Posts

4/3.*గేయ రామాయణం.* అరణ్య కాండ

Image
గేయ రామాయణం అరణ్య కాండ (172 చరణాలు) 1. అరణ్యకాండలో రాముని అవతార పరమార్థమే ఉన్నది అవనిపై క్రూర రాక్షసుల పీడ ఇటుపైన అంతమ్ము కానున్నది 260 2. సీతయు లక్ష్మణుడు వెంటసాగ రాముడు దండకావని చేరెను తపోధనులతో నిండి యలరు ఋష్యాశ్రమాలనే అట చూచెను 261 3. దండకారణ్యమ్ము చేరుకున్న రామునకు ఆతిథ్యమిచ్చి మునులు క్రూరులౌ రాక్షసుల బారినుండి తమనింక రక్షింపమని ‌ వేడిరి 262 4. మునివరుల కభయమ్ము నిచ్చి పిదప దాశరథి అడవి మధ్యకు చేరెను అక్కడొక భీకరాకారుడైన రక్కసుడు అడ్డమై ఇటు పలికెను 263 5. నరులార! నేను విరాధుండను  బ్రహ్మ చే వరములే పొందినాను నేనెట్టి ఆయుధాలకును చావను అని పలికి పట్టుకొనె సీతమ్మను 264. సశేషం  సింహాద్రి జ్యోతిర్మయి 14.5.2018 గేయ రామాయణం అరణ్య కాండ 6. భయముతో విహ్వలించిన సీతను విడిపించ రామలక్ష్మణులిద్దరూ వేగమే తమ వాడి బాణాలను వాడిపై గుప్పించి నొప్పించిరి 265 7. గాయపడి ఆగ్రహించిన అసురుడు సీతను నేలపై దించివేసి తన రెండు భుజములా వారినెత్తి  ఆడవిలో అటునిటు పరుగుదీసె 266 8. శ్రీ రామ లక్ష్మణులు ఇర్వురంత తమలోన తామపుడు కూడబలికి అసురుని భుజములను రెండింటిని ఒడుపుతో ఒకసారె తెగనరికిరి...

4/2.*గేయ రామాయణం.* అయోధ్య కాండ

Image
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ గేయ రామాయణం              అయోధ్య కాండ.         ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️   గేయ రామాయణం అయోధ్య కాండ(170 చరణాలు) I 72/18(1-11 చరణాలు) పట్టాభిషేక నిర్ణయం -- కైక వరాలు 1.పాపలూ! అయోధ్య కాండ ఇదిగో ఇటుపైన ఆరంభ మవుతున్నది ఆదర్శమూర్తియా రఘురాముని సుగుణాలకిదె అద్దమవుతున్నది.-143 2. శుభమైన పదహారు కళలతోటి ప్రతిదినము వర్థిల్లు చంద్రుడల్లె సకలమౌ సుగుణాల రాశి తానై రాముడు సర్వులకు హితుడాయెను.144 3. రాజ్యరమ మనసుపడి ఆశించెను తననింక రాముడే ఏలాలని ముదముతో సాకేత ప్రజ‌ తలచెను తమ ప్రభువు రాముడే కావాలని 145 4. తన ప్రజల హృదయమ్ము తానెరింగి దశరథుడు మదినెంతొ సంతసించి అటుపైన పరిపాలనా భారము తనయునకు తానప్పగించ దలచి 146 5. సభ తీర్చి మహరాజు తన‌‌ యోచన సర్వులకు వినిపించి సమ్మతడుగ ఎనలేని హర్షాతిరేకమ్ముతో అందరూ భళి భళీ బాగు అనిరి 147 శ్రీరామ రామ రామా శుభనామ సీతామనోభిరామా 6.  శ్రీరామ  పట్టాభిషేకానికి చైత్రమే సరియైన‌ తరుణమనుచు  ప్రియమార    తనయుణ్ణి చేరబిలిచి దశరథుడు శుభవార్త వినిపించెను   148 7....

నా బ్లాగు గురించి నేను

Image
జ్యోతిర్మయం http://simhadrijyothirmai.blogspot.com నా బ్లాగు *జ్యోతిర్మయం* http://simhadrijyothirmai.blogspot.com నా గురించి నేను నా పేరు సింహాద్రి జ్యోతిర్మయి. మా శ్రీ వారు జంగం రాజశేఖర రావు గారు. MPDO గా ,ఇన్ ఛార్జ్  CEO గా  ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి (2019 లో) రిటైర్ అయ్యారు. నేను కవయిత్రిని. నా కలం పేరు సింహాద్రి . నేను నా 16 వ ఏట నుండి అంటే 1983 నుండి అంటే దాదాపుగా 37 సంవత్సరాలుగా  కవిత్వం రాస్తున్నాను. సుమారు ఒక 20 పుస్తకాలు దాకా రాశాను గానీ ఇంతవరకూ ఏవీ ముద్రించుకోలేదు.( ఈ మధ్యనే 2022లో గుళ్ళపల్లి సుబ్బారావు సాహితీ సంస్థ వారు నేను వ్రాసిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కందానువాదం అనే పుస్తకాన్ని ప్రచురించారు.) అందుకనే  నా రచనలన్నీ కనీసం ఒక చోటైనా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన తో  🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🌺       *జ్యోతిర్మయం*       🌺 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺  అనే ఈ బ్లాగ్ ను తయారుచేసి ఇందులో నా రచనలన్నీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను రాసిన వన్నీ ఏకదంతుని పూజకు ఉపకరించే ఏకవింశతి పత్రాల వలే 21 సబ్ టైటిల్స్ గా ...

14. ఊహలు---ఊసులు

Image
1.మనసెరిగిన స్వామి 2.బోధ...నా..వృత్తిలో 3.నాలోని నేను  4.ఎన్నిసార్లు ప్రేమలో పడ్డానో! 5.తరం మారుతున్నది 6.నాన్నతో నా ఊసులు.. చైతూ  7.కరోనా కాఠిన్యం లో తల్లడిల్లుతున్న ఓ నాన్న మనసు 8.నాన్నగారికో లేఖ 9.సంసారం-సంస్కారం 10.హనుమజ్జయంతి 11.నా ఉద్యోగానుభవాలు-1 12.ముప్ఫై ఏళ్ళనాటి ముచ్చట్లు 13.మార్కులు-పాయింట్లు 14.అత్తమ్మ స్మృతి లో 15.ఆ కాపురం -ప్రేమ సుధాపూరం 16.జై చిరంజీవ 17.సంసారంలో సరిగమలు 18.అనింద్య గణపతి 19.ఏది బెటర్? 20.అసలు పాసవుతానా! 21 చిన్న తమ్ముడు 22.శాడిస్ట్ అత్తగారు  23.సంధ్యా దీపం 24.నాన్నగారితో నా ప్రయాణం  25.అతను ఏమయ్యాడో! 26.అవసరమా! 27.ఆటోవాలా 28.మూడుముళ్ళబంధం..ముప్ఫైమూడళ్ళదిశగా 29.పెను విషాదం 30.నేను-నా కాఫీ ముచ్చట్లు  31.పుస్తకం-నా నేస్తం 32.అతడు,ఆమె అ..సమానం 33.మీకు అర్థమౌతోందా! తెలుగు సినిమాలు  34.వినాయకుడు అమాయకుడు  35.మన (వరాల) తెలుగు  36.ఎందుకంటే ప్రేమంట  37.నా ముగ్గు ముచ్చట్లు  38.ఇంతమాత్రమైనా చేయలేమా  39.నివురుగప్పిన నిప్పు చిలకమర్తి వారి గణపతి  40.ఈ పయనం ఎటువైపు? 41.మౌనమె నా భాష 42.ఎలా పెంచుతున్నా...