2.భజగోవిందం
కందానువాదం
స్వేచ్ఛానువాదం
అందరికీ నమస్కారం
శ్రీ ఆది శంకరాచార్యులవారి *భజ గోవిందం*గా ప్రసిద్ధిగాంచిన *మోహ ముద్గరం* కంద పద్యాలలోకి అనువదించాను. నా ఊహ కొలదిగా చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తాను..
ఈ అనువాదంలో కొన్నిచోట్ల ఒక శ్లోకానికి రెండు,మూడు పద్యాలు,రెండు ,మూడు శ్లోకాలకు కలిపి ఒకేపద్యం రాయటం జరిగింది.అవధరించండి.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
1.కం.
శ్రీ కంఠుని ప్రియ తనయా!
వైకుంఠుని కందమల్లి వర్ణించుటకై
చేకొంటిని నిశ్చయమును
రాకుండగ విఘ్నములను రక్షింపుమయా! 1*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
2.కం.
శ్రీకరమౌ హరినామము
చేకూర్చును శుభములెల్ల చింతామణియై
యీ కలి దోషము లణచును
లోకేశుని కొలువుమెపుడు లోలత బాయన్.2*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
3.కం.
కందము వ్రాయకపోయిన
నందురు కాజాలరు కవులనుచును జగతిన్
చెందగ శారద మనమున
విందుగ కందము వినుతును విష్ణు భజింతున్.3*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
4.కం.
భజ గోవిందమ్మన్నను
ప్రజ , నిజమిది మోహ ముద్గరమ్ము తెలియుమా!
సృజియించిరి శంకరులిది
అజరామర కీర్తి యమరి యవని వెలుగగన్.4*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
5.కం
శంకర భగవత్పాదుల
కింకను వేరెవరు సాటి యీ లోకములో
శంకరు అవతార మతడు
శంకించగనేల?యిదియె సత్యము సుమ్మా !5*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
6.కం.
గీతను చెప్పినదొకరిల
ఊతగ నద్వైతవిద్య కూపిరి యొకరున్
జోతలు జగద్గురులకిదె
ప్రీతిగ నధ్యాత్మ భిక్ష పెట్టిన కతనన్.6*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
7.కం.
చల్లని స్వామీ! నీకిదె
అల్లిన నా పద్య కవిత అంకితమిత్తున్
మొల్లవు కావని యనకిక
ఉల్లములో మెచ్చి గొనవె ఓ గోవిందా!7*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*8.కం*.
కందము నామది మెచ్చెడి
ఛందము గావున మరిమరి సంతస మొప్పన్
బృందావనమాలి! వినుతు
నందలి మాధుర్య మెంచి ,యందుకొనుమయా!8*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.2.2022
!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
అందరికీ నమస్కారం.
భజ గోవింద శ్లోకాలకు యధానువాదం చేసేటంతటి జ్ఞానవైరాగ్య భావాలు,అంతటి ఆధ్యాత్మ పరిజ్ఞానం నాకు లేవు.అయినా ఆ శ్రీనివాసుని దయతో,ఆ స్వామికే అంకితంగా ఈ అనువాదం చేశాను.ఇది కేవలం స్వేచ్ఛానువాదమే.తప్పులున్నచో పండితులు నన్ను మన్నించి,నాప్రయత్నాన్ని ఆశీర్వదింతురుగాక.
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో
*శ్లోకం..1*
భజ గోవిందం భజ గోవిందం
గోవిందమ్ భజ మూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్ కరణే.
*1.తాత్పర్యం:* గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
*ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.*
*1.కం*.
భజియింపుము గోవిందుని
భజియింపుము హరిని సతము భావము లోనన్
భజియింపుము మూఢమతీ!
భజియింపుము కమలనయను
భజియింపుమయా! 9*
*2.కం*.
మరణము తరుముకువచ్చెడి
తరుణములో కావబోవు తర్కపు చదువుల్
శరణము ముర రిపు చరణము
హరియించును మోహమెల్ల హరి నామమ్మే. 10*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2.శ్లోకం.
మూఢ!జహీహి ,ధనాగమ తృష్ణామ్
కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్
యల్లభసే నిజ కర్మోపాత్తమ్
విత్తమ్ తేన వినోదయ చిత్తమ్.
*తాత్పర్యం*: ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.
*3.కం*.
వీడకు గోవిందు భజన
వీడుము మూఢా! ధనాశ విజ్ఞత కలుగన్
వాడుము కష్టార్జితమును
వేడుక మీరంగ హరిని వేడుము ముక్తిన్. 11**
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
3.శ్లో.
నారీ స్తనభర. నాభీదేశమ్
దృష్ట్వామాగా మోహావేశమ్
ఏతన్మాంస వసాదివికారమ్
మనసి విచింతయ వారమ్ వారమ్.
తాత్పర్యం: స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.
3A.కం.
ఇంతుల సొగసుల మరి మరి
చింతన చేయుచు మునుగకు శృంగారమునం
దెంతకు తీరని మోహం
బంతయు తొలగింపజేయు నచ్యుతుడొకడే.12*
3B.కం.
పదవులు పెంచును మదమును
పెదవులు మోహాన ముంచు ప్రేయసి సొగసుల్.
చెదరని సంపదలని హరి
పదములు చేపట్టి సతము
భజన సేయరే! 13*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*4.శ్లోకం*
నళినీ దళగత జల మతితరళమ్
తద్వజ్జీవిత మతిశయ చపలమ్
విద్ది వ్యాధ్యభిమానాగ్రస్తమ్
లోకమ్ శోకహతమ్ చ సమస్తమ్.
*తాత్పర్యం:* తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.
*4.Aకం.*
జీవితమెంతో చపలము
చావులు రోగాల భయము సతతము వేచున్
పావులు మాయను మనుషులు
గోవిందుని చరణమంటి కొలిచిన వీడున్.14**
*4.B.కం.*
పోవదు శోకము కలచును
చావదు అభిమాన మహము శాస్త్ర మెరిగినన్
నావగ భక్తిని చేకొని
కావగ రమ్మని మొరలిడు కరి వరదునికిన్.15*
*4.C.కం.*
తామర పాకున జలమటు
లీ మానవ జీవితమ్ము
లిల క్షణికమురా !
ఈ మాటను గుర్తెరుగుచు
యా మాధవునమ్ము ,తొలగు నజ్ఞానమురా!16*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
5.శ్లో.
యావత్ విత్తోపార్జన శక్తః
తావన్నిజ పరివారోరక్తః
పశ్చాత్ జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే.
తాత్పర్యం: ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు
6.శ్లో.
యావత్ పవనో నివసతి దేహే
తావత్ పృచ్ఛతి కుశలమ్ గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.
తాత్పర్యం: శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.
5.కం.
కాలము నిలువదు నిముషము
కాలము మింగును వయసును కామము నణచున్
చాలును వ్యామోహములిక
వాలుము శ్రీ హరి పదముల వరదుండేలున్.17**
5.కం.
సతియును,సుతులును,హితులును
సతతము కుశలము లడుగుచు సమ్మానింపన్
మతి నతిశయపడి స్థిరమని
బ్రతుకును నమ్మిన చెడుదువు భ్రష్టుడవగుచున్.18*
5.కం.
గుండెను వదిలిన ప్రాణము
మండెడు కట్టెల నడుమన మసి చేయుదురే
దండగ వ్యామోహములవి
అండగ నుండగ కొలువుము హరి పాదములన్ 19*
6.కం.
ఊపిరి ఉన్నంతవరకు
చూపగ ప్రేమలు నిజమని చుట్టాలెల్లన్
రేపటి దుర్గతి తలపవు
శ్రీ పతి కడపటి గతియని చింతింపవుగా!20*
*13.కం*.
కొల్లగ సంపాదించిన
పిల్లలు ,ప్రియ సతియు నెంతొ ప్రీతిని చూపున్
చల్లగ జారిన ప్రాణం
బిల్లాలును కట్టె తోడు నిష్టపడదయా!21*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
7.శ్లో.
బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
పరమేబ్రహ్మణి కో,..పి న సక్తః.
తాత్పర్యం: బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు
7.కం.
గడచును ఆటల బాల్యము
గడచును యౌవన మెఱుగక కామాతురతన్
గడచును ముదిమియు చింతల
గడిపేదెన్నడు హరిపదకమలాసక్తిన్.22*
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*7.శ్లోకం*
బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
పరమేబ్రహ్మణి కో2పి న సక్తః.
*తాత్పర్యం:* బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు
*14.కందం*.
గడచును ఆటల బాల్యము
గడచును యౌవన మెఱుగక కామాతురతన్
గడచును ముదిమియు చింతల
గడిపేదెన్న డు హరి పద కమలాసక్తిన్.
సింహాద్రి జ్యోతిర్మయి
26.2.2022
👾👾👾👾👾👾👾👾👾👾
8.శ్లో.
కాతే కాంతా కస్తే పుత్రః
సంసారోయమతీవ విచిత్రః
కస్యత్వం వా కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః ¡!
తాత్పర్యం: ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.
8.కం.
ఎక్కడి భార్యా బిడ్డల
దెక్కడి జన్మము తలపగ నెంతటి చిత్రం
బెక్కడి వాడవుతమ్ముడ!
ఒక్కెడ తలపోయు మయ్య!ఓరిమి తోడన్.23*
👾👾👾👾👾👾👾👾👾👾
9.శ్లో.
సత్సంగత్వే నిస్సంగత్బమ్
నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్వమ్
నిశ్చలతత్వే జీవన్ముక్తిః.
తాత్పర్యం: జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.
9.కం.
కలిగిన సజ్జన సంగతి
చెలగెడు మోహము తొలగును, చెల్లును కోర్కెల్
అలవడు నిశ్చలతత్వము
కలుగును జీవద్విముక్తి గాచును హరియే.24*
9.కం.
కలిగిన సత్సంగత్వము
కలుగును నిస్సంగతి ,మది కామము లణగున్.
కలిగిన నిర్మోహత్వము
అలవడుగా నిశ్చలత్వమదె ముక్తి నిడున్.25*
👾👾👾👾👾👾👾👾👾👾
10.శ్లో.
వయసి గతే కః కామ వికారః
శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్వే కః సంసారః .
తాత్పర్యం: వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?
10.కం.
పండిన వయసున కామము,
ఎండిన చెఱువున జలము లవెక్కడ?గృహముల్
ఉండవు లేకున్న సిరులు
దండగ సంసారములిక తత్వమెఱిగినన్26*
👾👾👾👾👾👾👾👾👾👾
11.శ్లో.
మా కురు ధన జన యౌవన గర్వమ్
హరతి నిమేషాత్ కాలః సర్వమ్
మాయామయమిద మఖిలం బుద్ధ్వా
బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా.
తాత్పర్యం: ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.
11.కం.
ధన జన యౌవన గర్వము
మనసున, కాలము హరించు మరు నిముషమునన్
కనుగొని గ్రహించు మాయను
వినుమిక చేరుము త్వరపడి విష్ణు పదమ్మున్.27*
👾👾👾👾👾👾👾👾👾👾
12.శ్లో.
దినయామిన్యౌ సాయంప్రాతః
శిశిర వసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః.
తాత్పర్యం: రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.
12.కం.
గిఱ గిఱ తిరుగుచు ఋతువులు
జఱ జఱ రాత్రింబగళ్ళు జరిగెడు క్రీడన్
తఱుగెడు నాయువు క్రమముగ
నెఱుగక నిత్యము హరి యని ఎందుకు చెడగాన్. 28*
👾👾👾👾👾👾👾👾👾👾
13.శ్లో.
కాతే కాంతా ధనగతి చింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా
త్రిజగతి సజ్జన సంగతి రేకా
భవతి భవార్ణవ తరణే నౌకా
తాత్పర్యం: ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.
13.కం.
సుంతయు సత్సంగమనక
కాంతా ధనముల తలచుచు కాలము గడుపన్
చింతయె మిగులును, శ్రీ హరి
చెంతకు చేర్చెడి పడవర చింతనమెపుడున్.29*
👾👾👾👾👾👾👾👾👾👾
14.శ్లో.
జటిలో ముండీ లుంచితకేశః
కాషాయాంబర బహుకృత వేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో
హ్యుదర నిమిత్తమ్ బహుకృత వేషః.
తాత్పర్యం: జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.
14.A.కం.
కట్టుచు కాషాయమ్ములు
జుట్టును గొరిగించియు నిల జూడగ కూళల్
పొట్టలు నింపుకొనగ పలు
చెట్టలు సన్యాసిననుచు చేయుట వినమే.30*
14.B.కం.
సన్యాసమ్మున బ్రతుకుకు
ధన్యత గలుగును జగతియు,దైవము మెచ్చున్
విన్యాసమ్ములె మహిమగ
అన్యాయమ్ముల చెలగుట యతులకు తగునే.31*
14.C కం
చూడక యతి జ్ఞానావధి
చూడగనేలా! ఇహమును సుఖమన మేలా!
వీడిన మదిలో మూఢత
చూడతరము పరము, యోగ సుఖమన యదియే!32*
👾👾👾👾👾👾👾👾👾👾
15.శ్లో.
అంగం గళితమ్,ఫలితం ముండమ్
దశన విహీనం ,జాతమ్ తుండమ్
వృద్ధోయాతి గృహీత్వా దండమ్
తదపి న ముంచత్యాశా పిండమ్.
తాత్పర్యం: శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు.
15.కం.
తలపండగ,తనువు వడల
పలు వరుసయు పట్టుదప్పి, పాదము వణకన్
తలపోయడు పరము నెపుడు
కల కోర్కెలు విడువ బోడు కట్టెను నమ్మున్.33*
👾👾👾👾👾👾👾👾👾👾
16) అగ్రే వహ్నిః పృష్ఠే భానుః
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ||
తాత్పర్యం: తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు.
16.A.కం.
విడుచును భోగములన్నియు
ముడుచుకు మోకాళ్ళసందు మోమును దాచున్
కుడుచును దోసిట భిక్షను
విడువండయినను విరాగి వెనుకొను మనసున్.34*
(వెనుకొను ఆశల్).
16.B.కం.
ఎండకు వీపును జూపుచు
కండను చలిమంట చేత కాచుచు గడపన్
పండిన తరువుల నీడన
ఎండక నీ యాశ తరమె !ఈశుని గాంచన్.35*
సింహాద్రి
17.12.2016.
👾👾👾👾👾👾👾👾👾👾
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*17.శ్లోకం*.
కురుతే గంగా సాగర గమనమ్
వ్రతపరిపాలన మథవా దానమ్
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన.
*తాత్పర్యం*: గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.
*28.కందం*
ఎందుకు వ్రతములు, దానా
లెందుకు, తీర్థములమునుక లెఱుగని నాడున్
పొందిన శతజన్మమ్ములు
పొందక జ్ఞానమ్ము ,ముక్తి పొందగ లేవే!36*
*29.కందం*
శక్తి కొలది దానములిడి
భక్తిని గంగను మునిగిన భావము లేమిన్
రక్తిని విడువని కతమున
ముక్తిని సాధించ లేవు మూఢత చేతన్.37*
సింహాద్రి జ్యోతిర్మయి
👾👾👾👾👾👾👾👾👾👾
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*18.శ్లోకం*.
సుర మందిర తరుమూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః
సర్వ పరిగ్రహ భోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః.
*తాత్పర్యం:* దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు?
*30.కందం*
విడువుము భోగము మోహము
గడుపుము గుడి ప్రాంగణము ల గండశిలలపై
కుడువుము దొరికిన ఫలముల
నిడునిక కడు సుఖము యోగ మింత యెఱిగినన్.38*
*31.కందం*
ఆలయమందలి తరువుల
మూలము లందున వసించి ,మొల జింకల మై
తోలును ధరించి, భోగపు
లోలత వీడిన తరమిక లోకేశు గనన్.39*
👾👾👾👾👾👾👾👾👾👾
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*19.శ్లోకం*
యోగరతోవా భోగరతోవా
సంగరతోవా సంగవిహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తమ్
నందతి నందతి నందత్యేవా.
*తాత్పర్యం*: యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు
*32.కందం*
యోగము నెఱిగిన వాడును
భోగమనుభవించుచుండు భోగియునైనన్
రాగము గలవాడైన, వి
రాగియునైనను మమత్వ రహితుడె యతియౌ.40*
*33.కందం*
పొందుచు నున్నను భోగము
చెందక తాదాత్మ్యమందు చిత్తములోనన్
విందుగ బ్రహ్మము నెఱుగుచు
నందే నిత్యము రమించునతడే యతియౌ.41*
*34.కందం*.
సమమని యోగము భోగము
కమల దళమ్మున జలమటు కలవని వాడే
తమమంటని నిష్కాముం
డమలిన యానందమంది యలరుచునుండున్.42*
సింహాద్రి జ్యోతిర్మయి
10.3.2022
👾👾👾👾👾👾👾👾👾👾
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*20.శ్లోకం*
భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవ కణికా పీతా
సకృదపియేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా.
*తాత్పర్యం*: భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు
*35.కందం*
కొంచెము గీతను చదివిన
కొంచెము గంగా జలముల గొంతు తడిపినన్
కొంచెము శౌరిని తలచిన
నెంచడు నరకాధినాథు డెప్పుడు నిన్నున్.43*
సింహాద్రి జ్యోతిర్మయి
11.3.2022
20.శ్లో.
భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవ కణికా పీతా
సకృదపియేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా.
తాత్పర్యం: భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు
20.కం.
కొంచెము గీతను చదివిన
కొంచెము గంగా జలముల గొంతు తడిపినన్
కొంచెము శౌరిని తలచిన
నెంచడు నరకాధినాథు డెప్పుడు నిన్నున్.44*
👾👾👾👾👾👾👾👾👾👾
21.శ్లో.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే.
తాత్పర్యం: మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.
21.కం.
జనన మరణముల చక్రము
జననీ గర్భాలయమున చర్విత శయనమ్
ఘన సంసారపు బంధము
మనసును వీడదు మురారి మాన్పగ రావా!45*
👾👾👾👾👾👾👾👾👾👾
22.శ్లో.
రథ్యాచర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జితపంథః
యోగీ యోగ నియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవ దేవా!
తాత్పర్యం: వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును
22.కం.
దొరికిన వస్త్రములు తొడిగి
అరుగుచు పుణ్యములు పాపమంటని దారిన్
మరలించగ మది పరముకు
తరియించగలడు విరాగి తథ్యము సుమ్మా!46*
22. A.కం
చూచుచు బ్రహ్మ ము తనలో
యోచనచేయుచు రమించు యోగులు జగతిన్
చూచెడు వారికి అచ్చము
తోచుదురున్మత్తులవలె,దోగు శిశువులై.47*
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*22.శ్లోకం*.
రథ్యాచర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జితపంథః
యోగీ యోగ నియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవ దేవా!
*తాత్పర్యం:* వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును
*37.కందం*.
దొరికిన వస్త్రములు తొడిగి
యరుగుచు పుణ్యములు పాపమంటని దారిన్
మరలించగ మది పరముకు
తరియింపగలడు విరాగి తథ్యము సుమ్మా!48*
*38.కందం*
చూచుచు తనలో బ్రహ్మము
యోచన చేయుచు రమించు యోగులు జగతిన్
చూచెడు వారికి నచ్చము
తోచెద రున్మత్తులగతి,దోగు శిశువులై.49*
సింహాద్రి జ్యోతిర్మయి
13.3.2022
👾👾👾👾👾👾👾👾👾👾
23.శ్లో.
కస్త్వం ,కో2హం ,కుత ఆయాతః
కామే జననీ ,కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్నవిచారం.
తాత్పర్యం: సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.
23.A.కం.
నీవెవ్వరు? నేనెవ్వరు?
నీవెక్కడి వాడవయ్య? నీవారేరీ?
ఈ వివరము శోధించుము
ఈ విశ్వము కల యెఱుంగుమిదె తత్వమగున్.50*
23.B.కం.
కనిపించెడి యీ విశ్వము
మనము కలను గాంచునట్టి మాయయె సుమ్మా!
మనమెవ్వరమను తత్వము
మనమందున తఱచి చూడు మర్మము తెలియున్.51*
👾👾👾👾👾👾👾👾👾👾
24.శ్లో.
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః
భవ సమచిత్తం సర్వత్రత్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం.
తాత్పర్యం: నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.
24.A.కం.
నీలో నాలో అన్యుల
లోలోపలనున్న హరియె లోకేశుడురా!
ఆలోచన చేసినచో
ఈ లోపలి తత్వమందు ఇహము తరించున్.52*
24.B.కం.
తమమును విడువక, హరి పా
దము దిక్కనియెడు నిజమును దలపక, లవలే
శమును సహనంబు చూపక
సమచిత్తము సాధ్యమగునె?సాధులకెందున్!53*
👾👾👾👾👾👾👾👾👾👾
25.శ్లో.
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నపి త్యక్త్వాత్మానాం
సర్వత్రో థ సృజ భేదా జ్ఞానం.
తాత్పర్యం: శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు?
25.కం.
కొందరు మిత్రులు,పుత్రులు
కొందరు శత్రువు లనుచును కూడని మతితో
ఎందుకు భేదము మదిలో
అందిన జ్ఞానమ్మగపడు హరియందరిలో.54*
👾👾👾👾👾👾👾👾👾👾
26.శ్లో.
కామం,క్రోధం,లోభం,మోహమ్
త్యక్త్వా2 2త్మానం పశ్యతి సో2 హమ్
ఆత్మ జ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరక నిగూఢాః.
26.A.కం.
కామము,క్రోధము,లోభము
క్షేమమునివ్వవు విడువుము ఖేధము తొలగున్.
నీ మది మోహము వీడిన
స్వామియె నీ యాత్మ యనెడు సత్యము తెలియున్.55*
26.B.కం.
నేనే బ్రహ్మము నగుదును
తానే నాలో కలడను తాదాత్మ్యముతోన్
జ్ఞానము పొందకపోయిన
మానవుడా నరకమందు మగ్గుటకేగున్.56*
👾👾👾👾👾👾👾👾👾👾
27.శ్లో.
గేయం గీతా నామసహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తమ్
దేయం దీన జనాయ చ విత్తం.
తాత్పర్యం: భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను.
27.కం.
చేయుము గీతా గానము
చేయుము మనమున మురారి చింతనమెపుడున్
పాయకు సజ్జన స్నేహ
మ్మీయుము సంపద లితరుల యిడుములు బాపన్.57*
👾👾👾👾👾👾👾👾👾👾
28.శ్లో.
సుఖతః క్రియతే రామా భోగః
పశ్చాత్ హంత శరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణమ్
తదపి న ముంచతి పాపాచరణమ్.
తాత్పర్యం: ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు.
28.కం.
భోగము సుఖమని భ్రమపడి
రోగములనుపొంది కుములు రోజులనైనన్
రాగము, పాపము వీడక
ఆగదు మృతి యని మరచుట ఆశ్చర్యమదే!58*
👾👾👾👾👾👾👾👾👾👾
29.శ్లో.
అర్థమనర్థం భావయ నిత్యమ్
నాస్తి తతః సుఖలేశః సత్యమ్
పుత్రాదపి ధనభాజామ్ భీతిః
సర్వత్రైషా విహితా రీతిః
తాత్పర్యం: ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది.
29.కం.
అర్థము తెచ్చు ననర్థము
లర్థముకై తనయులైన నగుదురు శత్రుల్
అర్థము లక్షణమిదియే
అర్థములో లేదు సుఖము ,హాని కలిగెడున్.59*
👾👾👾👾👾👾👾👾👾👾
30.శ్లో.
ప్రాణాయామం ప్రత్యాహారమ్
నిత్యానిత్య వివేక విచారమ్
జాప్యసమేత సమాధి విధానమ్
కుర్వవధానం మహదవధానమ్.
తాత్పర్యం: సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.
30.A.కం.
చేయుము ప్రాణాయామము
రోయుము ఇంద్రియసుఖములు, లోలత విడుమా!
చేయుము జపమును,ధ్యానము
కాయముపై ధ్యాస విడిచి గడుపుము దినముల్.60*
30.B.కం.
తెలియుము లోకమసత్యము
కలదను యీ జీవితమ్ము క్షణభంగురమే!
సలుపుము నిత్యానిత్య
మ్ములయోచన సతము ముక్తి పథమదే!61*
👾👾👾👾👾👾👾👾👾👾
31.శ్లో.
గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థందేవమ్.
తాత్పర్యం: అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును
31.A.కం.
గురు చరణములను నమ్మిన
తరమౌ భవసాగరమ్ము తరియింపంగా
తరిమెడు కోర్కెలుడుప,కరి
వరదుని కాంచగలవు మది వైకుంఠమునన్.62*
మంగళం
32.కం.
హరి కరుణను తరమాయెను
పరమగురులు శంకరకృత వరకావ్యమ్మున్
విరచించగ కందమ్మున
తరియించెను నాదు జన్మ ధన్యత చెందెన్.63*
భజ గోవిందం సంపూర్ణం
👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾
నా ఈ భజ గోవింద కంద స్వేచ్ఛానువాదాన్ని ఇంతకాలం ఆదరించిన మిత్రులందరికీ అభివాదములు.నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం తో నేను చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి నందుకు నమస్సులు.
ధన్యవాదాలు.
*****************************👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾👾*****************************
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*19.శ్లోకం*
యోగరతోవా భోగరతోవా
సంగరతోవా సంగవిహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తమ్
నందతి నందతి నందత్యేవా.
*తాత్పర్యం*: యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు
*32.కందం*
యోగము నెఱిగిన వాడును
భోగమనుభవించుచుండు భోగియునైనన్
రాగము గలవాడైన, వి
రాగియునైనను మమత్వ రహితుడె యతియౌ.
*33.కందం*
పొందుచు నున్నను భోగము
చెందక తాదాత్మ్యమందు చిత్తములోనన్
విందుగ బ్రహ్మము నెఱుగుచు
నందే నిత్యము రమించునతడే యతియౌ.
*34.కందం*.
సమమని యోగము భోగము
కమల దళమ్మున జలమటు కలవని వాడే
తమమంటని నిష్కాముం
డమలిన యానందమంది యలరుచునుండున్.
సింహాద్రి జ్యోతిర్మయి
10.3.2022
*భజ గోవిందం*
(స్వేచ్ఛానువాదం కందంలో)
*24.శ్లోకం*.
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః
భవ సమచిత్తం సర్వత్రత్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం.
*తాత్పర్యం*: నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.
*41.కందం*.
నీలో నాలో అన్యుల
లోలోపలనున్న హరియె లోకేశుడురా!
ఆలోచన చేసినచో
నీ లోపలి క్రోధముడుగు నిజము తెలియుగా.
*42.కందం*.
తమమును విడువక, హరి పా
దము దిక్కనియెడు నిజమును దలపక, లవలే
శము మతి సహనము చూపక
సమచిత్తము సాధ్యమగునె?సాధులకెందున్!
సింహాద్రి జ్యోతిర్మయి
15.3.2022
Comments
Post a Comment