నా బ్లాగు గురించి నేను
జ్యోతిర్మయం
http://simhadrijyothirmai.blogspot.com
నా బ్లాగు *జ్యోతిర్మయం*
http://simhadrijyothirmai.blogspot.com
నా గురించి నేను
నా పేరు సింహాద్రి జ్యోతిర్మయి.
మా శ్రీ వారు
జంగం రాజశేఖర రావు గారు. MPDO గా ,ఇన్ ఛార్జ్ CEO గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి (2019 లో) రిటైర్ అయ్యారు.
నేను
కవయిత్రిని.
నా కలం పేరు సింహాద్రి.
నేను నా 16 వ ఏట నుండి అంటే 1983 నుండి అంటే దాదాపుగా 37 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నాను.
సుమారు ఒక 20 పుస్తకాలు దాకా రాశాను గానీ ఇంతవరకూ ఏవీ ముద్రించుకోలేదు.( ఈ మధ్యనే 2022లో గుళ్ళపల్లి సుబ్బారావు సాహితీ సంస్థ వారు నేను వ్రాసిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కందానువాదం అనే పుస్తకాన్ని ప్రచురించారు.) అందుకనే నా రచనలన్నీ కనీసం ఒక చోటైనా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన తో
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺 *జ్యోతిర్మయం* 🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
అనే ఈ బ్లాగ్ ను తయారుచేసి ఇందులో నా రచనలన్నీ పెట్టాలని నిర్ణయించుకున్నాను.
నేను రాసిన వన్నీ
ఏకదంతుని పూజకు ఉపకరించే
ఏకవింశతి పత్రాల వలే 21
సబ్ టైటిల్స్ గా విభజించి పొందుపరుస్తున్నాను.
నా ఈ అక్షరాకృతులు
రాజశేఖర ధరుని చలువ కాంతులు
శ్రీ విష్ణు దేవుని అనుగ్రహ ఫలాలు
అనుభవాల సారాలు
అనుభూతుల హారాలు
హృదయానువాదాలు
ఎద కోకిల గానాలు
మధురోహల సవ్వడులు
మది ఊసుల సందడులు
గేయాలై రవళించిన గాయాలు
ఆంతర్యం చెప్పలేని వేదనలు
వెల్లివిరిసిన సంతోషాల వేడుకలు
స్పందనలు సరదాలు
వెరసి
నా సాహితీ నక్షత్రమాలికలు
జ్యోతిర్మయాలు
సింహాద్రి జ్యోతిర్మయి
22.07.2020
నా చిరు పరిచయం
నా బ్లాగు *జ్యోతిర్మయం*
http://simhadrijyothirmai.blogspot.com
నా బ్లాగు *జ్యోతిర్మయం*
http://simhadrijyothirmai.blogspot.com
పేరు... సింహాద్రి (జంగం) జ్యోతిర్మయి
కలం పేరు..... సింహాద్రి.
విద్యార్హత... ఎమ్ ఎ.తెలుగు
వృత్తి..... లెక్చెరర్ గా 16.సం..
టేచర్ గా 15 సం. పనిచేశాను.
2022 మే లో ఉద్యోగం విరమించాను.
ప్రవృత్తి.... కవితా వ్యాసంగం
అనేక కవిసమ్మేళనాల్లో పాల్గొని అనేక పురస్కారాలు అందుకున్నాను.
పద్య కవితా పురస్కారం, ఉగాది పురస్కారం ,విశిష్ట పురస్కారం,
కళామిత్రమండలి వారి గిడుగు ప్రతిభా పురస్కారం,
సాహితీ కిరణం వారి
ప్రతిభామూర్తి పురస్కారం
మహతివారి కందుకూరి రుద్రకవి పురస్కారం
వంటివి అందుకున్నాను.
కొన్ని కవితల పోటీల్లో బహుమతులు గెల్చుకున్నాను.
పద్యం, గేయం, వచన కవిత,పేరడీలు రాస్తుంటాను.
నా అభిమాన ఛందస్సు... కందం.
నాకు నచ్చిన ప్రతి అంశాన్ని వీలైనంత వరకు కందంలో చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను.
నా రచనలు..
1.శ్రీ విష్ణు కందం
2.భజ గోవిందం... కందానువాదం
(స్వేచ్ఛానువాదం)
3.రాజశేఖర శతకం
(స్త్రీల జీవితం ఇతివృత్తం)
4.గేయ రామాయణం
( నా మేనకోడళ్ళతో కలిసి ఈ రామాయణ గానం భద్రాచల ఆలయ ప్రాంగణంలో చేస్తుండగా ఆలయ ఆస్థాన పండితులు శ్రీమన్నారాయణాచార్యుల వారు విని అభినవ లవకుశులు అనీ,వనితా వాల్మీకి అని ప్రశంసా పత్రం రాసిఇచ్చారు 2012 లో)
5.పాటల్లో పాఠాలు
(పిల్లల కోసం సంప్రదాయ విషయాలు పాటల రూపంలో)
6.నా(రీ)అనుభూతులు
7.తొలి తొలి ఊహలు
8.కళ్యాణం-వైభోగం(పెళ్ళి పాటలు)
(సంప్రదాయ వివాహం లోని 16 ముఖ్య మైన ఘట్టాలు పాటల రూపంలో)
ఇవి యూట్యూబ్ గాయని శ్రీమతి అక్షయవల్లి గారు పాడారు.ఆ లింక్
సంప్రదాయ వివాహం లోని 16 ముఖ్య మైన ఘట్టాలు పాటల రూపంలో
Akshay Valli Mangala Harati songs YouTube channel 😇
కళ్యాణం - వైభోగం పెళ్లి పాటలు // Kalyanam Vaibhogam Pelli Patalu: https://www.youtube.com/playlist?list=PLptdqxvq4FXJ3CrmZss3C9y-rPt3gEWLJ
please do subscribe and share 😇🙏
వీటిని ఒక రూపకంగా అమెరికాలో సిలికానాంధ్రా మనబడి పిల్లలు ప్రదర్శించారు.
9.నేను చూసిన ఉగాదులు(నేను పాల్గొన్న ఉగాది కవి సమ్మేళనాలలో నేను చదివిన కవితలు.
10. అనుభవాల సా (గ)రం
(నా అనుభవం లోకి వచ్చిన, నన్ను కదిలించిన అనేక సంఘటనలపై కవితలు,పద్యాలు.)
11.రోజుకో చరిత్ర
(ప్రతిరోజూ పండగే)
(అంతర్జాతీయ దినోత్సవాలపై
కవితలు)
12.గుండె గొంతుకలో
(పాటలు,పేరడీలు)
13.పద్య స్పందన
14. ఊహలు-ఊసులు
15.సుశ్లోక హృదయం
16.సమస్యల వలయం
(సమస్యాపూరణలు)
17.గేయారాధన
(భక్తి గీతాలు)(ఇందులో కూడా కొన్ని అక్షయవల్లి గారి మంగళహారతులు లో పాడారు.తిరుప్పావై,హరిహరస్తుతి , తిరుమల యాత్ర మొదలైనవి)
తిరుప్పావై
https://youtube.com/playlist?list=PLptdqxvq4FXK9amoJ6zwqMTxdAT-dkEqq
హరిహరస్తుతి
https://youtu.be/ROTsiDwW5ew
తిరుమల యాత్ర
https://youtu.be/DhObwoEN5ek
18.అంబాళం ఆంతర్యం
19. సీసోత్తరం
20. సుప్రభాత కాంతులు
21.జాతిరత్న దీప్తులు
(ప్రముఖుల జయంతులు,వర్ధంతుల సందర్భంగా రాసిన కవితలు,పద్యాలు)
ఇవికాక
నా విద్యార్థులతో చేయించిన అష్టావధానం రూపకం.
దీనిని కూడా అమెరికాలో మనబడి పిల్లలు ప్రదర్శించారు.
ఇంకా మరికొన్ని.,...
వీటిలో ఏవీ పుస్తక రూపంలో రాలేదు.( ఈ మధ్యనే 2022లో గుళ్ళపల్లి సుబ్బారావు సాహితీ సంస్థ వారు నేను వ్రాసిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కందానువాదం అనే పుస్తకాన్ని ప్రచురించారు.) కొన్ని మాత్రం పత్రికలకు పంపాను.అవి అచ్చయ్యాయి.
సాహితీ ప్రస్థానం, సాహిత్య కౌముది ఆంధ్ర జ్యోతి వంటి వాటిలో.
ఇది నా పరిచయం.
ధన్యవాదాలు.
సింహాద్రి (జంగం) జ్యోతిర్మయి
చరవాణి...9866014619.
గేయ రామాయణం లోని రెండు కాండలు పాడించి రికార్డు చేయించాను.
నా చిరునామా
సింహాద్రి జ్యోతిర్మయి
రిటైర్డ్ టీచర్
మంగమూరు రోడ్డు
ఒంగోలు
ప్రకాశం జిల్లా
******************
వందే గురు పరంపరామ్
సంచిక వెబ్ మ్యాగజైన్ లో నా గురించి వచ్చిన ఆర్టికల్
https://sanchika.com/vande-guru-paramparaam-feature-chsl-6/
Comments
Post a Comment