గీతా కంద మరందం -1(సంపూర్ణం)
➖➖➖➖➖➖➖➖➖ గీతా (కంద) మరందం ➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖ 1. అర్జున విషాదయోగం ➖➖➖➖➖➖➖➖➖ శ్లోకం 1 ధృతరాష్ట ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ । ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1-1 ।। ప్రతి పదార్థం :- సంజయ =ఓ సంజయా; ధర్మక్షేత్రే= ధర్మభూమియైన; కురుక్షేత్రే= కురుక్షేత్రమునందు; యుయుత్సవః= యుద్ధము చేయు తలంపుగలవారై; సమవేతాః= కూడినట్టి; మామకాః =నా వారలును; పాండవాశ్చైవ (పాండ వాః చ ఏవ) =పాండవులును; కిమ్= ఏమి; అకుర్వత= చేసిరి. తాత్పర్యం :- ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు పలికెను.ఓ సంజయా!నా వారలగు దుర్యోధనాదులును,పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధము చేయ కుతూహలముతో ధర్మభూమియైన ఆ కురుక్షేత్రమున జేరి ఏమి చేసిరి? అనువాద పద్యం :- 1.కందం దురము కొఱకు ధర్మమ్మగు కురుభూమిని కూడినట్టి కుంతితనయులున్ మరి నా ప్రియసుతులు నచట చరియించిన విధము దెలుపు సంజయ! నాకున్....1* దురము.. యుద్ధము