11/4రోజుకో చరిత్ర(ఏప్రిల్)
International Day of Human Space Flight, 12 April

In 2011, the General Assembly, recognising the 50th anniversary of the first ever human spaceflight, declared 12 April as the International Day of Human Space Flight. The resolution, A/RES/65/271 of 7 April 2011, called it a day "to celebrate each year at the international level the beginning of the space era for mankind, reaffirming the important contribution of space science and technology in achieving sustainable development goals and increasing the well-being of States and peoples, as well as ensuring the realization of their aspiration to maintain outer space for peaceful purposes."
It was on 12 April 1961 that Yuri Gagarin, a Soviet citizen, carried out the first human space flight, an historic event paving the way for space exploration for the benefit of all humanity
Every year on April 15th, people around the globe celebrate World Art Day, a tribute to the enduring impact of art across various cultures and societies. This date was specifically chosen to honor the birthday of Leonardo da Vinci, who is emblematic of artistic freedom and peace. World Art Day not only celebrates the remarkable contributions of artists but also emphasizes the vital role of art in human communication, cultural identity, and personal freedom.
English Language Day at the United Nations is celebrated on the 23rd of April — the date traditionally observed as both the birthday and date of death of William Shakespeare. As well as being the English language's most famous playwright, Shakespeare had a significant impact on modern-day English. Shakespeare's creativity with language meant he contributed hundreds of new words and phrases: 'gossip'; 'fashionable' and 'lonely' were all first used by Shakespeare. He also invented phrases like 'break the ice', 'faint-hearted' and 'love is blind'.
English is one of the languages of international communication. People from different countries and cultures are increasingly able to communicate with each other in English, even if it is not their first language. This makes it an essential tool for global cooperation and diplomacy.
At the United Nations, English is one of the two working languages, along with French.
*కలిసి నడుద్దాం*.
ఇంగ్లీషు అక్షరాలను వాటి ప్రొనౌన్సియేషన్ తోనే (ఎల్,ఎమ్,జె,కె అలా అన్నమాట)చదవండి
*A* క్కడి దానవు తల్లీ!
*B* డ్డల నోట చిలకపలుకైనావు
*C* ద్ధి లేదట విద్యకు నీవు లేకున్న
*D* ల్లమైపోతి నేను నీవల్ల
*E* లను ఏకఛత్రాధిపత్యము నీది నీ
*F* క్టు నన్ను ముంచెత్తివేసె
*G* హ్వ పైనే నీవు కొలువుదీరావు
*H* ఆయె నీ వాడుక నేడు
*I* శ్వర్య మిచ్చు అమ్మవట
*J* ష్ట నైపోతి నా సుతుల కీనాడు నేను
*K* రలు చుండె నీ విభవము నానాటికి
*L* రు నిన్ను కోరుటచే
*M* ముకల పోగైతి చిక్కి శల్యమై
*N* నడైన దక్కనే నాకు పూర్వ వైభవము
*O* క్క కవులకే నాతోటి అక్కరాయె
*P* న్న పెద్దలంతా నీ భక్తులాయె
*Q* లు గట్టిరి నీవున్న బడికి నేడు
*R* తి తోడ నా బడి అలమటింప
*S* గు నీ కీర్తి కి నేను ఏడ్వబోను కాని
*T* ప్పణముల గతికే చింతించుచుంటి
*U* వతీ యువకులార ! మీరు
*V* లువ నివ్వండి నేను మీ మాతృభాష
*W* W W డాట్ కామ్ ను
*X* పయిర్ కానీయకండి
*Y* దొలగనీయకండి
*Z* తో అంతమ్ము కాను నేను చిరంజీవిని.
నీ జీవనాడిని.
పై అక్షరాలను ఇంగ్లీషు ప్రొనౌన్సేషన్ తోనే చదవండి.
డిల్లము..శక్తి హీనత
కెరలు.. విజృంభించు
ఎసగు..అతిశయించు
టిప్పణములు.. సంస్కృత శబ్దాలు (సంస్కృతం వలే అనంత సాహితీ సంపద ఉన్నా,వాడుకలో నిరాదరణకు గురి ఔతున్నదని నా భావం)
F, Q, X, Z లతో మొదలయ్యే తెలుగు పదాలు దొరక్క వాటికి ఇంగ్లీషు పదాలనే వాడుకున్నాను.
మా ఆచార్యులు డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ్యం గారు చెప్పేవారు.
తెలుగు భాషా విహంగానికి
ఆంగ్లము, సంస్కృత ము రెండు రెక్కలని.కనుక ఏ భాషనూ తక్కువగా చూడటం, నిర్లక్ష్యం చేయటం తగదని నా భావన.
సంస్కృతం దేవుని మెడలో పూలహారం
తెలుగు తులసివనం
ఆంగ్లము గులాబీ తోట.
దేని ప్రత్యేకత దానిదే.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.8.2020.
Books are like a window onto another world – with each new page, they introduce us to new people, new cultures and new ideas. Every year, on 23 April, UNESCO celebrates World Book and Copyright Day to recognize the power of books as a bridge between generations and across cultures.
This date holds immense symbolism in world literature, marking the death of several renowned authors, including William Shakespeare, Miguel de Cervantes and Inca Garcilaso de la Vega.
*అక్షరాక్షౌహిణిలు*
మసకబారుతున్న చూపును
కాంతివంతం చేసి
కనుపింపజేసే
కళ్ళజోడులా
అజ్ఞానతిమిరం ఆవరించుకున్న
మస్తిష్కానికి
జ్ఞానదృష్టిని
ప్రకాశించే
సులోచనాలై
మలచబడ్డ భావాలు
పరచుకున్న అక్షరాలై
పుస్తకాల పుటల్లో దాగి
మనోనేత్రం తెరిపించడానికి
మౌనతపస్సు చేస్తుంటాయి
కిటికీ తీయగానే
లోనికి చొరబారే కాంతిలా
తనను తెరవగానే
విజ్ఞాన కిరణాలు
దూసుకొచ్చి
సూటిగా హృదయాన్ని
తాకిన
నులివెచ్చని భావన
మూఢత్వపు పంజరంలో
ముడుచుకున్న పక్షికి
సత్యమనే ఆకాశంలోకి
రెక్కవిప్పిన స్వేచ్ఛ
నచ్చిన పుస్తకాన్ని
చేతుల్లోకి తీసుకోగానే
పసిపాపని
హృదయానికి
హత్తుకున్న అనుభూతి
చదివి పక్కన పెట్టేసిన పుస్తకంలోని
అక్షర సైనికులు
నిరంతరం నా వెంట నడుస్తూ
నా చుట్టూ ఒక
రక్షణవలయాన్ని
ఏర్పరచిన భరోసా
సముద్రాన్ని ఔపోసన పట్టిన
అగస్త్యునిలా
గంగను త్రాగేసిన జహ్నుమునిలా
అనంత పుస్తక జ్ఞానధారను
అందుకోలేకపోయినా
దాహార్తిని
తీర్చడానికి
గుక్కెడు నీళ్ళలా
గుప్పెడు అక్షరాలను
నా మెదడులో చల్లి
విజ్ఞానపు మొలకలుగా విస్తరించి
రసానంద కుసుమాలై
నా గ్రంథాలయంలో
విరబూసి
కనువిందు చేస్తూ
జ్ఞానామృత ఫలాలను
రుచిచూపిస్తున్న
పుస్తకాలకు
నమోవాకములు.🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.4.2025
బుధవారం
Comments
Post a Comment