Posts

గీతా కంద మరందం -1(సంపూర్ణం)

Image
➖➖➖➖➖➖➖➖➖ గీతా (కంద) మరందం  ➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖ 1. అర్జున విషాదయోగం ➖➖➖➖➖➖➖➖➖ శ్లోకం 1  ధృతరాష్ట ఉవాచ   ధృతరాష్ట్ర ఉవాచ । ధర్మక్షేత్రే కురుక్షేత్రే  సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ  కిమకుర్వత సంజయ ।। 1-1 ।।   ప్రతి పదార్థం :- సంజయ =ఓ సంజయా; ధర్మక్షేత్రే= ధర్మభూమియైన; కురుక్షేత్రే= కురుక్షేత్రమునందు; యుయుత్సవః= యుద్ధము చేయు తలంపుగలవారై; సమవేతాః= కూడినట్టి; మామకాః =నా వారలును; పాండవాశ్చైవ (పాండ వాః చ ఏవ) =పాండవులును; కిమ్= ఏమి; అకుర్వత= చేసిరి. తాత్పర్యం :-  ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు పలికెను.ఓ సంజయా!నా వారలగు దుర్యోధనాదులును,పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధము చేయ కుతూహలముతో ధర్మభూమియైన ఆ కురుక్షేత్రమున జేరి ఏమి చేసిరి? అనువాద పద్యం :- 1.కందం దురము కొఱకు ధర్మమ్మగు  కురుభూమిని కూడినట్టి కుంతితనయులున్  మరి నా ప్రియసుతులు నచట  చరియించిన విధము దెలుపు సంజయ! నాకున్....1* దురము.. యుద్ధము

గీతా కంద మరందం -2 (సంపూర్ణం)

Image
➖➖➖➖➖➖➖➖ గీతా (కంద) మరందం ➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖ 2.సాంఖ్య యోగం  ➖➖➖➖➖➖➖➖ శ్లోకం 1 సంజయ ఉవాచ:- తం తథా కృపయా 22విష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ విషీదన్త మిదం వాక్యమ్  ఉవాచ మధుసూదనః || సంజయ ఉవాచ:- సంజయుడు చెప్పెను  టీక:- తథా=‌అట్లు;  కృపయా=కనికరముచేత  ఆవిష్టమ్=కూడుకొనియున్న వాడును  అశ్రుపూర్ణాకులేక్షణమ్=కన్నీటితో నిండిన వ్యాకులమైన నేత్రములు గలవాడును  విషీదన్తమ్= దుఃఖించుచున్నవాడును అగు తం =ఆ అర్జునుని గూర్చి  మధుసూదనః=శ్రీకృష్ణమూర్తి  ఇదం వాక్యం=ఈ (చెప్పబోవు) వాక్యమును  ఉవాచ=పలికెను. తాత్పర్యం:- సంజయుడు చెప్పెను. ఆ ప్రకారంగా కనికరముతో కూడుకొని,కంటనీరు పెట్టుకొంటూ,కలవరపాటుతో దుఃఖిస్తున్న ఆ అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికినాడు. నా అనువాద పద్యం:- కం. ఈ రీతిని కలవరమున జారెడు కన్నీటి కనుల జాలిని గొనుచున్  తేరున దుఃఖించు నరుని  తీరుని గని మాధవుండు తెలియగ  బలికెన్. (2-1) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్లోకం - 2 శ్రీ భగవానువాచ:- కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ | అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తికర మర్జున || (2-2) టీక:- అర్జున= ఓ...

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

Image
గీతా (కంద) మరందం భగవద్గీత  (అమర గాయకులు శ్రీ  ఘంటసాల పాడిన భగవద్గీత శ్లోకాలకు) స్వేచ్ఛానువాదం  కంద పద్యాలలో గీతా (కంద) మరందం  రచన.. సింహాద్రి జ్యోతిర్మయి  న ర సం (నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  ఒంగోలు  9866014619 అంకితం మద్గురువర్యులు  శ్రీ రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ (రిటైర్డ్ ఐఆర్ఎస్) గారికి సభక్తికంగా  *గీతా (కంద) మరందం* ఒక మాట అందరికీ నమస్సులు.నా పేరు సింహాద్రి జ్యోతిర్మయి.నేను కవయిత్రిగా ఇప్పటివరకూ ఏవేవో పాటలు,పద్యాలు,కవితలు రాసుకుంటూ పోయాను.రాస్తూనే ఉన్నాను.ఇంతకుముందు భజగోవిందం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం,శ్రీవిష్ణు కందం ఇవన్నీ కందపద్యాలలో రాశాను.ఈ సంవత్సరం భగవద్గీత కందపద్యాలలోకి అనువాదం చేయాలని మనసులో ఒక స్ఫురణ కలిగింది.భగవద్గీత ఇంతకు ముందు చాలా సందర్భాలలో విన్నదే.చదివినదే, అక్కడక్కడా కొన్ని శ్లోకాలు నోటికి వచ్చినవే అయినా మా గురువుగారి నోటివెంట అనేక సందర్భాలలో గీతాశ్లోకాలు ,వాటి అంతరార్థాలు వినడం వల్ల గీతా శ్లోకాలు నేర్చుకోవాలి అని బలంగా అనిపించింది.దానికి ఒక సందర్భం‌కలిసివచ్చింది. నాకు చాలాకాలంగా ...