అరుణ కిరణం అరుణ గారి ఇంటర్వ్యూ https://youtu.be/89_Lgv-dBgI?si=o92n7vXh05Pw-BzD 2017 లో అరుణ గారి ఆశయఫలంగా రూపుదిద్దుకున్న నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఉద్దేశ్యాలను ఉటంకిస్తూ నేను రాసిన *నరసం ఆశయగీతం* నవ్యాంధ్ర రాష్ట్రాన రచయిత్రుల సంఘమిది కవయిత్రుల మదిలోపల తళుకుమన్న తలపొక్కటి నరసంగా ఈనాడిటు పురుడు పోసుకుంది గతకాలం సమీక్షించి నేటి స్థితిని వీక్షించి అందమైన భవితవైపు అడుగు కదపటానికై అతివలంత ఏకమై ఐక్యభావ వేదికై మా స్వప్నం సాకారం చేసుకొనగ శ్రమిస్తాం మొల్ల నుండి మొదలుకొని ఎల్లరు కవయిత్రులు కావ్యజగతినెల్ల తాము జ్యోతిర్మయ మొనరింపగ విరచించిన కావ్యవిరుల సాహితీ సౌరభాలు వెదజల్లే ప్రస్థానం అదే మా శుభాశయం పద్య వచన కవనము కవిత నవల గేయము సంప్రదాయ సాహిత్యం వైప్లవ్యం ఆధునికం మార్గమేదైనగాని సాధించిన అభ్యుదయం కలబోసుకుంటాము కదలి సాగిపోతాము సేవకు మేం ముందుంటాం సమానత్వ మాశిస్తాం స్త్రీలకొరకు స్పందిస్తాం న్యాయానికి నినదిస్తాం మానవీయ విలువలు మట్టిపాలు కానీయం సంఘహితం మా లక్ష్యం మా భూమిక సాహిత్యం పుస్తకాలు ప్రచురించి మేటి రచన సమీక్షించి సాహిత్య సభలు జరిపి సంస్థలత...
1.( సా)మాన్యుడవని నువ్వు శిలవై కోవెలలో కొలువై ఉంటే నిన్ను మేమంతా భగవంతుడవని గుర్తించేవాళ్ళం భక్తితో చేతులు మోడ్చేవాళ్ళం అనుగ్రహిస్తావని ఆశపడి గుర్తుంచుకుని మరీ మొక్కుబడులు చెల్లించేవాళ్ళం శపిస్తావని భయపడి పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించేవాళ్ళం కానీ నువ్వేమో మామూలు మనిషిలా మామధ్యన తిరిగేస్తున్నావు అందుకనే నీవు అందుబాటులో ఉన్న అనంతమైన నిధివన్న నిజం నమ్మశక్యం కాకుండా ఉంది ఆత్మజ్ఞానమనే నిప్పును అతి సామాన్యుడవని నమ్మించే నివురుతో కప్పి నటించే నిన్ను గుర్తించలేని, గుర్తించినా మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోయే మాకోసం నువ్వు అవ్యాజమైన అనుగ్రహ వర్షాన్ని కురిపించే మేఘమై కరుణిస్తూనే ఉన్నావు మా అజ్ఞానాన్ని అతి వినయాన్ని అవిధేయతను పదే పదే క్షమిస్తూనే ఉన్నావు అందుకు నీ దర్శనమే మాకు నిదర్శనం.🙏🙏🙏 సింహాద్రి జ్యోతిర్మయి పంచవటి శిష్యురాలు 2.3.2026 సోమవారం 🦋🦋🦋🦋🦋🦋🦋🦋 2. ఓం శ్రీ ***** గురుభ్యోన్నమః **...
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 గేయ రామాయణం బాలకాండ (142 చరణాలు) ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సులు.మా ఇంటి పేరు జంగం. నా కలం పేరు సింహాద్రి జ్యోతిర్మయి. నేను 2002 వ సంవత్సరంలో గేయరామాయణం వ్రాశాను. స్వర్గీయురాలైన మా తల్లిగారు శ్రీమతి సింహాద్రి విశాలాక్షి గారికి అంకితంగా ఈ గేయరామాయణం రాయటం జరిగింది.దీనిని ఈ శ్రీరామ నవమి నుండి ముఖ పుస్తక మిత్రులందరికీ అందించాలనే సంకల్పం ఈ శుభోదయాన నాకు కలిగింది. ఈ గేయం దాదాపుగా వెయ్యి చరణాలు కలిగి ఉంటుంది.రాముడికి వెయ్యి నూట పదహార్లు సమర్పించాలని నా ఆశ.ఈ గేయాన్ని యథావాల్మీకంగా రాశాను.ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వచనం ఆధారంగా స్వీకరించాను. భద్రాచలం గురువులు నా గేయ రామాయణం విని నన్ను వనితా వాల్మీకి అని ప్రస్తుతించి ఆశీర్వదించారు. ఈ గేయాన్ని కస్తూరి రంగ రంగా ట్యూన్ లో పాడుకోవచ్చు.మిత్రులు నా ప్రయత్నాన్ని ఆదరించి ,ఆశీర్వదిస్తారని ఆశిస్తాను. అందరికీ ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మీ సింహాద్రి జ్యోతిర్మయి. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరా...
Comments
Post a Comment