Posts

11/4రోజుకో చరిత్ర(ఏప్రిల్)

Image
April 1st International bird day April 7th World health day April 10th National sibling day April 15 th World ART day April 16 th World voice day Third Saturday of April Husband appreciation day April 22 World Earth 🌎 day April 2nd is officially observed worldwide as  World Autism Awareness Day  to raise awareness, promote inclusion, and recognize the rights of individuals with autism. Designated by the UN, this day highlights the importance of neurodiversity and supports those on the spectrum. It is also recognized as International Fact-Checking Day.   International Sculpture Day (#ISDay) is a worldwide celebration held annually on the  last Saturday of April  to promote the appreciation and creation of sculpture. Established by the  International Sculptu...

1/1శ్రీ విష్ణు కందం( మూలమూర్తి వర్ణన)

Image
అందరికీ‌ నమస్సులు. ఈ రోజు నుండి స్వామి వారి మూల మూర్తి వర్ణన చేస్తాను.సాధారణంగా  వర్ణన  పాదాలనుండి శిరస్సు వరకు చేస్తారు కవులు. కానీ నేను  ఆనంద నిలయం లో స్వామి దర్శనం జరిగే క్రమంలో వర్ణించాను.  ఆ క్రమం ఇది...... నేను రాసిన *శ్రీ విష్ణు కందం* లోని పద్యాలు స్వామి వారి *మూలమూర్తి* వర్ణన * 1.కందం శ్రీలక్ష్మీ వల్లభుడవు ఫాలాక్షుని కోరి వలచి వరియించిన యా శ్రీలలితకు సోదరుడవు నీలపు నీ చెలువు కనుల నిలిపితి నిటులన్. * 2.కందం కలియుగ వేంకట నాథా!       ఇలలో నీ భక్త కోటి ఎంతయు ప్రీతిన్       కలిమికొలది కానుకలిడి       అలంకార ప్రియుడవనుచు ఆరాధింపన్ 3.కందం నిగనిగ నీలపు తనువున        ధగధగ కాంతుల నగలను దాల్చి వెలుగుచున్       జగతికి దర్శన మొసగెడు      నగధర! నే కంటి నిన్ను నఖశిఖ మెల్లన్. సింహాద్రి జ్యోతిర్మయి 23.3.2022 4.కందం .అదియే వజ్ర కిరీట మ్మదే తిరుక్కోల కనుల కగుపించెనుగా  అదిగో నా స్వామి వదన మదిగో‌ గను‌ బావలీలు హరి కర్ణములన్ *బావలీ గొలుసులు అనేవి పురుషులు చెవి కొనలకు ధ...

17/1గేయారాధన (హరిహర స్తుతి)

Image
👾👾👾👾👾👾👾👾👾👾            హరిహరస్తుతి 👾👾👾👾👾👾👾👾👾👾 మిత్రులందరికీ కార్తిక మాసారంభ శుభాకాంక్షలు. హరిహరులిద్దరికీ ప్రీతి పాత్రమైన ఈ పవిత్రమాసంలో నేను రాసిన హరిహరస్తుతి లోనుండి రోజుకొక్క చరణాన్ని మీకందించాలన్న నా సంకల్పాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఈ స్తుతిని జయ జగదీశ హరే అనే హిందీ భజన్ బాణీలో పాడుకోవచ్చు. హరిహర స్తుతి హరి హరి నమో నమో శంభో హర హర నమో నమో వైకుంఠ వాసా పాహీ ! కైలాసవాసా పాహీ ! మీ శుభ చరణం శరణం హరి ఓమ్ హర ఓమ్ నమః ! 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 1 ఆదిశేషుడే పానుపుకాగా శయనించెదవీవు వాసుకి గళమున హారము కాగా విలసిల్లెద వీవు పన్నగశయనా పాహీ! పన్నగభూషణ పాహీ ! మీశుభ చరణం శరణం హరి ఓమ్  హర ఓమ్ నమః : *హరిహర స్తుతి* 2.వ చరణం కురిసే మేఘం మేని ఛాయగా కలిగిన కమలాక్షా! గరళము గళమున ధరించి జగముల గాచిన విరూపాక్షా!     నీలమేఘశ్యామా!పాహీ! నీలకంధరా!పాహీ! మీ శుభ చరణం శరణం హరి ఓమ్ హర ఓమ్ నమః🙏🙏 : *హరిహర స్తుతి* *3వ చరణం* సీతాపహరణం చేసిన దుష్టుని దశకంఠుని కూల్చితివి సతి కవమానం సలిపిన దక్షుని శిరమును ద్రుంచితివి సీతారమణా పాహీ ! సతీశ నీవే పాహ...