Posts

నా కవితలు AI వ్యాఖ్యలు

Image
1. September 1st World letter writing day & December 7th National letter writing day  సందర్భంగా  ఉత్తరానికో ఉత్తరం  అనే నా కవితకు AI వ్యాఖ్యానం https://g.co/gemini/share/6e3232548bd3 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 2. September 2 nd National coconut day సందర్భంగా నా కవిత శ్రీ ఫల(ద)0 గురించి AI వ్యాఖ్యానం  https://g.co/gemini/share/d6f2b89a06f4 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 3. September 3rd  National and international skyscrapers day సందర్భంగా నేను రాసిన కవితకు AI వ్యాఖ్యానం  https://g.co/gemini/share/c62cd74fc2b8  🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 4. 4.9.2026 శ్రావణ బహుళ అష్టమి శుక్రవారం గోకులాష్టమి సందర్భంగా  పోస్ట్ చేసిన నా కవిత గోకులాష్టమి గురించి AI విశ్లేషణ  https://g.co/gemini/share/fc208dbbda55 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 September 5th టీచర్స్ డే సందర్భంగా నేను రాసిన కవితకు AI  వ్యాఖ్యానం  https://g.co/gemini/share/2f52fb68e23c 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 September 6th  Fight procrastination day  గురించి నేను రాసిన కవితకు AI...

పంచవటి పదాలు

Image
 1.( సా)మాన్యుడవని నువ్వు శిలవై  కోవెలలో కొలువై ఉంటే  నిన్ను మేమంతా  భగవంతుడవని గుర్తించేవాళ్ళం  భక్తితో చేతులు మోడ్చేవాళ్ళం  అనుగ్రహిస్తావని ఆశపడి గుర్తుంచుకుని మరీ మొక్కుబడులు  చెల్లించేవాళ్ళం  శపిస్తావని భయపడి  పవిత్రంగా ఉండటానికి  ప్రయత్నించేవాళ్ళం కానీ నువ్వేమో  మామూలు మనిషిలా మామధ్యన తిరిగేస్తున్నావు అందుకనే నీవు  అందుబాటులో ఉన్న  అనంతమైన నిధివన్న  నిజం  నమ్మశక్యం కాకుండా ఉంది  ఆత్మజ్ఞానమనే నిప్పును  అతి సామాన్యుడవని  నమ్మించే నివురుతో కప్పి నటించే నిన్ను  గుర్తించలేని, గుర్తించినా  మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోయే  మాకోసం  నువ్వు  అవ్యాజమైన అనుగ్రహ వర్షాన్ని  కురిపించే మేఘమై  కరుణిస్తూనే ఉన్నావు  మా అజ్ఞానాన్ని  అతి వినయాన్ని  అవిధేయతను పదే పదే క్షమిస్తూనే ఉన్నావు అందుకు నీ దర్శనమే  మాకు నిదర్శనం.🙏🙏🙏 సింహాద్రి జ్యోతిర్మయి  పంచవటి శిష్యురాలు  2.3.2026 సోమవారం  🦋🦋🦋🦋🦋🦋🦋🦋 2. ఓం శ్రీ *****  గురుభ్యోన్నమః **...

గీతా కంద మరందం -1 అర్జున విషాద యోగం (సంపూర్ణం)

Image
➖➖➖➖➖➖➖➖➖ గీతా (కంద) మరందం  ➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖ 1. అర్జున విషాదయోగం ➖➖➖➖➖➖➖➖➖ శ్లోకం 1  ధృతరాష్ట ఉవాచ    ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ  కిమకుర్వత సంజయ || 1-1 || ప్రతి పదార్థం :- ధృతరాష్ట్ర ఉవాచ -ధృతరాష్ట్రుడు చెప్పెను   సంజయ =ఓ సంజయా;  ధర్మక్షేత్రే= ధర్మభూమియైన;  కురుక్షేత్రే= కురుక్షేత్రమునందు;  యుయుత్సవః= యుద్ధము చేయు తలంపుగలవారై;  సమవేతాః= కూడినట్టి;  మామకాః =నా వారలును;  పాండవాశ్చైవ (పాండ వాః చ ఏవ) =పాండవులును;  కిమ్= ఏమి;  అకుర్వత= చేసిరి? తాత్పర్యం :-  ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు పలికెను. ఓ సంజయా!నా వారలగు దుర్యోధనాదులును,పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధము చేయ కుతూహలముతో ధర్మభూమియైన ఆ కురుక్షేత్రమున జేరి ఏమి చేసిరి? అనువాద పద్యం :- 1.కందం దురము కొఱకు ధర్మమ్మగు  కురుభూమిని కూడినట్టి కుంతితనయులున్  మరి నా ప్రియసుతులు నచట  చరియించిన విధము దెలుపు సంజయ! నాకున్.||1-1|| దురము.. యుద్ధము 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 శ్లోకం 2. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్...

గీతా కంద మరందం -2 సాంఖ్యయోగం (సంపూర్ణం)

Image
➖➖➖➖➖➖➖➖ గీతా (కంద) మరందం ➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖ 2.సాంఖ్య యోగం  ➖➖➖➖➖➖➖➖ శ్లోకం 1 సంజయ ఉవాచ:- తం తథా కృపయా 22విష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ విషీదన్త మిదం వాక్యమ్  ఉవాచ మధుసూదనః || సంజయ ఉవాచ:- సంజయుడు చెప్పెను  టీక:- తథా=‌అట్లు;  కృపయా=కనికరముచేత  ఆవిష్టమ్=కూడుకొనియున్న వాడును  అశ్రుపూర్ణాకులేక్షణమ్=కన్నీటితో నిండిన వ్యాకులమైన నేత్రములు గలవాడును  విషీదన్తమ్= దుఃఖించుచున్నవాడును అగు తం =ఆ అర్జునుని గూర్చి  మధుసూదనః=శ్రీకృష్ణమూర్తి  ఇదం వాక్యం=ఈ (చెప్పబోవు) వాక్యమును  ఉవాచ=పలికెను. తాత్పర్యం:- సంజయుడు చెప్పెను. ఆ ప్రకారంగా కనికరముతో కూడుకొని,కంటనీరు పెట్టుకొంటూ,కలవరపాటుతో దుఃఖిస్తున్న ఆ అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికినాడు. నా అనువాద పద్యం:- కం. ఈ రీతిని కలవరమున జారెడు కన్నీటి కనుల జాలిని గొనుచున్  తేరున దుఃఖించు నరుని  తీరుని గని మాధవుండు తెలియగ  బలికెన్. (2-1) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్లోకం - 2 శ్రీ భగవానువాచ:- కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ | అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తికర మర్జున || (2-2) టీక:- అర్జున= ఓ...