కళామిత్రమండలి..


కళామిత్ర మండలి గీతం

[10/15, 10:49 PM] Jyothirmai Simhadri: [10/15, 7:40 PM] Jyothirmai Simhadri: కళామిత్ర‌మండలి
ఇదే తెలుగు లోగిలి
లలిత కళారాధనలో
తరిస్తున్న సేవాంజలి

ప్రకాశం ప్రమిదలోన
సాహితీ దీపకళిక
కొడిగట్టక వెలుగులీన
జేయుచుండె కదా నూనె
మహనీయుల జయంతులు
మహా కవుల వర్థంతులు
మరచిపోక మరువనీక
శ్రద్ధతోటి సలుపు సంస్థ

 కళామిత్ర మండలి
అన్న పేరు సార్థకమే
అని యెల్లరు తలపోయగ
సాహితీ మైత్రి నెరపి
పదుగురినీ కలుపుకుని
ప్రతి పని తానందుకుని
శ్రమయే సౌందర్య మనగ
పేరు మోసినట్టి సంస్థ



 తెలుగంటే తగని ప్రేమ
భాషే తన శ్వాస సుమా
భాషను కాపాడుకొనే
ఉత్సాహమె ఉద్యమమా
ప్రతిభ వెతికి గుర్తించి
పురస్కార మిచ్చి మెచ్చి
భాషామతల్లి రుణం
తీర్చెడి జాతీయ సంస్థ

 బడిపిల్లల కోసమని
వ్యాసరచన, పద్యపఠన 
దేశభక్తి గీతాలు
జానపదం ,నాట్యాలు
యువకవులకు ప్రోత్సాహం
స్ఫూర్తి నింపు చైతన్యం
కలబోసి ప్రతి యేడు
ఉత్సవాలు చేయుసంస్థ


 రామకృష్ణ ‌తోడు నిలిచె
అరుణ దీప్తు లావరించె
మల్లన్న, కోటయ్య
మాటే సుప్రసాదమాయె
చందు చిరుత నాట్యాలు
సభకు శోభలద్దగా
జాతీయ స్థాయిలోన
తెలుగు కీర్తి చాటు సంస్థ

కళామిత్ర మండలి
జ్యోతిర్మయమీ లోగిలి 

https://drive.google.com/file/d/11b5bqlMj9hToq2WIMrjE4YexZXWAy-n9/view?usp=drivesdk

కళామిత్రమండలి తెలుగు లోగిలి జాతీయస్థాయి పురస్కార ప్రదానోత్సవ సభ 2022 నవంబర్ 27 వ తేదీన ఎన్ టి ఆర్ కళాక్షేత్రంలో జరిగింది.
ఇది 16 వ వార్షికోత్సవం
ఈ సభలో నన్ను కళామిత్ర మండలి తెలుగు లోగిలి సాహితీ సంస్థకు 
ప్రధాన కార్యదర్శి గా ప్రకటించటం జరిగింది.
ఈ ఏడు జీవన సాఫల్య పురస్కారం పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి ఇవ్వటం జరిగింది.
ఇది కాకుండా 7 జాతీయ పురస్కారాలు,20 రాష్ట్రీయ పురస్కారాలు ప్రదానం చేశారు.

కళామిత్ర ఉత్సవ

*వేదికకు వందనం*

నిన్న అనగా 27.11.2022 ఆదివారం 
*కళామిత్ర మండలి* తెలుగు లోగిలి 16 వ వార్షికోత్సవ సభలో
వేదిక నలంకరించి
కవులు ,భాషాభిమానుల జేజేలందుకుని ఠీవిగా
మల్లెపూదండ
మంగళారతులతో విరాజిల్లి
ఆశీస్సులొసగిన
 *తెలుగుతల్లికి🙏🙏🙏*,

  సభలో పాల్గొని
వేదికను,వేడుకను సుసంపన్నం చేసిన
విశిష్ట అతిథులు

కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు
*డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గారికి🙏*,

సరస్వతీ పుత్రులు
*డాక్టర్ భూసురపల్లి వారికి🙏*,

హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు  
శ్రీ 
*గురవారెడ్డి గారికి🙏*,

నాగభైరవ సాహితీ పీఠం అధ్యక్షులు *డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారికి🙏*,

సాహితీ పోషకులు *శ్రీ వీరవల్లి సుబ్బారావు గారికి 🙏*

సభా నిర్వహణ సమర్ధవంతంగా చేసిన న ర సం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు *శ్రీమతి తేళ్ళ అరుణ గారికి* 🙏

కార్యక్రమంలో 
అడుగడుగునా తమ సహకారం అందించిన
ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య గౌరవ అధ్యక్షులు 
 *శ్రీ మిడసల మల్లికార్జున రావు గారికి🙏*,

కృష్ణదేవరాయ సాహితీ సంస్థ అధ్యక్షులు 
*కుర్రా ప్రసాద్ బాబు గారికి🙏*,

ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య కోశాధికారి 
*డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు గారికి🙏*,

కళామిత్ర మండలి ఆశయ గీతాన్ని హృద్యంగా ఆలపించిన
ప్రజా గాయకులు శ్రీ 
*నూకతోటి శరత్ బాబు గారికి🙏*

ప్రముఖ కవి శ్రీ 
*కె.వి.రమణారెడ్డి గారికి🙏*

తెలుగుతల్లి ప్రార్థనా గీతాన్ని శ్రావ్యంగా ఆలపించి సభను రంజింపజేసిన *శ్రీమతి మున్నంగి రాహేలు గారికి🙏* 

ఘనంగా సభను జరిపి అందరి ప్రశంసలను అందుకున్న
కళామిత్ర మండలి అధ్యక్షులు *శ్రీ డాక్టర్ నూనె అంకమ్మ రావు గారికి🙏*,

ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన *శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారికి 😜* ధన్యవాదాలు మరియు
అభినందనలు. 

*సింహాద్రి జ్యోతిర్మయి* 
కళామిత్ర మండలి
ప్రధాన కార్యదర్శి 
28.11.2022


*వేడుకకు వందనం *

ఈ కార్యక్రమంలో  
శ్రీమతి నూనె వెంకాయమ్మ-వెంకట రత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారం అందుకున్న 
గౌll *పద్మశ్రీ *ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి🙏🙏🙏* 

డాక్టర్ నాగభైరవ& డాక్టర్ మండువ నరసింహారావు స్మారక పురస్కారం అందుకున్న
శ్రీ *డి.వి.యం.సత్యనారాయణ (ఆంధ్రప్రదేశ్) గారికి🙏🙏* 

శ్రీ కొంపల్లి బాలకృష్ణ స్మారక పురస్కారం అందుకున్న శ్రీ 
*పి.చంద్రశేఖర ఆజాద్(ఆంధ్రప్రదేశ్) గారికి🙏🙏* 

శ్రీమతి సింహాద్రి విశాలాక్షి స్మారక పురస్కారం అందుకున్న డాక్టర్ *సగిలి సుధారాణి(తెలంగాణ) గారికి🙏🙏*

శ్రీ తన్నీరు కోటయ్య స్మారక పురస్కారం అందుకున్న
ఆచార్య *యం.రామనాథం నాయుడు(కర్ణాటక) గారికి🙏🙏*)

శ్రీ వంకాయలపాటి రామకృష్ణ స్మారక పురస్కారం అందుకున్న *డాక్టర్ శ్రీపురం యజ్ఞ శేఖర్(తమిళనాడు) గారికి🙏🙏*

శ్రీ సీతాదేవి-నాగేశ్వరరావు స్మారక పురస్కారం అందుకున్న *డాక్టర్ తాటి నరహరి(మహారాష్ట్ర) గారికి🙏🙏* 

మేకల జయరామరెడ్డి స్మారక పురస్కారం అందుకున్న
*శ్రీ టి.యస్.ఆర్.కె.ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) గారికి 🙏🙏*

అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సరస్వతీ పుత్ర డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు ప్రకటించిన తమ తల్లిదండ్రులు స్వర్గీయ భూసురపల్లి సుబ్బరత్నమ్మ- ఆదిశేషయ్య దంపతుల తొలి స్మారక పురస్కారాన్ని అందుకున్న
న ర సం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి *తేళ్ళ అరుణ గారికి🙏🙏* 

ఇక *రాష్ట్ర పురస్కారాలు* అందుకున్న

శ్రీ *కుప్పిలి వెంకట రాజారావు గారు🙏* శ్రీకాకుళం జిల్లా 

*శ్రీ చొక్కపు లక్ష్మునాయుడు గారు🙏*, విజయనగరం జిల్లా (వీరు హాజరు కాలేకపోయారు.) 

*శ్రీమతి సాలిపల్లి శ్రీమణి గారు🙏*, విశాఖపట్నం జిల్లా 

*శ్రీపాద సీతామహాలక్ష్మి గారు🙏*,తూర్పు గోదావరి జిల్లా 

శ్రీమతి *కాసర లక్ష్మీ సరోజా రెడ్డి గారు🙏*, పశ్చిమ గోదావరి జిల్లా 

శ్రీమతి *గుడిపూడి రాధికా రాణి గారు🙏*, కృష్ణాజిల్లా 

శ్రీ *షేక్ కరిముల్లా గారు🙏* , గుంటూరు జిల్లా

శ్రీ *కోసూరు రత్నం గారు🙏* నెల్లూరు జిల్లా

శ్రీ *పి.తులసినాధం నాయుడు గారు🙏* చిత్తూరు జిల్లా

శ్రీ *గొంటుముక్కల గోవిందు గారు🙏* కడప జిల్లా

శ్రీమతి *కె.సుబ్బలక్ష్మమ్మ గారు🙏* కర్నూలు జిల్లా 

శ్రీ *జూటూరు తులసీదాస్ గారు🙏* అనంతపురం జిల్లా

ఇక ప్రకాశం జిల్లాకు చెందిన 

శ్రీ *ఆర్.భరద్వాజ గారు🙏* 

శ్రీ *గొట్టిపాటి నాగేశ్వరరావు గారు🙏* 

శ్రీ *వడలి రాధాకృష్ణ గారు🙏*

శ్రీ *గుడ్లూరి వేంకటరాయ కవి గారు🙏*

శ్రీ *జి.వి.శేషగిరిరావు గారు🙏*

చిన్నారి *చేజెర్ల శ్రీజ🙌*

శ్రీమతి *కత్తి కృపావరం గారు🙏*

శ్రీ *తానికొండ చెన్నయ్య గారు🙏* 



వీరంతా కళామిత్ర మండలి ఎంపికను అంగీకరించి,
ఆహ్వానాన్ని మన్నించి,
ఆనందంగా పురస్కారాలను స్వీకరించి

మా లోపాలేవైనా ఉంటే
సహృదయంతో భరించి 

సభను అలంకరించి అలరించినందుకు
జాతీయ, రాష్ట్ర పురస్కార గ్రహీతలు అందరికీ పేరుపేరునా
కృతజ్ఞతలు
అభినందనలు
శుభాకాంక్షలు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
మరియు
కళామిత్ర మండలి
ప్రధాన కార్యదర్శి
28.11.2022

ఎందరో మహానుభావులు

 *అందరికీ వందనం*

వేదిక శోభించేది,వేడుక కన్నుల పండువ అయ్యేది 
సభ విలువ పెరిగేది
సభకు నిండుదనం చేకూరేది
వేదిక ముందు ఉన్న ప్రేక్షకుల వల్లనే.
ఎందరో ప్రముఖులు వారంతా ఎటువంటి భేషజం లేకుండా విచ్చేసి ఆద్యంతమూ కార్యక్రమాలను వీక్షించి,ఆనందించి, ప్రశంసించి సభను జయప్రదంగా నడిపించి
శుభప్రదంగా దీవించిన
భాషాభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

సభలోని వీక్షకులకు, ప్రేక్షకులకు తమ చక్కని నృత్యాలతో ఆనందం కలిగించిన చిన్నారులందరికీ
వారికి చక్కని నృత్యాలు నేర్పిన చందూగారికి,
వారిచేత చక్కని నృత్యాలు చేయించిన తల్లిదండ్రులకు
వారి వెన్నంటి ఉండి ఆ కార్యక్రమాన్ని నడిపించిన బాలకోటయ్య గారికి

పరిశుభ్రత మొదలుకొని ప్రతీ అవసరాన్నీ సమకూర్చిన ఎన్ టి ఆర్ కళాక్షేత్రం నిర్వాహకులకు 

ఇంకా ఎవరినైనా ప్రస్తావించటం మరచిపోయి ఉంటే వారందరికీ

ఎందరో మహానుభావులు అందరికీ మా కళామిత్ర మండలి సమర్పిస్తోంది
శతథా వందనాలు.🙏🙏🙏

శుభమ్
మరలా వచ్చే ఏడాది కలుసుకుందాం.
అంతవరకూ సెలవ్.(ఈ వేడుకకు మాత్రమే సుమా.😍)
🙏🙏🙏

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,
కళామిత్ర మండలి
ప్రధాన కార్యదర్శి
28.11.2022

















*సాదర ఆహ్వానం*

*కళామిత్రమండలి* (తెలుగు లోగిలి) సాహితీ సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నేడు అనగా *17.6.2023 శనివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక CPI office మల్లయ్య లింగం భవనం* లో 
*సాహితీ రత్న శ్రీ పబ్బిశెట్టి వేంకటేశ్వర్లు గారు* రచించిన గ్రంథాల ఆవిష్కరణ సభ జరగనుంది. కావున కవిమిత్రులు, సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.గ్రంథావిష్కరణ అనంతరం 16 మంది కవి మిత్రులకు *ఆత్మీయసత్కారం*, విందు కూడా కలదు.
ఇదే ప్రత్యేక ఆహ్వానం గా భావించి విచ్చేయగలరు.

ఆహ్వానించువారు

*డాక్టర్ నూనె అంకమ్మరావు*
(కళామిత్రమండలి అధ్యక్షులు)
*శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి*
(కళామిత్రమండలి  ప్రధాన కార్యదర్శి)







కళా మిత్ర మండలి (తెలుగు లోగిలి) వారి జాతీయ స్థాయి పురస్కారం శ్రీ భువన చంద్ర (సినీ గేయ రచయిత) మరియు కవులకు పురస్కారాల సభ

    వీడియో 
http://youtu.be/r1scckW-g5M?si=0bKxDWD7kNnsjvmV



Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ