Posts

Showing posts with the label పంచవటి పదాలు

పంచవటి పదాలు

Image
 1.( సా)మాన్యుడవని నువ్వు శిలవై  కోవెలలో కొలువై ఉంటే  నిన్ను మేమంతా  భగవంతుడవని గుర్తించేవాళ్ళం  భక్తితో చేతులు మోడ్చేవాళ్ళం  అనుగ్రహిస్తావని ఆశపడి గుర్తుంచుకుని మరీ మొక్కుబడులు  చెల్లించేవాళ్ళం  శపిస్తావని భయపడి  పవిత్రంగా ఉండటానికి  ప్రయత్నించేవాళ్ళం కానీ నువ్వేమో  మామూలు మనిషిలా మామధ్యన తిరిగేస్తున్నావు అందుకనే నీవు  అందుబాటులో ఉన్న  అనంతమైన నిధివన్న  నిజం  నమ్మశక్యం కాకుండా ఉంది  ఆత్మజ్ఞానమనే నిప్పును  అతి సామాన్యుడవని  నమ్మించే నివురుతో కప్పి నటించే నిన్ను  గుర్తించలేని, గుర్తించినా  మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోయే  మాకోసం  నువ్వు  అవ్యాజమైన అనుగ్రహ వర్షాన్ని  కురిపించే మేఘమై  కరుణిస్తూనే ఉన్నావు  మా అజ్ఞానాన్ని  అతి వినయాన్ని  అవిధేయతను పదే పదే క్షమిస్తూనే ఉన్నావు అందుకు నీ దర్శనమే  మాకు నిదర్శనం.🙏🙏🙏 సింహాద్రి జ్యోతిర్మయి  పంచవటి శిష్యురాలు  2.3.2026 సోమవారం  🦋🦋🦋🦋🦋🦋🦋🦋 2. ఓం శ్రీ *****  గురుభ్యోన్నమః **...