

సింహాద్రి జ్యోతిర్మయి
7.2.2019

35.
శంకరాభరణ వేది సాహితీమిత్రులందరికీ
 క్రిస్మస్ శుభాకాంక్షలతో 
నేటి వ్యస్తాక్షరికి నా పూరణ

యశోద చిన్ని కృష్ణుని మందలించే సందర్భం

ఆటవెలది

*ఏ* ల మాట వినక యీ యల్లరి పనులు
*సు* దతులెల్ల వచ్చి చోద్యమనుచు
*క్రీ* డలనక నిట్లు కృష్ణ!నీవు కడు‌ య
*స్తు* త్యుడవన నాకు శోభయె చెపుమ!

సింహాద్రి‌ జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.12.2018.

34
శంకరాభరణం కవి మిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో నేటి నా పూరణ

సమస్య

*వనమునన్ సంచరింప వైభవము దక్కు*

వర్షమున కొక్కనాడిదె హర్షమొప్ప
వేడ్కను గణతంత్ర దినమ్ము చూడ్కి మురియ
వచ్చి ,శుభ పతాక మెగురు ప్రాంగణమను
*వనమునన్ సంచరింప వైభవము దక్కు*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.1.2019

సమస్యాపూరణము - 457
************************
* సమస్య - Muralidhara Sharma Madugula *
* ధనమే యింధనము నేడు ధర్మము నడుపన్ !*
***************************************************
* పూరణ - Simhadri Jyothirmai *
**********************************
ఘనమగు విలువలఁ జెప్పిన 
వినరని పిల్లలు విసుగుచు విడుచుట తగునే ?
అనయము యత్నింపుము, బో
* ధనమే యింధనము నేడు ధర్మము నడుపన్ !*
***************************************************
33
సమస్యాపూరణము  - 552
*************************
* సమస్య - Katepalli L N Murthy *
* కోటీశ్వరు లింట పొట్ట కూటికి కఱవే !*
***************************************
* పూరణ - Simhadri Jyothirmai *
***************************************
నేటి యురుకుల బ్రతుకులను
కోటి విధపు వ్యాధు లవనిఁ గొత్తవి పుట్టన్
నోటిని కట్టక తప్పక
* కోటీశ్వరు లింట పొట్ట కూటికి కఱవే! *
***************************************
32.
సమస్యాపూరణము - 556
***********************
* సమస్య - Mahatheeshwara Murthy *
* కౌగిలిని పొంద భయపడు కంతుడైన! *
**********************************************
* పూరణ - Simhadri Jyothirmai *
*********************************
పక్క దిగనీయదు, ముసుగు పైకి లాగు ,
వెచ్చదనముకై యెల్లరు వెదుకులాడ ,
మంచుతో వణికించు హేమంతకాంత
* కౌగిలిని పొంద భయపడు కంతు డైన! *
**********************************************
31.
సమస్యాపూరణము - 561
************************
* సమస్య - Dhanikonda Ravi Prasad *
* ఇందిరాగాంధి కొల్లాయి నిచ్చగించె ! *
***************************************************
* పూరణ - Simhadri Jyothirmai *
***************************************************
'మిల్లువస్త్రాలు మనకొద్దు మెచ్చకండి
నూలు వడకుట నేర్వండి మేలు' అనెడు
బాపు బాటను పసినాడె పదము కలిపి
* ఇందిరాగాంధి కొల్లాయి నిచ్చగించె ! *
***************************************************
30.
సమస్యాపూరణము - 562
***********************
* సమస్య - Katepalli L N Murthy *
* ఓనమాలు రాని యొజ్జ ఘనుడు ! *
*******************************************
* పూరణ - Simhadri Jyothirmai *
*******************************************
అక్షరము లెఱుగడు, పక్షినిఁ బరిమార్చి
ఆదికవిగ బోయ అవతరించె,
అనుభవంపు పాఠ మది నేర్పితే చాలు;
* ఓనమాలు రాని యొజ్జ ఘనుడు! *
*******************************************
29.
సమస్యాపూరణము - 580
************************
* సమస్య - Dhanikonda Ravi Prasad *
* తల వీడిన వీడిపోవు తలనొప్పి కదా ! *
*********************************************
* పూరణ - Simhadri Jyothirmai *
*********************************************
పలు ధారావాహికలను 
తిలకించుచు బుల్లితెరల తేలెడు జాడ్యం
బులు మీరె నవియె కులకాం 
* తల వీడిన వీడిపోవు తలనొప్పి కదా! *
*******************************28.**************
సమస్యాపూరణము - 599
************************
* సమస్య -  Mahatheeshwara Murthy *
* మూడు కోతుల భావన నేడు మారె ! *
**********************************************
* పూరణ - Simhadri Jyothirmai *
**********************************************
చెడును చూస్తునే ఉండంటు చెప్పు టీ.వి. ;
చెడును కన మంటు తీసెడు చిత్రములను,
చెడును చెప్పెడు చర్చల చేయుచుం డు,
* మూడు కోతుల భావన నేడు మారె !*
**********************************************

సమస్యాపూరణము  - 601
************************
* సమస్య - శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ *
* కోతి నిష్టపడియె కోమలాంగి ! *
**********************************************
* పూరణ -  Simhadri Jyothirmai *
**********************************************
'సమము బ్రహ్మచారి శతమర్కటములకు'
అనుట వినియు పెళ్ళి యాడఁ దలచి,
యేరికోరి యొకని "నితడె నా వరు" డంచు
* కోతి నిష్టపడియె కోమలాంగి! *
********************************27**************
సమస్యాపూరణము - 631
************************
* సమస్య - కవిశ్రీ సత్తిబాబు *
* వనయాత్రకు నేటి సీత వంకలు జెప్పున్ ! *
***********************************************
* పూరణ - Simhadri Jyothirmai *
**********************************
'వనములు నగరాలాయెను
కనరా దట పచ్చదనము, కనకమృగాదుల్
మనజాలము స్వామీ' యని
* వనయాత్రకు నేటి సీత వంకలు జెప్పున్! *
***********************************************
26.
సమస్యాపూరణము - 637
************************
* సమస్య - Katepalli L N Murthy *
* లక్కపిడత మనుమరాలు లలితాంగి యగున్! *
********************************************
* పూరణ - Simhadri Jyothirmai *
**********************************
చెక్కిలి, ఫాలము లద్దము,
ముక్కన కోటేరు వేసె, ముంగురులు గనన్
నొక్కులు, మరి నోరేమో
* లక్కపిడత, మనుమరాలు లలితాంగి యగున్! *
********************************************



సింహాద్రి జ్యోతిర్మయి
10.9.2017.
25.
24.9.2017.
శంకరాభరణం వారిచ్చిన ఈనాటి సమస్యలు.
1.
*తమ్ముని పెండ్లాడెనొక్క తన్వి ముదంబునన్*

నా ప్రయత్నం.

కం.
అమ్మితి మనంబు నీ సుతు
కమ్మరొ!యన  మురిసి కుంతి కన్య‌ హిడింబిన్
రమ్మన  ,సిగ్గరి ధర్మజు
తమ్ముని పెండ్లాడె   నొక్క తన్వి  ముదంబునన్.
24.
అష్టావధానులు చాలామంది పృచ్ఛకులుగా పాల్గొన్న నిన్నటి సభలో అష్టావధానం గురించి నేమ చెప్పిన పద్యం.

సీసం.
అవధాని పదముల నడ్డుచు  మాటికి
......నిడు నిషిద్ధాక్షరిన్ నెగ్గి నడచు
రసికు లచ్చెరువొంద పొసగని పాదమ్ము
......నివ్వ సమస్యగా నెదురుకొనును
తలయు తోకయులేని పలుకులు నాల్గింటి
.....దత్తపదిగనీయ దాని గూర్చు
వలచి వస్తువునిచ్చి వర్ణింపు మనగానె
......అలవోకగా పద్య మల్లివేయు

తే.గీ.
విరుచు వ్యస్తాక్షరిని కూర్చి పేర్చి చెప్పు
ఆశువులను జెప్పు నావృత్తి నందునొకటి
చేసిన పురాణ పఠనమ్ము చిటికెలోనె
చెప్పి పూర్వా పరమ్ములు మెప్పు పొందు

తే.గీ.
అంతయు నొకట ప్రస్తుత మనగ నొకటి
యుక్తి చూపెనా సభయెల్ల రక్తి కట్టు
జగతి యవధాన మది తెల్గు జాతి సొమ్ము
మోయు సుకవులకెల్ల నే మోకరింతు.

సింహాద్రి జ్యోతిర్మయి
25.9.2017.
23.
[5/17, 8:50 AM] Jangam Jyothirmai: 17, మే 2018, గురువారం

దత్తపది - *139*

*దేవకి - యశోద - సుభద్ర - రాధ*

పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ

రామాయణార్థంలో

మీకు నచ్చిన ఛందస్సులో

పద్యాన్ని వ్రాయండి

http://kandishankaraiah.blogspot.in
[5/17, 8:50 AM] Jangam Jyothirmai: కవి మిత్రులకు శుభోదయం

నా పూరణ

అశోక వనంలో హనుమతో సీత రామునకు పంపుతున్న తన సందేశం.

తే.గీ.
దేవ! కినుక బూనితివొ!నీ దేవిపైన
రావు ననుగావ నా యపరాధమేమి?
నీ యశోదర్పముల జూపి నీచుడైన
రావణు వధింపు సతి సుభద్రమ్ము నొంద.

సింహాద్రి జ్యోతిర్మయి
17.5.2018

22.
సాహితీ మిత్రులందరికీ శుభోదయం.
నా పూరణ
సందర్భం
పారిజాతానికై అలిగిన సత్యభామతో శ్రీకృష్ణుడు
ఉ*
పాదములంటి మ్రొక్కెదను ప్రాణసఖీ!వలదింక వేదనల్
మోదము గూర్ప నీకిడిదె ముద్దుగ వృక్షము పారిజాతమున్
రోదనమాని నీ విభుని రోయక ప్రేమ ననుగ్రహింపుమా!
*నీ దరహాసచంద్రికలు నిత్యమొసంగు జయంబు ధాత్రిలో.*

సింహాద్రి జ్యోతిర్మయి

21.మిత్రులకు నమస్సులతో
నా పూరణ

పారము జూచినాము,యతివర్యులమైతిమి,రోసినాము సం
సారమునంచు బల్కుచును,సంపదలెన్నియొ సంచయించుటల్
నేరముగాదె!భక్తులగు నేరని వారల మోసగించుటల్
గౌరవమొందుమయ్య మమకారము వీడి ధరాతలంబునన్.

సింహాద్రి జ్యోతిర్మయి
19.12.2021

20.
కవి మిత్రకు నమస్సులతో నా పూరణ

ఉత్పలమాల

పాతక కృత్యమంచనక పాండవ కాంతకు నిండు కొల్వునన్
రోత పడంగ నెల్లరును,ద్రోవది రోదన భావి ముప్పు మీ
చేతకు తప్పదింక,విని చేతమునందున తెల్వి నందుమా
మేతగవేయంగ తగునె! మిత్రుల బంధుల సంగరంబుకున్.

సింహాద్రి జ్యోతిర్మయి
28.12.2021

19.
శంకరాభరణం వారి సమస్య

తల్లిని దూఱుచున్ సవతి తల్లికి మ్రొక్కెనొకండు విజ్ఞుడై

కి నా పూరణ

చెల్లెను కాలమింక విను స్నేహితుడా! మన మాతృభాషకున్
పల్లకి పట్టగావలెను ప్రాజ్ఞత యౌనది యాంగ్లభాషకున్
తెల్లము నమ్ముమంచనగ తెల్విని వీడి యనాదరమ్మునన్
తల్లిని దూఱుచున్ సవతి తల్లికి మ్రొక్కెనొకండు విజ్ఞుడై.

సింహాద్రి జ్యోతిర్మయి
30.12.2021

18.
ఈ రోజు చిలకలూరిపేట సమీపంలోని అనంతవరం హైస్కూల్ లో శ్రీయుతులు
నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధానం జరిగింది.
అందులో దత్తపది అనే అంశానికి పృచ్ఛకురాలినైన నేను ఇచ్చిన నాలుగు పదాలివి.

 దత్తపది
ఆవు
లేగ
మేక
పులి
ఈ పదాలను అన్యార్థంలో వాడుతూ స్వేచ్ఛా ఛందంలో భారతార్థంలో పద్యం చెప్పమని అడిగాను.
మనం అడిగేముందు మరి అసలు అది పూరణకు సాధ్యమా కాదా! అవాకులు చవాకులు ఇచ్చేసి నా మిడిమిడి జ్ఞానంతో వారిని ఇరకాటంలో పడేయటం భావ్యం కాదు కదా!అని ముందుగా నా అంశాన్ని నేను పూరణచేయటం నా అలవాటు.
నాకదో తుత్తి.
కనుక నా పూరణ ఇది.
ఉద్యోగ పర్వంలో 
రాయబార ఘట్టంలో శ్రీ కృష్ణ స్వామి పలుకులు

నా పూరణ

కం.

దేవరు *లే గ* రిత వలువ
కావరమున నూడ్చిరి గద! కాల *పు లి* ఖితం
బీవిధి, ఫల *మే క* లదిక,
*ఆవు* రుమని ధార్తరాష్ట్రులందురు సుమ్మా!

భావం:సభలో ద్రౌపదీ దేవి కి చేసిన అవమానానికి ఫలితం కౌరవులు తప్పక అనుభవిస్తారు అని భావం.

ఇది నా స్వంతమే.
3 సాధు జంతువులు
ఒక క్రూర జంతువు.

దేవరులు‌‌...మరుదులు
గరిత... పతివ్రత
ఆవురు... దుఃఖపు ధ్వని అని
నిఘంటువు అర్థాలు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.1.2021.
17.
మహతి కవిమిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలతో నేటి సమస్యకు నా పూరణ

*ఉత్పలమాల*
వింటిని నీదులీలలను వేంకటనాయక మానసంబునన్
కంటిని పద్మనాభ!నిను కామితదాయక కన్నులారగన్
బంటును శ్రీనివాస!యని భావమునందున భక్తిమీర చే
*కొంటిని నాదు దైవమును కోర్కెలు దీరగ నీ దినంబునన్*. 
సింహాద్రి జ్యోతిర్మయి
13.1.2022

16.
మహతి కవిమిత్రులందరికీ నమస్సులు
నేటి నా పూరణ
మాట వినని పిల్లలను టీచర్లకు అప్పజెపుతూ తల్లిదండ్రుల అభ్యర్థన

చంపకమాల
మరచిరి పిల్లలందరును మానిరి పుస్తకముల్ పఠించుటల్
మరగిరి యాటలెల్లరిటు,మాకును వీరిక వల్లగారుగా
గురువులు మీవె బాధ్యతలు కొంచెము వంచుట యంచు పంపగా
*తెరచిరి పాఠశాలలను తీరిక లేదిక పంతులయ్యకున్.*
సింహాద్రి జ్యోతిర్మయి
17.1.2022
15.
మహతి కవిమిత్రులందరికీ నమస్సులతో నేటి నా పూరణ

*ఉత్పలమాల.*

దేవత లాగ్రహించిరన దీనత విశ్వము చిక్కె వ్యాధిలో,
చావులు పెచ్చుమీరినవి, చాలదు వైద్యుల యత్నమొక్కటే,
కావలె జాగరూకతలె కావగ మానవ జాతికిప్డు యీ
*కోవిడు విస్తరించినది క్రొత్తగ రండిక బాగుచేయగన్*

సింహాద్రి జ్యోతిర్మయి
19.1.2022

14.సాహితీ మిత్రులందరికీ అమరవీరుల దినోత్సవ శుభాకాంక్షలతో నా పూరణ

కందం

చూపి యహింసా మార్గము
బాపితివట దాస్యము మన భరతావనికిన్
బాపూ!నీ వర్ధంతికి
నా పుణ్యుల గౌరవింతు మమరు లటంచున్.
*సింహాద్రి జ్యోతిర్మయి*
30.1.2022

13.
శంకరాభరణం వారి సమస్య

*బలిని బొగడె విష్ణు భక్తుడొకడు*

నా పూరణ
ఆటవెలది

కొలిచి మూడడుగులు కోరినయంతనే
చిట్టి వడుగుకిచ్చి పెట్టి పుట్టి
భువనమేలువాని భవనకాపుని జేయు
బలిని బొగడె విష్ణు భక్తుడొకడు

సింహాద్రి జ్యోతిర్మయి
30.1.2022


12.శంకరాభరణం వారి నేటి సమస్య..

*జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్తమీ వాక్యమే*

నా ప్రయత్నం..

*శార్దూలము*

ధీరుల్ యుద్ధము వద్దు, శాంతి నరజాతిన్ గాచునంచందు రా
దారుల్ భారతమందు కృష్ణ విదురుల్ ధర్మాత్ములై చూపినన్
వారల్ దుర్మతు లాంబికేయుని సుతుల్ పాటింపగా నొల్ల రా
*జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్తమీ వాక్యమే*

సింహాద్రి జ్యోతిర్మయి
25.2.2022


🌅🌅🌅 *శుభోదయం* 🌅🌅🌅

🔏🔏🔏🔏 *పద్యరచన* 🔏🔏🔏🔏
11.
తేది. 02 - 03 - 2019 శని వారం 

చిత్రం. *535*

ఈ దిగువ చిత్రాన్ని గాంచి అనువైన పద్యాన్ని/ పద్యాలను వ్రాయండి.

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴

సీసం
దాయాది చేతిలో తాను చిక్కితినన్న
....వెరపు మోమునలేని విధము జూచి
గుట్టుమట్టు లరికి రట్టు కారాదని
...పత్రముల్ మ్రింగిన ప్రజ్ఞ జూచి
గూఢత శత్రువుల్ గుచ్చి ప్రశ్నించినా
...నోరు మెదపని యా తీరు జూచి
దేశభక్తి నెదలన్ దీపింప జేయగా
.... స్ఫూర్తి నీయగ జాలు మూర్తి జూచి

ఆ.వె.
వీరసింగ మొకటి చేరవచ్చెడు ఠీవి
వర్థమానుడా !ప్రవర్థమాన
యశముజూచి మురిసి దిశలు మ్రోగగ జేతు
మందుకొమ్మిదె యభినందనములు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.3.2019

10.నిన్నటి శంకరాభరణం వారి సమస్యకు నా పూరణ

దత్తపది

ఏక్ -దస్ - సౌ -హజార్

భారతార్థంలో వాడుతూ పద్యం

ద్రౌపది తనను సభకీడ్వ సమకట్టిన దుశ్శాసనునితో అంటున్నది

*ఏక* వస్త్రను మూఢుడా! తాకవలదు
*సౌ* ధమును వీడి రాజాల సభకునిపుడు
నగుదురు స *దస్ యు లిది తప్పు, తగవు గాదు
తలప స్పృ *హ జారె* నే!నీదు తల్లి నవనె?

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.12.2018

9.మహతి మిత్రులకు నమస్సులు.
దాదాపుగా నెలరోజుల విరామం తర్వాత ఈరోజే వాట్సాప్ వాడుతున్నాను.
నేటి సమస్యకు నా పూరణ 
సందర్భం..
రాయలవారి అస్తమయవేళ పెద్దనార్యుని ఆవేదన

*ఉత్పలమాల*
మోయగ నాదు పల్లకిని ముచ్చట మీరగ మూగనైతిగా
వేయగ గండపెండెరము వేడుక మీరగ సంతసించితిన్
మాయగ దాపురించ మృతి మౌనమె భాష నివాళి నీయగా
*రాయలవారికిన్, తెలుగు రాదని బల్కెను పెద్దనార్యుడున్*

సింహాద్రి జ్యోతిర్మయి
11.6.2022


8.మహతిసమస్యాపూరణం-344
తేది:12-06-2022
నేటి సమస్య.....

కూర్మము సత్ఫలంబిడును కోరిన‌ వారికనంతభాగ్యమే

మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు......

నా పూరణ..

 ధార్మిక భూమిపైన ఘన దైవము శ్రీహరి కొల్వుజేసి తా
కూర్మిని సేవలందుచును కోర్కెలు దీర్చుచు భక్తకోటులన్
కర్మల దాటజేయు సరి గానని ధామము నమ్మి రండు శ్రీ
*కూర్మము సత్ఫలంబిడును కోరిన వారికనంత భాగ్యమే*.

సింహాద్రి జ్యోతిర్మయి
12.6.2022


7.మహతి సమస్యాపూరణం

నా పూరణ

కౌరవ సభలో పాండవరాయబారి శ్రీ కృష్ణ స్వామి హితవచనాలు

కందం

చెవిబెట్టుము నా *వాణి* ని
భవితవ్యము నూహజేసి వ *క్కాణి* 0తున్
భువి పాండవ *రాణి* పరా
భవాగ్ని దహియించు సుమ్ము *ప్రాణి* కులములన్

కులము అంటే సమూహం అనే అర్థంలో వాడాను.

సింహాద్రి జ్యోతిర్మయి
14.6.2022

మహతిసమస్యాపూరణం-345
తేది:23-06-2022
నేటి సమస్య......

అన్నము పెట్టువాడు నరహంతకుడైనను పూజనీయుడే.....
 

మీ పూరణలుసాయంత్రంలోగా అందించగలరు.......

నిన్నటి సమస్యకు నా పూరణ

తన జన్మ రహస్యం తెలిపి పాండవ పక్షానికి ఆహ్వానించిన కృష్ణునికి కర్ణుని సమాధానం

6.ఉత్పలమాల..

 కన్నది కృష్ణ! కుంతి నను కన్యగ నున్నపుడే దినేశుకున్,
మన్నన పోవునంచు నటు మాతయె గంగను త్రోసివేయగా
మన్ననలిచ్చి బ్రోచెగద! మానధ నుండతనిన్ త్యజింప నే
*నన్నము పెట్టువాడు నరహంతకుడైనను పూజనీయుడే.*

సింహాద్రి జ్యోతిర్మయి
24.6.2022

మహతిసమస్యాపూరణం-349
తేది:27-06-2022
నేటి సమస్య......

జన్మనొసంగెరామునకు జానకి
యెంతటి పుణ్యమూర్తియౌ...

మీ పూరణలుసాయంత్రంలోగా అందించగలరు.......
 *అంగాదంగాత్ సంభవతి*
భర్తయే బిడ్డ రూపంలో భార్య గర్భాన తిరిగి ఉద్భవిస్తాడన్న వేద వాక్యాన్ని స్మరిస్తూ నా పూరణ 
5.*ఉత్పలమాల*
సన్మతి నైనగాని పతి జాలిదలంపక కానకంపె, నా
 జన్మకు వ్రాసె ధాతయని సాధ్వి మనమ్మును చిక్కబట్టి తా
తన్మయభావనన్ మునుపు దాల్చిన గర్భఫలమ్ము నీయగన్
*జన్మనొసంగె రామునకు జానకి యెంతటి పుణ్యమూర్తియౌ*

సింహాద్రి జ్యోతిర్మయి
27.6.2022
మహతి సమస్యాపూరణం592
తేది:23-02-2023
నేటి సమస్య......

కారము సర్వరోగముల కారణమేనని పల్కిరెందరో....

మీ పూరణలు సాయంత్రంలోగా అందించగలరు

మహతి మిత్రులందరికీ శుభోదయం
నేటి సమస్యకు నా పూరణ

సందర్భం..
కురుసభలో జరుగుతున్న దుష్కార్యాన్ని చూస్తున్న సభాసదుల మనోగతం
4.*ఉత్పలమాల* 
నేరము సుమ్ము సాధ్వినిటు నిండు సభాస్థలి కీడ్చినావురా!
ఘోరము చూడలేదెపుడు కూడదు కూడదు మాను మింక నీ
వారము మంచిచెప్ప మది భావన చేయవు ధార్తరాష్ట్ర! ధి
*క్కారము సర్వరోగముల కారణమేనని పల్కిరెందరో!*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.2.2023


ఫేస్బుక్ లో ఈ‌‌ అద్భుతమైన పూరణ చూడగానే నాకు కూడా 
పై దత్తపదులకు  పూరణ చేయాలనిపించగా చేసిన ప్రయత్నమిది.

సందర్భం..
ఒక అద్భుత సంగీతకారుని సభను ఊహచేస్తూ( అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ తన గానంతో వర్షం కురిపించాడని విన్నాం కదా!)

3.తే.గీ.
సభికులం *త మన్న* న జేసి చప్పటించ
గాన మాక *సమంత* యు గప్ప మొయిలు
గీతి *కా జల* ముల సంగీతవేత్త
ధా *త్రి ష* డ్జమ స్వరముల తడిపి తేర్చె.

చప్పటించు...చప్పట్లు కొట్టడం
మొయిలు..మేఘం
తేర్చు...ప్రసన్నత కలిగించటం,ఆనందింపజేయటం

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.2.2023

మిత్రులందరికీ శుభోదయం.నేటి సమస్యకు నా పూరణ

సుదర్భం...
కోవిద్ దుష్ప్రభావాలుగా యువతలో హార్ట్ఎటాక్ లు రావడాన్ని వైద్యులు చెప్పటం,జిమ్ చేస్తూనే యువకులు కుప్పకూలిపోవటం అంశంగా పూరణ

2.ఉత్పలమాల 

కండలు పెంచుచుంటినని ఖాతరు చేయక వైద్యు సూచనల్
దండిగ జెంకు ఫుడ్డు తిన,దారుణరీతిని కొవ్వుచేరుచున్
నిండగు యౌవనమ్ముననె నేడిటు పిల్లలు కుప్పకూలగన్
*గుండెలు బద్దలయ్యె గుణకోవిదవర్యుని గాంచినంతనే*

గుణ కోవిధవర్యుడు అంటే కోవిద్ లక్షణాల పర్యవసానంగా స్వీకరించి పూరించాను.

సింహాద్రి జ్యోతిర్మయి
15.3.2023

1.నా రెండవ పూరణ

చెండుచు కౌరవాధముల శ్రీహరి కూరిమి మేనయల్లుడా
మండెడు సూర్యుడై చెలగ మాన్పగ జాలక వాని శౌర్యమున్
దండుగ ముట్టి జంపుట యధర్ములు క్రూరత, తాత భీష్ముకున్
*గుండెలు బ్రద్దలయ్యె గుణకోవిద వర్యుని గాంచినంతనే*

సింహాద్రి జ్యోతిర్మయి
15.3.2023

[22/01/2024, 10:25 am] Simhadri Jyothirmai: తే.గీ.
నమ్మి రాముని మార్గాన నడవకుండ
ఇన కులాన్వయు సందేశ మెఱగకుండ 
 హృదయ మందున నిలుపక పెదవితోడ
*రామ నామము బల్కిన రక్షలేదు*.

సింహాద్రి జ్యోతిర్మయి
22.1.2024
[23/01/2024, 1:49 am] Simhadri Jyothirmai: *సం*  క్రాంతి ముగ్గులో ముద్దుగా
*ధ్యా*  నంలో ఉన్న గొబ్బెమ్మలా
*దే* ‌ వాలయం లాంటి ఇంటిలో
*వి* ‌ రాజిల్లే మా సంధ్యకు 

పుట్టినరోజు శుభాశీస్సులు.🙌🙌🙌


[23/01/2024, 9:28 am] Simhadri Jyothirmai: 
నిన్న
ఛందస్సు గ్రూపు వారిచ్చిన సమస్య..

*ముండా!కడు ప్రేమ తోడ మ్రొక్కులు నీకై* 

నా పూరణ

*కందం.*
పండెను ప్రజ పుణ్య మిపుడె
నిండె గద! యయోధ్య శోభ  నిఖిల జగమునన్
మెండగు భక్తి నిదే రా
*ముండా! కడు ప్రేమ తోడ మ్రొక్కులు నీకై*.

సింహాద్రి జ్యోతిర్మయి
23.1.2024
.

Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ