1/6శ్రీ విష్ణు కందం

      నందము నొసగెడు చిరుచిరు నగవుల మొలకై
‌ అందిన అందని నిధియౌ
      సుందర వదనారవిందు శోభను గనరే.

85.నిదురించడు నీ పాపడు
      ఇది చోద్యమ్మో యశోద ఎటులన పడతుల్
     యదుకుల భూషణు డదివిని
    నిదానముగ కన్నుమూసి నిదుర నటించెన్.

           శ్రీ విష్ణు కందం......... సింహాద్రి.

86. మన్నులు వెన్నల మాదిరి
కన్నయ్యా!తింటివనుచు కవితల
యా పో
తన్న 
       వెన్నుడవై తింటివనుచు వినిచిన ఆ పో
       తన్న కవిత లెంత సుధలు
   ‌ ‍ విన్నను కన్నయ్య కథలు వీనుల విందౌ.

    ‍ శ్రీ విష్ణు కందం...... సింహాద్రి.

87. దుష్టుల‌శిక్షించి ధరణి
        శిష్టుల దయ రక్ష సేయ శ్రీ కృష్ణుడవై
         ‌అష్టమి‌ పుట్టిన స్వామీ!
        ఇష్టములను దీర్పవయ్య ఇదె కైమోడ్తున్.

                శ్రీ విష్ణు కందం...., సింహాద్రి.



విష్ణు కందం...... సింహాద్రి.


Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ