11/5.రోజుకో చరిత్ర (మే)







1st Sunday of May
World laughter day


*International No Diet Day* is Observed every year on *May 6*
 International No Diet Day is a global celebration that promotes body positivity, encourages self-acceptance, and challenges the societal obsession with thinness. This important day aims to raise awareness about fatphobia, weight discrimination, and the harmful effects of extreme dieting, reminding us to prioritise both physical and mental well-being over restrictive eating habits driven by social pressures.


Ultimately, International No Diet Day encourages acceptance of body diversity, urging us to show compassion not just to ourselves, but to others, by celebrating everyone’s unique shape, size, and identity.



  • International Sun Day is recognised globally as an opportunity to acknowledge the importance of the Sun and to promote solar energy as a sustainable and environmentally friendly energy source.



 Mother's day 
Second Sunday of May 




న (ర్స)మ్మే దేవత

ఒక పురిటికందు
నీ చేతుల్లో
తొలిసారి
కనుతెరిచినప్పుడు
బిడ్డను
తల్లి చేతుల్లో పెట్టేవేళ
నీ పెదవులపై
చిరునవ్వు మొలకలు
ఒక నిండు ప్రాణం
నీ చేతుల్లో
విలవిలలాడుతూ
కనుమూసేటప్పుడు
అచేతనమైన 
ఆ శరీరాన్ని
అయినవాళ్ళకు
 అప్పగించే వేళ
నీ మదిలో
నిస్సహాయపు భావవీచికలు
నీ ఉద్యోగ జీవితంలో
వేలాది జననమరణాలకు
మౌన సాక్ష్యంగా ఉంటూనే
ఆ నడుమ జరిగే
బ్రతుకు పోరాటాన్ని
గెలిపించడానికి
మాటల మైపూతలతో
సేవల కారుణ్యంతో
సాంత్వన నిచ్చే
ఆరోగ్య ప్రదాతవు
అమృతపాణివి నీవు
వైద్యులకూ
వ్యాధిగ్రస్తులకూ మధ్య వారధివై
ఏ సంబంధమూ లేకున్నా
మానవతా బంధమై
విశ్వాసాన్ని
శ్వాసలో నింపే
 సుమ గంధమై 
పరిమళించే
ఓ నర్సమ్మా!
నీకు 
అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు.💐💐

అంకితం:
 
( MS (మాస్టర్స్ ఇన్ నర్సింగ్) చేసి అమెరికాలోని
శానోజే (Sanjose)లోని
రీజనల్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో
క్రిటికల్ కేర్ డైరెక్టర్ గా అమూల్యమైన సేవలందిస్తూ
తన
ప్రతిభతో అందరి మన్ననలు పొందుతున్న మా చిన్న మరదలు సింహాద్రి భార్గవికి శుభాశీస్సులతో ఈ కవితను అంకితం చేస్తున్నాను .

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
12.5.2021
ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే‌
మే15


*కుటుంబం సుమ కదంబం*

అమ్మానాన్నలు
అత్తామామలు
అన్నదమ్ములు
అక్కాచెల్లెళ్ళు
వదినామరదళ్ళు 
బావామరుదులు
తోడికోడళ్ళు, తోడల్లుళ్ళు 
కొడుకూ కోడలూ
కూతురూ అల్లుడూ
మనవలు మనవరాళ్ళు
అనే పరిమళభరితమైన పువ్వులతో
అల్లుకున్న కదంబమే
అందమైన కుటుంబం
పసితనానికి ఆధారం
వృద్ధాప్యానికి ఊతం
పిల్లల తప్పుల్ని మన్నించే పెద్దమనసు
పెద్దల కష్టాన్ని గమనించే సున్నితత్వం
శుభాశుభాలకు చేదోడు
అనుబంధాలతో అల్లిన గూడు
కోడలిలో కూతుర్ని
అత్తలో అమ్మని
చూడగలిగే సంస్కారం
అన్నదమ్ముల కష్టంలో
కాసింత ఓదార్పు
అందరూ నావారేనన్న ఆప్యాయత
ఇంతకంటే ఉత్తమమైన కుటుంబం ఏది?
అంతటి ఉన్నతమైన కుటుంబం మాది

అని సగర్వంగా చెప్పుకోగలిగిన 
ప్రతి కుటుంబానికీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు.
💐💐

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు



హై(పర్) టెన్షన్

చేసిన తప్పులు,అప్పులు
మెప్పులకోసం ఆడంబరాలు
అణచుకున్న అసహనం
పైకి చెప్పలేని పశ్చాత్తాపం
తప్పించుకోలేని బాధ్యతలు 
తగిలించుకునే బంధాలు 
అత్యాశతో పెట్టిన పరుగులు
నిస్పృహలోకి నెట్టేసే నైరాశ్యాలు
అదుపులేని అలవాట్లు
అడుగు కదపని సౌఖ్యాలు
మనసే మందిరం
దేహమే దేవాలయమన్న
మహోపదేశాన్ని మరచి
నాలోని అపరిచితుడు
కొనితెచ్చిన కష్టమే
ఈ హై(పర్) టెన్షన్
కొంతవరకూ వారసత్వ మైనా
చాలావరకూ స్వయంకృతాపరాధం
నరనరాన జీర్ణించుకోవలసిన
ఈ వాస్తవాన్ని విస్మరించి
నరనరాన ఒత్తిడిని విస్తరించి
మధుమేహాన్ని జతచేసి
తెచ్చుకునే ముప్పుకు
ముద్దు పేరే BP

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.5.2021


*వాస్తవాల (వస్తుప్రదర్శన) శాల*

ముగిసిపోయిన చరిత్రకు
మూగసాక్ష్యాలు
మానవుడి
వైకల్యాలను
ఔన్నత్యాలను
చాటి చెప్పే ఆధారాలు
కాలగర్భంలో కలిసిపోయిన
నిన్నటి ప్రపంచాన్ని
నిలబెట్టి చూపే
అద్భుతాల నిలయాలు
తరతరాల మానవ మేధస్సును
తరచి తరచి చూసి
తలచి తలచి మురిసే
అవకాశాన్ని ఇచ్చే
అవశేషాల మందిరాలు
మనం నడచివచ్చిన దారి
మహనీయతను చాటిచెప్పే 
పురావస్తు కళాఖండాలను
నిక్షిప్తం చేసుకున్న
మాసిపోని నిజాల జాడలు
మించిన సౌందర్యపిపాసకే కాదు
మింగుడుపడని చేదు వాస్తవాలకు కూడా
ఆధారభూతమైన
మానవుడి నైజాల నీడలు
 మన మ్యూజియంలు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.5.2023

Every year on May 21st, India observes National Anti-Terrorism Day. This somber occasion serves not only as a day of remembrance but also as a powerful call to action in the ongoing fight against terrorism. But why this specific date? The answer lies in a pivotal moment in Indian history, the assassination of former Prime Minister Rajiv Gandhi.






Menstrual Hygiene Day—a day dedicated to period-positivity and spreading awareness about maintaining hygiene during "that time of the month" as well! Why 28th May, you wonder? Well, it's a clever nod to the average menstrual cycle, which is about 28 days for most women. 

And this year, we're celebrating under the theme "Together for a #PeriodFriendlyWorld." It's all about breaking taboos, promoting education, and creating a supportive environment where periods are no longer hush-hush but openly discussed and understood.










*నో టొబాకో డే‌*(31.5.2023) సందర్భంగా నా కవిత 

*నో (స్మో) కింగ్*

సరదా సరదా సిగరెట్టు అని రేలంగి అన్నాడనో
బీడీలు తాగండి బాబులూ అని బాలకృష్ణ చెప్పాడనో
వినుడు వినుడు ఈ సిగరెట్ గాథ అని నాగార్జున పాడాడనో
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అని గిరీశం లెక్చర్ ఇచ్చాడనో
దాని జోలికి పోవడం మంచిది కాదు 

రేఖ తన రెండు గాజుల్ని
అమ్ముకోవలసి వచ్చింది అని
ఆమె సోదరుడు శంకర్ చెప్పటం చూసి
థియేటర్లలో ఎగతాళిగా నవ్వుకొనే విషయం కాదు

 కుటుంబం కోసం పొగాకుకు దూరంగా ఉండమని రాహుల్ ద్రావిడ్ సందేశం కాలక్షేపం కోసం కాదు

ఈ దేశానికి ఏమయింది?
ఎవ్వరూ నోరుమెదపరెందుకని?
అనే ప్రశ్నను పేరడీ చేయటం కాదు

బహిరంగ ప్రదేశాలలో
పొగతాగడం నేరమవడం వల్ల
ఇంట్లోనే తాగి
ఒంట్లోని ఊపిరితిత్తులను
పొగచూరిస్తున్నారు
సామాజిక బాధ్యతను విస్మరించి 
హీరోలే గుట్కాలకు 
ప్రకటనలు ఇవ్వడం
అందంగా పెయింట్ చేసిన గోడలపై
అసహ్యంగా ఏర్పడిన
ఎర్రటి గుట్కా మరకలా
ఏహ్యతను కలిగిస్తూనే 
చివరికిలాగే
నెత్తురు కక్కుకుని ఛస్తావు అని చెప్పకనే చెబుతున్నట్లు ఉంది

అశ్వత్థామ హతః కుంజరః అన్న ధర్మరాజు ఆపద్ధర్మ అసత్యంలా
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే చట్టబద్ధమైన
హెచ్చరిక
కంటికి కానరానిదై
ఉసురుతీసే ఉపాయంలా ఉంది 

ధవళ వస్త్రాల మాటున తమ
దుర్మార్గాలను దాచుకుంటున్న
రాజకీయ నాయకుల్లా
పైకి తెల్లగా మెరిసిపోయే 
ఫిల్టర్ సిగరెట్ 
లోపల విషాన్ని దాచుకుంటున్నది
 

ముసలివాళ్ళకు పొగచుట్ట
ధనవంతుడి సిగార్
మధ్యతరగతికి సిగరెట్
పేదవాడికి బీడీ
అని మన సినిమాలు
సిద్దాంతం చేసేసినా

ఏ రాయి అయితేనేం
పళ్ళూడగొట్టుకోవడానికి అన్నట్టు
చుట్ట బీడీ సిగరెట్ 
ఖైనీ గుట్కా తంబాకు
ఏ పేరయితేనేం?
 రావణాసురుడి పదితలల్లా అన్నీ 
పొగాకు రాక్షసుడివే

 ఆరోగ్యమనే సీతను
అపహరించుకుపోయే
ఈ రాక్షసుడిని
ఆత్మనిబ్బరం అనే బాణంతో తగలబెట్టి
బ్రతుకును దసరా పండుగ చేసుకో

జానెడు కూడా లేని సిగరెట్టుతో
నీకు జన్మనిచ్చిన వారిని
జన్మంతా తోడు ఉంటావని నమ్మిన జీవిత భాగస్వామిని
నువ్వు జన్మనిచ్చినవారిని
వారి ఖర్మానికి వారిని వదిలేస్తూ
 జీవితాలను నుసి చేస్తూ
వారి ఆశల దీపాలనూ
నీ ప్రాణ దీపాన్ని కూడా
ఆర్పేసుకోకుండా ఉండాలంటే
ఆ *కింగ్ సైజ్ సిగరెట్* తో
తక్షణం చెప్పేసేయ్ ఇలా
ఈరోజు నుంచి ఇక
*నో (స్మో) కింగ్*  

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
31.5.2023





Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ