4/6.*గేయ రామాయణం* యుద్ధ కాండ

గేయ రామాయణం యుద్ధ కాండ (265 చరణాలు) 1. ఇపుడింక మొదలాయె యుద్ధకాండ శ్రీహరికి హరిసేన అండదండ ధరణిసుత కష్టాల చెరలు వీడ ధరణికి తొలగించ దనుజు పీడ. 2. కడలికి వారధిని కట్టించెను తనవైరి తమ్మునికి శరణొసగెను అసురుని అసువులను హరియించెను విమలాత్మ నిజసతిని గ్రహియించెను 3. రాముని చరితమ్ము రమణీయము తన కాంతపై ప్రేమ కమనీయము మహినంత కాచుమతి మహనీయము యుగములకు ఈ గాథ స్మరణీయము 4. బింకాన కడలినే అధిగమించి లంకలో ఒక వంక సీత గాంచి జంకక రాక్షసుల నెదిరినిల్చి గొంకక చెలరేగి నగరు కాల్చి 5. సీతమ్మ క్షేమమ్ము నెరిగి తిరిగి విచ్చేసి శుభవార్త వినిపించిన హనుమయ్య సరిలేని స్వామిభక్తి రామయ్య మనసునే హరియించగా 6. ఆనందముప్పొంగ ఆదరమున ఉపకారమెంచి ఆ రఘురాముడు మారుతిని ప్రియమార చేరబిలిచి మనసార మెచ్చుకొని పలికెనిటుల. 7. పావనీ!అన్యులకు అలవిగాని ఘనకార్య మొనరించినావు నీవు నీవల్ల నిలిచె మా ప్రాణమ్ములు చింతలను వీడె మా చిత్తమ్ములు 8. మాకీవు చేసిన ఈ మేలుకు ప్రతిమేలు నేనేమి చేయగలను? ఒకమారు మనసార కౌగిలించి ప్రేమనే బహుమతిగ నీయగలను 9 అనుచు అలవి మీరిన ప్రేమతోడ హనుమను బిగియార కొగిలించ...